లక్ష్మి నందన్ బోరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మి నందన్ బోరా
జననం(1932-06-15)1932 జూన్ 15
కుజ్జడా, నాగాం జిల్లా, అసోం, భారతదేశం
మరణం2021 జూన్ 3(2021-06-03) (వయసు 88)
వృత్తిరచయిత, శాస్త్రవేత్త
క్రియాశీల సంవత్సరాలు1954-2021
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నవలలు, లఘు కథలు
జీవిత భాగస్వామిమాధురి
పిల్లలుసూజి
త్రిడిబ్ నందన్
స్వరూప్ నందన్
తల్లిదండ్రులుఫూలేశ్వర్ బోరా
ఫూలేశ్వరి
పురస్కారాలుపద్మశ్రీ
సాహిత్య అకాడమీ పురస్కారం
సరస్వతి సమ్మాన్
పబ్లికేషన్ బోర్డు అసోం లైఫ్ టైం అఛీవ్ మెంటు అవార్డు
మగోర్ అసోం వేలీ సాహిత్య పురస్కారం
భారతీయ భాషా పరిషత్ రచనా సమగ్ర పురస్కారం

లక్ష్మి నందన్ బోరా (1932 జూన్ 15 - 2021 జూన్ 3) భారతదేశ నవలా రచయిత, శాస్త్రవేత్త. అతను అసోం భాషలో 60కి పైగా అనేక నవలలు, లఘు కథలు రాసాడు.[1] [2] [3] అందులో పురస్కారాన్ని అందించిన నవలలు పాతాల్ భైరవి[4], కాయకల్ప[5] లు ఉన్నాయి. అతను సాహిత్య పురస్కార పురస్కారాన్ని, సరస్వతీ సమ్మాన్ పురస్కారాలతో[6] [7]పాటు 2015లో భారత ప్రభుత్వం అందజేసిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. [8] కోవిడ్-19 వ్యాధి కారణంగా అతనూ 2021 జూన్ 3న మరణించాడు.[9]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన 1932, జూన్ 15 న ఫులేశ్వర్ బోరా, ఫులేశ్వరి దంపతులకు అస్సాంలోని నాగావ్ జిల్లాలోని కుడిజా గ్రామంలోని హటిచుంగ్ వద్ద జన్మించాడు. ఈయన యుక్తవయసులో తన తల్లిదండ్రులు మరణించారు. ఈయన పెద్ద సోదరుడు కమల్ చంద్ర బోరా వద్ద పెరిగాడు. ఈయన నాగాన్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు. గువహతిలోని కాటన్ కాలేజ్ స్టేట్ యూనివర్శిటీ నుండి ఫిజిక్స్ (బిఎస్సి) లో పట్టభద్రుడయ్యాడు, కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీ నుండి మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సి) పొందాడు. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వాతావరణ శాస్త్రంలో పిహెచ్‌డి విద్యను అభ్యసించాడు. ఈయన తన కెరీర్‌లో ఎక్కువ భాగం జోర్హాట్‌లోని అస్సాం అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఫ్యాకల్టీ సభ్యునిగా పనిచేశాడు. ఈయన జోహన్నెస్ గుటెన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా రెండు పర్యాయాలు పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈయన 1961 లో మాధురిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె , ఇద్దరు కుమారులు. కుమార్తె నియోగ్ జోర్హాట్ లోని అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం ప్రొఫెసర్. కుమారులు త్రిదీబ్ నందన్ బోరా సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి. చిన్న కుమారుడు స్వరూప్ నందన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువహతిలో గణిత శాస్త్ర ప్రొఫెసర్.

మూలాలు[మార్చు]

  1. Kartik Chandra Dutt (1999). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Academy. p. 1490. ISBN 9788126008735.
  2. "UCCS". UCCS. 2015. Archived from the original on 5 ఆగస్టు 2020. Retrieved 18 February 2015.
  3. "The Hindu". 6 April 2011. Retrieved 18 February 2015.
  4. Lakshmi Nandan Bora (1997). Patal Bhairavi (1997 ed.). Sahitya Academy Publications. p. 308. ISBN 9788126001460.
  5. Lakshmi Nandan Bora (2010). Kayakalpa — The Elixir of Everlasting Youth. Niyogi Books. pp. 280. ISBN 978-8189738679.
  6. "Good Reads". Good Reads. 2015. Retrieved 18 February 2015.
  7. "Saraswati Samman". LKVP. 14 February 2009. Retrieved 18 February 2015.
  8. "Padma Awards". Padma Awards. 2015. Archived from the original on 28 January 2015. Retrieved 16 February 2015.
  9. "COVID-19: Assamese litterateur Lakshmi Nandan Bora passes away". The Hindu (in Indian English). 3 June 2021.

ఇతర పఠనాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]