విథనొలైడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Withaferin A
Salpichrolid A
Nicandrenon-1
Ixocarpalacton A

విథనొలైడు (withanolide) అనే రసాయన సమ్మేళనాలను సొలనేసియే కుటుంబానికి చెందిన మొక్కల నుండి సంగ్రహిస్తారు. సొలనేసియే కుటుంబానికి చెందిన అశ్వగంధ అనే మూలిక మొక్క వేరు నుండి కూడా సంగ్రహిస్తారు. అశ్వగంధ వేరుకు ప్రధాన మైన ఔషధగుణాలు ముఖ్యంగా విథనొలైడుA అనే రసాయన సమ్మేళనం వలననే అని పరిశోధకులు కనుగొన్నారు.ఈ విథనొలైడ్స్ అనే రసాయన సమ్మేళనం స్టెరాయిడ్ లాక్టోను.అణు నిర్మాణంలో స్టెరాయిడ్ వలయాలు లాక్టోన్ అనే మరొక కార్బన్ రింగ్‌తో అనుసంధానించబడి స్టెరాయిడ్ లాక్టోన్‌ను ఏర్పరుస్తుంది.అవి స్టెరాయిడ్ల ఆక్సీకరణ ద్వారా ఉత్పత్తి అవుతాయి.విథఫెరిన్ A అనే విథనొలైడు ఆశ్వగంధ నుండి మొదట వేరుచేయబడినది. [1][2] విథనొలైడు రసాయనసమ్మేళనం సొలనేసి కుటుంబానికి చెందిన మొక్కలలో గుర్తించారు. అశ్వగంధ మొక్క కూడా సొలనేషి కుటుంబానికి చెందిన మొక్క. అశ్వగంధ మొక్క శాస్త్రీయ పేరు వితానియా సోమ్నిఫెరా( Withania somnifera) విథనొలైడులను కలిగి వున్న అశ్వగంధ మొక్కభాగాలు ముఖ్యంగా వేర్లనుండి సేకరించిన పదార్ధాలు సాంప్రదాయ ఆయుర్వేద మరియు యునాని భారతీయ వైద్య విధానాలలో అలాగే అనేక ఇతర ఆసియా దేశాలలో 3,000 సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. [3]

చరిత్ర[మార్చు]

విథఫెరిన్ A (WA), అనే విథనొలైడుకు సాంబంధించిన రసాయన సమ్మేళనం పదార్థం చెందిన ఆర్కిటైప్ విథనియా సోమ్నిఫెరా (WS) లేఅనే అశ్వగంధ నుండి 1965లో కనుగొనబడింది [6]. గత 50 సంవత్సరా లలో, 24 విభిన్న నిర్మాణ రకాలుగా పడిపోతున్న సుమారు 900 వితనోలైడ్‌లు కనుగొనబడ్డాయి. [3]అశ్వగంధ లేదా ఇండియన్ జిన్సెంగ్ అని కూడా పిలువబడే విథనియా సోమ్నిఫెరా (WS),రూట్ నుండి విథనియా సోమ్నిఫెరా సారం(Withania somnifera Extract) లో 11 వితనోసైడ్ మరియు వితనోలైడ్ సమ్మేళనాలను ఫోటోడియోడ్ అర్రే డిటెక్షన్ (UHPLC-PDA) విశ్లేషణతో కూడిన అల్ట్రాహై-పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ ని ఉపయోగించి కనుగొన్నారు. [4] 1996 సంవత్సరంలో, 16 విథనొలైడ్‌ల శ్రేణిని లొక్రోమా జెస్నెరియోయిడ్స్ నుండి వేరుచేయబడినప్పుడు.,కొన్ని విథనొలైడ్‌లు ఎక్డిస్టిరాయిడ్ విరోధులుగా పనిచేస్తాయనడానికి మొదటి సాక్ష్యంలభించింది.[5]

విథనొలైడ్‌లను కల్గిన మొక్కలు[మార్చు]

విథనొలైడ్‌లను కల్గిన మొక్కలు అశ్వగంధ,ఉమ్మెత్త, జబోరోసా కౌలెసెన్స్, ఫిసాలిస్ హిస్పిడా, ఫిసాలిస్. లాంగిఫోలియా, మరియు వాసోబియా బ్రీవిఫ్లోరా.[6]

విథనొలైడునిర్మాణం[మార్చు]

సాధారణంగా,స్వాభావికం గా లభించే విథనొలైడులు ఇప్పటివరకు 500 వరకు వివిధ నిర్మాణ సౌష్టాలతో గుర్తించారు విథనొలైడు అనేది సాధారణంగా 28 కార్బనులు(C28)వున్నహైడ్రోకార్బన్ గొలుసు వున్న ఎర్గోస్టేన్ అనే ప్రాథమిక కర్బన సమ్మేళనం పై సమీకరించబడిన సహజంగా ఏర్పడే,లభించే పాలిఆక్సిజనేటెడ్ స్టెరాయిడ్ లాక్టోన్‌ల సమూహం. నిర్మాణపరంగా విభిన్నమైన వితనోలైడ్‌లు సాధారణంగా 17 కార్బనుల (C-17)పార్శ శృంఖలం/గొలుసువున్న నిర్మాణం ఒక ప్రధాన C-22/C-26 δ-లాక్టోన్/లాక్టోల్ సమూహంతో సంయోగం చెందటం ఆధారంగా వర్గీకరించబడ్డాయి.రూపవిక్రియ మార్పుకు లోను కాని విథనొలైడులు ప్రకృతిలో లభ్యం కావడం సర్వసాధారణం, వీటిలో దాదాపు 580 సహజంగా సంభవించే విథనొలైడులు సోలనేసి కుటుంబంలోనే గుర్తింపబడ్డాయి.[3]సహజంగా ఉత్పన్నమైన ఈ సమ్మేళనాలు సంక్లిష్ట వ్యాధి ప్రక్రియలలో అసాధారణమైన జీవసంబంధ కార్యకలాపాలను ప్రదర్శిస్తాయి, అదే సమయం లో తక్కువ ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.ఇప్పటి వరకు గుర్తించిన విథనొలైడ్లలలో, 40వరకు నిర్మాణపరంగా 28 కార్బనులు ( C-28) వున్న స్టెరాయిడ్ లాక్టోన్ ట్రైటెర్పెనాయిడ్స్ సమీకృత లేదా పునర్వ్యవస్థీకరించబడిన ఎర్గోస్టేన్ పై సమీకరించాయి, దీనిలో 22వ కార్బను (C-22) మరియు26వ కార్బను( C-26) ఆక్సీకరణం చెంది సెక్సు-మెంబర్డ్ లాక్టోన్ రింగ్‌ను ఏర్పరుస్తాయి.[7]

భౌతికలక్షణాలు[మార్చు]

విథనొలైడు యొక్క భౌతిక గుణాల వివరాలు. [8]

  • విథనొలైడు అణుఫార్ములా :C28H38O6
  • విథనొలైడు అణుఫాభారం :470.6 గ్రా /మోల్

విథనొలైడు వినియోగం-ఉపయోగాలు[మార్చు]

1.ఆయుర్వేద వైద్యంలో, ఆస్టియో ఆర్థరైటిస్ (OA) మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) రెండింటికి చికిత్స చేయడానికి వితనోలైడ్‌లను తరచుగా ఉపయోగిస్తారు ఇది శోథ నిరోధక చికిత్సకు మరియు కొండ్రోసైట్లు రక్షణ మరియు దోహదపడే గుణం విథనోలైడ్‌ లకు వున్నది.చాలా విథనోలైడ్‌లు విస్తృత శ్రేణి క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా సైటోటాక్సిక్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయని కనుగొన్నారు.క్యాన్సర్ చికిత్స మరియు నివారణ కోసం సైటోటాక్సిక్ మెకానిజమ్స్ మరియు విథనోలైడ్‌ల సంభావ్య చికిత్సా ప్రయోజనాలపై విస్తృత పరిశోధనలు మొదలైనవి.[9]

2.విథనొలైడులను ఆహార పరిశ్రమలో ఆహార పదార్ధంగా ఉపయోగిస్తారు. ఇవి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని మరియు ఆహార ఉత్పత్తుల యొక్క పోషక విలువలను మెరుగుపరచడానికి తరచుగా ఉపయోగిస్తారు. విథనొలైడ్‌లను తృణధాన్యాలు, స్నాక్స్ మరియు పానీయాలు వంటి ఆహార ఉత్పత్తులకు వాటి యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ని పెంచడానికి జోడించవచ్చు. అవి యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నందున వాటిని ఆహార ఉత్పత్తులలో సహజ సంరక్షణకారిగా కూడా ఉపయోగించవచ్చు.[10]

ఇవికూడా చూడండి[మార్చు]

1.అశ్వగంధ

మూలాలు[మార్చు]

  1. Lavie, D.; Glotter, E.; Shvo, Y. (1965). "1371.Constituents of Withania somnifera Dun. Part IV. The structure of withaferin A". Journal of the Chemical Society: 7517–7531. doi:10.1039/JR9650007517.
  2. Kupchan, S. Morris; Anderson, Wayne Keith; Bollinger, Pietro; Doskotch, Raymond W.; Smith, Roger M.; Saenz-Renauld, Jose A.; Schnoes, Heinrich K.; Burlingame, Alma L.; Smith, Dennis H. (1969). "Tumor inhibitors. XXXIX. Active principles of Acnistus arborescens. Isolation and structural and spectral studies of withaferin a and withacnistin". The Journal of Organic Chemistry. 34 (12): 3858–66. doi:10.1021/jo01264a027. PMID 5357526.
  3. 3.0 3.1 3.2 "Natural Withanolides in the Treatment of Chronic Diseases". ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-02.
  4. "Investigating 11 Withanosides and Withanolides". pubs.acs.org. Retrieved 2024-02-04.
  5. "Endocrinology". sciencedirect.com. Retrieved 2024-02-05.
  6. మూస:Citejournal
  7. "A Decade of Molecular Understanding of Withanolide Biosynthesis". frontiersin.org. Retrieved 2024-02-05.
  8. "withanolide". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-04.
  9. "Natural Withanolides in the Treatment of Chronic Disease". ncbi.nlm.nih.gov. Retrieved 2024-02-05.
  10. "WITHANOLIDES". digicomply.com. Retrieved 2024-02-05.