వర్గం చర్చ:గూగుల్ అనువాద వ్యాసాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంచి పని చేసారు వెంకటరమణ గారూ, నిన్ననే నేననుకున్నాను, ఈరోజే మీరు చక్కగా చేపట్టారు కొత్తవర్గం, నాకయితే ఎక్కువ సమయం పట్టేది, మీరు టేక్నికల్లీ ఫిట్, కాబట్టి, సులువుగా చేసేసారు, అభినందనలు. ఈ వ్యాసాలు శుద్ధి చేసుకుంటే, వందలకొద్దీ క్వాలిటీ వ్యాసాలు లభించవచ్చు.అహ్మద్ నిసార్ (చర్చ) 12:43, 14 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్మద్ నిసార్ గారూ, వికీపీడియా అభివృద్ధికోసం శుద్ధి చేయవలసి వ్యాసాలు, గూగుల్ అనువాద వ్యాసాలు, మొదలైనవాటికి వికీపీడియనులు అందించే సహాయం కోసం "రచ్చబండ" లో సహకార స్థితి లో కనబడేటట్లు చేర్చితిని. వాటిలో కొన్నయినా శుద్ధి చేయబడతయని నా అలోచన.---- కె.వెంకటరమణ చర్చ 13:22, 14 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్. అహ్మద్ నిసార్ (చర్చ) 15:51, 14 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందన[మార్చు]

అర్జున రావు గారూ, ఇటీవలె కొన్ని అనువాదిత వ్యాసాలని శుద్ధి చేసిన నా అభిప్రాయాలు.

  • కొన్ని కొన్ని పదాల అనువాదాలు అద్భుతంగా ప్రయోగించబడ్డాయి. ఉదా:Cognitive అంటే అభిజ్ఞత. ఈ పదాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ లో అనువదించి చూడటం, వచ్చిన అనువాదాల్లో ఏది సరియైనదో ఎంపిక చేసి వాడటం వంటి పరిశోధనలో సమయం వృధా అవ్వకుండా ఈ అనువాద వ్యాసాలు దోహదపడగలిగాయి.
  • కొన్ని పదాలు సరిగా ప్రయోగించబడట్లేదు. ఉదా:మిథ్య రావలసిన ప్రతిచోటూ మిధ్య అని వస్తున్నది.
  • నాణ్యత పరంగా ఇటువంటి వ్యాసాలు ఆశించిన స్థాయిలో లేవన్నమాట సరియైనదే అయిననూ, అసలు లేకపోవటం కంటే ఏదో ఒక వ్యాసం ఉండటమే మంచిదన్నది నా (వ్యక్తిగత) అభిప్రాయం. వ్యాసం సాధారణమైనది అయినచో ఆసక్తి గల ఏ వాడుకరి అయిననూ భవిష్యత్తులో దానిని శుద్ధి చేసి ప్రమాణాలని పెంచే అవకాశం ఎంతైనా ఉన్నది. ఎటొచ్చీ వ్యాసం ప్రత్యేకమైన అంశం గురించినది అయితే (ఉదా: నిర్వహణ లేదా తంత్ర దర్శనము వంటివి) ఆయా అంశాలపై పట్టు ఉన్న వాడుకరులు మాత్రమే వాటిని శుద్ధి చేయగలరు. కావున ఈ (యాంత్రిక అనువాద) పంథాలో సాధారణ వ్యాసాలని అనువదించి రాశిపరంగా తెవికీని విస్తరించవచ్చును.
  • ఒక కొత్త వ్యాసం సంపూర్ణంగా రాయటం 100 శాతం శ్రమగా పరిగణిస్తే, అనువాదిత వ్యాసాలు సాధారణమైనవి అయితే రమారమి 50 శాతం శ్రమని తగ్గించగా, ప్రత్యేకమైనవి అయితే 30-40 శాతం శ్రమని తగ్గిస్తున్నాయి.
  • మూలాలు, చిత్రాలని వెదుక్కోనక్కర లేకుండా ముందే అవి అనువాదిత వ్యాసాలలో ఉండటం, కేవలం టెక్స్టుని మాత్రం శుద్ధి చేయవలసి రావటం పరిగణలోకి తీసుకొని ఈ శాతాలని తేల్చగలిగాను.

ఇంకనూ ఏవయినా గమనికలు ఉంటే మరల ఇక్కడే చేరుస్తాను.

ధన్యవాదాలు - శశి (చర్చ) 07:23, 7 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రధాన పేరుబరినుండి తెచ్చిన వ్యాఖ్య[మార్చు]

వారం తదుపరి మొత్తం వ్యాసాలు తొలగించుటకు మూస పెట్టబడును. JVRKPRASAD (చర్చ) 04:07, 16 నవంబర్ 2017 (UTC)

పైది చేర్చినది. అర్జున (చర్చ) 06:22, 2 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]