రోసేసి
వికీపీడియా నుండి
| రోసేసి | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Flower of Rosa arvensis
|
|||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
రోసేసి ప్రపంచ విస్తరణ
|
|||||||||||
|
|
|||||||||||
| Rosoideae Spiraeoideae Maloideae Amygdaloideaeor Prunoideae |
రోసేసి పుష్పించే మొక్కలలో గులాబి కుటుంబం. దీనిలోని సుమారు 3,000-4,000 జాతుల మొక్కలు, 100-120 ప్రజాతులలో ప్రపంచమంతా విస్తరించాయి.
సాంప్రదాయకంగా ఈ కుటుంబం నాలుగు ఉపకుటుంబాలుగా చేయబడినది. రోసాయిడే, స్పైరాయిడే, మేలాయిడే మరియు అమిగ్డలాయిడే. దీనికి ప్రధానంగా పండ్ల యొక్క లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు.
[మార్చు] వర్గీకరణ
- ఉపకుటుంబం రోసాయిడే: వీనిలోని మొక్కలు ఎఖిన్ లేదా డ్రూప్ రకమైన పండ్లు కాస్తాయి. దీనిలో సుమారు 20 ప్రజాతులున్నాయి. ఉదా: గులాబి, బ్లాక్ బెర్రీ, రాస్ప్ బెర్రీ, స్ట్రా బెర్రీ మొదలైనవి.
- ఉపకుటుంబం స్పైరాయిడే: వీనిలో ఐదు కవచాలు కలిగిన శుష్క ఫలాలు కాస్తాయి. దీనిలో స్పైరియా మరియు సార్బారియా అనే ప్రజాతులున్నాయి.
- ఉపకుటుంబం మేలాయిడే: ఇవి ఐదు కవచాలు కలిగిన కండగల పోమ్ అనే ఫలాలనిస్తాయి. వీనిలో ఆపిల్, పియర్ మొదలైన ప్రజాతులున్నాయి.
- ఉపకుటుంబం అమిగ్డలాయిడే: వీనిలో ఒకే ఒక్క డ్రూప్ రకమైన పండ్లు కాస్తాయి. వీనిలో ప్లమ్, పీచ్, బాదం, చెర్రీ, ఆప్రికాట్ మొదలైన ప్రజాతులున్నాయి.
[మార్చు] ఆర్ధిక ప్రాముఖ్యత
ఇది ఆర్ధిక ప్రాముఖ్యంలో మూడవ స్థానంలో ఉన్నది. దీనిలో ఆపిల్స్, బాదం, స్ట్రాబెర్రీ మొదలైనవి కలవు.