లైకోరిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లైకోరిన్ సౌష్టవ నిర్మాణం.2D

లైకోరిన్ (Lycorine) అనేది వివిధ అమరిల్లిడేసి జాతులలో కనిపించే విషపూరిత స్ఫటికాకార ఆల్కలాయిడ్, సాగు చేయబడిన బుష్ లిల్లీ (క్లివియా మినియాటా),సర్పైజ్ లిల్లీస్ (లైకోరిస్), డాఫోడిల్స్ (నార్సిసస్) వంటి మొక్కల్లో లభిస్తుంది. నిర్దిష్ట పరిమాణంలో తీసుకున్నప్పుడు ఇది అత్యంత విషపూరితమైనది లేదా ప్రాణాంతకం కూడా కావచ్చు.[1]లైకోరిన్ అనేది ఇండోలిజిడిన్ ఆల్కలాయిడ్, ఇది హైడ్రాక్సీ సమూహాలచే 3,12-డైడ్‌హైడ్రోగాలాంతన్ స్థానంలో ఉంటుంది, 2, 9, 10 స్థానాల్లో ఉన్న మిథైలెనెడియోక్సీ సమూహం. క్రినమ్ ఆసియాటికం నుండి వేరుచేయబడి, ఇది యాంటీమలేరియల్ చర్యను ప్రదర్శిస్తుందని తేలింది.[2]లైకోరిన్ విషపూరితం యొక్క లక్షణాలు వాంతులు, విరేచనాలు, మూర్ఛలు. ఏమైనప్పటికీ,లైకోరిన్ కొన్నిసార్లు ఔషధంగా ఉపయోగించబడుతుంది,అందువల్ల క్లివియా మినియాటాను కొన్ని ప్రాంతాల్లో సాగు చెస్తారు.[1]ఇది ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్, యాంటీమలేరియల్, ప్లాంట్ మెటాబోలైట్, యాంటీకోరోనావైరల్ ఏజెంట్‌గా పాత్రను కలిగి ఉంది. ఇది గెలాంతన్ యొక్క హైడ్రైడ్ నుండి ఉద్భవించింది.[2]

ప్రకృతి నవీన ఔషధ ఆవిష్కరణకు అత్యంత సమృద్ధికరమైన మూలం/వనరు.లైకోరిన్ అపారమైన చికిత్సా సామర్థ్యాన్ని కలిగి ఉన్న సహజ ఆల్కలాయిడ్.లైకోరిన్ చాలా తక్కువ గాఢతతో ఇచ్చినపుడు వివో, ఇన్ విట్రోలో తో వివిధ ఔషధ-నిరోధక క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా అనేక క్యాన్సర్లకు మందుగా అధిక నిర్దిష్టతతో చురుకుగా పనిచెస్తుంది.[3]

లైకోరిన్ ఏ మొక్కల్లో లబిస్తుంది[మార్చు]

పైరోలోఫెనాంత్రిడిన్ ఆల్కలాయిడ్ అయిన లైకోరిన్ వివిధ అమరిల్లిడేసి జాతులలో కనిపిస్తుంది.అమరిల్లిడేసి అనేది గుల్మకాండ, శాశ్వత, ఉబ్బెత్తు పుష్పించే మొక్కల కుటుంబం. అమరిల్లిడేసి మొక్కల నుండి వేరుచేయబడిన సమ్మేళనాలు వాటి ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. లైకోరిన్‌ను కలిగి ఉన్నట్లు చాలా తరచుగా నివేదించబడిన అమరిల్లిడేసి జాతులలో లైకోరిస్ రేడియేట్, ల్యూకోజమ్ ఈస్టివమ్, హైమెనోకాలిస్ లిట్టోరాలిస్, హిప్పీస్ట్రమ్ ఈక్వెస్ట్రే[4], క్లివియా నోబిలిస్ మొక్కల పువ్వులు[5].అలాగే అమ్మోచారిస్ కొరానికా, బ్రున్స్విజియా రాడులోసా, క్రినమ్ మాకోవానీ, ల్యూకోజమ్ ఎస్టివం పూలల్లో కూడా లైకోరిన్ లభిస్తుంది.[6] [7]

లైకోరిన్‌ను అసమాన రసాయన సంశ్లేషణ లేదా మొత్తం సంశ్లేషణ వ్యూహాల ద్వారా పొందవచ్చు, ఇవి లైకోరిన్ యొక్క ఇతర ఉత్పన్నాలను ఉత్పత్తి చేయడానికి కూడా వర్తిస్తాయి.[8][9]లైకోరిన్ సి-రింగ్‌లో డబుల్ బాండ్‌ను కలిగి ఉన్న అనలాగ్‌లను కలిగి ఉంటుంది.

లైకోరిన్ యొక్క పూర్తి రసాయన నామం 2,4,5,7,12b,12c-హెక్సాహైడ్రో-1H-(1,3) డయోక్సోల్(4,5-j)-పైరోల్(3,2,1de) ఫెనాంత్రిడిన్-1-డయోల్ ,

భౌతిక ధర్మాలు[మార్చు]

లైకోరిన్ పరమాణు సూత్రం C16H17NO4, సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి 287.31.గ్రా/మోల్.లైకోరిన్ అనేది 260–262 °C ద్రవీభవన స్థానం కలిగిన రంగులేని క్రిస్టల్ ఘన పదార్థం. ఇది మురుగునీటిలో కలిసిపోదు, ఈథర్, ఆల్కహాల్‌లో కూడా కరగదు.[10][11]

లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం C16H17NO4
అణు భారం 287.31 గ్రా/మోల్
సాంద్రత 1.5±0.1 గ్రా/సెం.మి3(అంచనా)[12]
మరుగు స్థానం 477.4±45.0°C (అంచనా)[12]
బాస్ఫపీడనం 0.0±1.3మి.మీ/పాదరసం,25°C వద్ద[12]
బాస్పీకరణ ఉష్ణశక్తి 78.1±3.0కిలో.జౌల్స్/మోల్[12]
వక్రీభవన గుణకం 1.733[12]
ఫ్లాష్ పాయింట్ 242.5±28.7°C[12]

ఉపయోగాలు[మార్చు]

  • లైకోరిన్ అనేది అమరిల్లిడేసి ఫ్యామిలీ కుటుంబానికి చెందిన మొక్క లైకోరిస్ రేడియేట్ లో లభించు ప్రధాన క్రియాశీలక భాగం, ఇది సాంప్రదాయ చైనీస్ ఔషధ మూలికకూడా.లైకోరిన్ పైరోలో ఫెనాం త్రిడిన్ న్యూక్లియస్ కోర్‌తో కూడిన సాధారణ ఆల్కలాయిడ్స్‌లో ఇది ఒకటి.
  • లైకోరిన్ దాని విభిన్న రసాయన నిర్మాణాలు, బహుళ జీవ విధులు, అలాగే వివిధ వ్యాధులపై ఔషధ ప్రభావాల కారణంగా ఔషధ రంగంలో గొప్ప ఆసక్తిని కనబరిచిన ఆల్కలాయిడ్.లైకోరిన్ యాంటీ-లుకేమియా, యాంటీ-ట్యూమర్, యాంటీ-యాంజియోజెనిసిస్, యాంటీ-వైరస్, యాంటీ బాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీమలేరియా వంటి అనేక వ్యాధులపై బలమైన ఔషధ ప్రభావాలను కలిగిఉన్నట్లు చెసిన అద్యాయనాలు, సాక్ష్యాలు చూపిస్తున్నాయి.[13]
  • లైకోరిన్ ఎసిటైల్కోలినెస్టేరేస్, టోపోయిసోమెరేస్ లను నిరోధించడం, ఆస్కార్బిక్ యాసిడ్ బయోసింథసిస్ లప్రభవాన్ని అణచివేయడం/నియంత్రించడం, సిర్కాడియన్ పీరియడ్ నిడివిని నియంత్రించడం వంటి అనేక ఇతర జీవ విధులను కూడా నిర్వహిస్తుంది.[13]ముఖ్యంగా, లైకోరిన్ చాలా తక్కువ విషపూరితం, తేలికపాటి దుష్ప్రభావాలతో వివిధ వ్యాధులపై దాని అనేక ఔషధ ప్రభావాలను ప్రదర్శిస్తుంది.[14]
  • లైకోరిన్ Kd విలువ 15.24nM తో శక్తివంతమైన, మౌఖికంగా క్రియాశీలంగా ఉండే SCAP(Sterol cleavage activating protein) నిరోధకం.లైకోరిన్ దాని ట్రాన్స్క్రిప్షన్(transcription)నుమార్చకుండా SCAP ప్రోటీన్ స్థాయిని తగ్గిస్తుంది.లైకోరిన్ మెలనోమా వాస్కులోజెనిక్ ఇన్హిబిటర్ కూడా. ప్రోస్టేట్ క్యాన్సర్, జీవక్రియ వ్యాధుల అధ్యయనం కోసం లైకోరిన్ ఉపయోగిస్తారు.[15]
  • లింఫోమా [16] కార్సినోమా[17], మల్టిపుల్ మైలోమా[18], మెలనోమా [19], లుకేమియా[20], హ్యూమన్ U373 గ్లియోబ్లాస్టోమా, హ్యూమన్ A549 నాన్-స్మాల్ వంటి వివిధ క్యాన్సర్ కణ తంతువుల పట్ల లైకోరిన్ బహుళ నిరోధక లక్షణాలను ప్రదర్శించింది. కణ-ఊపిరితిత్తుల క్యాన్సర్, మానవ OE21 అన్నవాహిక క్యాన్సర్, మానవ Hs683 అనాప్లాస్టిక్ ఒలిగోడెండ్రోగ్లియోమా సెల్ లైన్లు [21].పై కూడా పనిచెస్తుంది.
  • ల్యూకోరిన్ టాబ్లెట్ 10's అనేది నిర్విషీకరణ ఏజెంట్లు లేదా ఫోలిక్ యాసిడ్ అనలాగ్‌లు అని పిలువబడే ఔషధాల తరగతికి చెందినది, ఇది మెథోట్రెక్సేట్ వంటి కొన్ని క్యాన్సర్ ఔషధాల యొక్క విష ప్రభావాలను తగ్గించడానికి విరుగుడుగా క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది కాకుండా, క్యాన్సర్ చికిత్సలో (సైటోటాక్సిక్ థెరపీ) 5-ఫ్లోరోరాసిల్‌తో కలిపి కూడా ఉపయోగించవచ్చు.[22]

ఇవికూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Lycorine". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-31.
  2. 2.0 2.1 "CHEBI:6601-lycorine". ebi.ac.uk. Retrieved 2024-03-31.
  3. "Lycorine: A prospective natural lead for anticancer drug discovery". ncbi.nlm.nih.g. Retrieved 2024-03-31.
  4. . Lin L.Z., Hu S.F., Chai H.B., Pengsuparp T., Pezzuto J.M., Cordell G.A., Ruangrungsi N. Lycorine alkaloids from Hymenocallis littoralis. Phytochemistry. 1995;40(4):1295–1298.
  5. Shawky E. Phytochemical and biological investigation of Clivia nobilis flowers cultivated in Egypt. Iran. J. Pharm. Res. 2016;15(3):531–535
  6. Cao Z.F., Yang P., Zhou Q.S. Multiple biological functions and pharmacological effects of lycorine. Sci. China Chem. 2013;56(10):1382–1391.
  7. "Lycorine: A prospective natural lead for anticancer drug discovery". ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-31.
  8. "LCMS and GCMS for the screening of alkaloids in natural and in vitro extracts of Leucojum aestivum". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-31.
  9. Yamada K., Yamashita M., Sumiyoshi T., Nishimura K., Tomioka K. Total synthesis of (-)-lycorine and (-)-2-epi-lycorine by asymmetric conjugate addition cascade. Org. Lett. 2009;11(7):1631–1633.
  10. "Acetylcholinesterase enzyme inhibitory effects of amaryllidaceae alkaloids". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-31.
  11. . Elgorashi E.E., Stafford G.I., Van Staden J. Acetylcholinesterase enzyme inhibitory effects of amaryllidaceae alkaloids. Planta Med. 2004;70(3):260–262.
  12. 12.0 12.1 12.2 12.3 12.4 12.5 "(-)-Lycorine". chemspider.com. Retrieved 2024-04-01.
  13. 13.0 13.1 "Multiple biological functions and pharmacological effects of lycorine". ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-01.
  14. Wang L, Zhou GB, Liu P, Song JH, Liang Y, Yan XJ, Xu F, Wang BS, Mao JH, Shen ZX, Chen SJ, Chen Z. Dissection of mechanisms of Chinese medicinal formula Realgar-Indigo naturalis as an effective treatment for promyelocytic leukemia. Proc Natl Acad Sci U S A. 2008;105(12):4826–4831.
  15. "Lycorine". medchemexpress.com. Retrieved 2024-04-01.
  16. Liu, X.S.; Jiang, J.; Jiao, X.Y.; Wu, Y.E.; Lin, J.H.; Cai, Y.M. Lycorine induces apoptosis and down-regulation of Mcl-1 in human leukemia cells. Cancer Lett. 2009, 274, 16–24.
  17. Jokhadze, M.; Eristavi, L.; Kutchukhidze, J.; Chariot, A.; Angenot, L.; Tits, M.; Jansen, O.; Frédérich, M. In vitro cytotoxicity of some medicinal plants from Georgian Amaryllidaceae. Phytother. Res. 2007, 21, 622–624
  18. Li, Y.; Liu, J.; Tang, L.J.; Shi, Y.W.; Ren, W.; Hu, W.X. Apoptosis induced by lycorine in KM3 cells is associated with the G0/G1 cell cycle arrest. Oncol. Rep. 2007, 17, 377–384
  19. Campbell, W.E.; Nair, J.J.; Gammon, D.W.; Codina, C.; Bastida, J.; Viladomat, F.; Smith, P.J.; Albrecht, C.F. Bioactive alkaloids from Brunsvigia radulosa. Phytochemistry 2000, 53, 587–591.
  20. McNulty, J.; Nair, J.J.; Bastida, J.; Pandey, S.; Griffin, C. Structure-activity studies on the lycorine pharmacophore: A potent inducer of apoptosis in human leukemia cells. Phytochemistry 2009, 70, 913–919
  21. Lamoral-Theys, D.; Andolfi, A.; Van Goietsenoven, G.; Cimmino, A.; Le Calve, B.; Wauthoz, N.; Megalizzi, V.; Gras, T.; Bruyere, C.; Dubois, J.; et al. Lycorine, the main phenanthridine Amaryllidaceae alkaloid, exhibits significant antitumor activity in cancer cells that display resistance to proapoptotic stimuli: An investigation of structure-activity relationship and mechanistic insight. J. Med. Chem. 2009, 52, 6244–6256.
  22. "Leucorin Tablet 10's". apollopharmacy.in. Retrieved 2024-04-01.
"https://te.wikipedia.org/w/index.php?title=లైకోరిన్&oldid=4194572" నుండి వెలికితీశారు