వాడుకరి:Pavan santhosh.s/100 wikidays

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను 100 వికీడేస్ అన్న చాలెంజ్ స్వీకరిస్తున్నాను. ఇందులో భాగంగా రోజుకొక వ్యాసాన్ని వందరోజుల పాటు క్రమం తప్పకుండా తయారుచేస్తాను. ఆ వ్యాసాలన్నీ ఇక్కడ పట్టిక వేసేందుకు పేజీని సృష్టిస్తున్నాను.

వంద వికీ రోజుల గురించి[మార్చు]

100 wikidays అన్నది 100 happydays అన్న ప్రయత్నంలోంచి వచ్చిన ఆలోచన. రోజుకో వ్యాసం చొప్పున వరుస తప్పకుండా వందరోజులు వందవ్యాసాలు సృష్టించాలన్న ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా చేసి కొందరు గెలిచారు, చాలామంది దెబ్బతిని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టారు. రోజూ తెవికీకి రావడం కుదరవచ్చు కుదరకపోవచ్చు, రోజుకో కొత్త వ్యాసం దొరకొచ్చు దొరకకపోవచ్చు, కానీ నేను డిసైడయ్యాను.. జై పాతాళ భైరవీ.

జాబితా[మార్చు]

రోజు వ్యాసం తేదీ విశేషాలు వ్యాసం స్థాయి
1 ఎల్ఫ్రిద్ జెలినెక్ మార్చి 21, 2016 నోబెల్ బహుమతి పొందిన స్త్రీలు ప్రాజెక్టులోది
అంతర్జాతీయ మహిళా మాసం సందర్భంగా
మొలక స్థాయి దాటింది
2 యంగ్ టర్క్స్ విప్లవం మార్చి 22, 2016 ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి టర్కీ ప్రజాస్వామీకరణ
అటువంటి టర్కీలో ప్రజాస్వామ్య చరిత్రలో ముఖ్య ఘటన ఇది
మొలక స్థాయి దాటింది
3 కర్దమ మహర్షి మార్చి 23, 2016 కర్దముడు మహర్షి, ప్రజాపతిగా పురాణాల్లో పేరొందినవాడు, ఆయన గురించి వ్యాసం మొలక స్థాయి
4 తురగా కృష్ణమూర్తి మార్చి 24, 2016 తురగా కృష్ణమూర్తి చరిత్రకారుడు, పలువురు ఇతర చరిత్రకారుల ప్రశంసలు పొందినా ఖ్యాతి సరిగా లభించకపోయినవారు మొలక స్థాయి దాటింది
5 భారత విభజన మార్చి 25, 2016 భారతదేశ చరిత్రలోనే కాక దక్షిణాసియా చరిత్రలోకెల్లా అత్యంత కీలకమైన ఘట్టం, ప్రపంచంలోనే అత్యంత దారుణమైన వలసలకు, అతిపెద్ద పునరావాసానికి మూలం. దీని గురించి తెవికీలో మంచి వ్యాసం ఉండాలనే ఆలోచనతో రాశాను మొలక స్థాయి దాటింది, చాలా విస్తరించాలి
6 విభజించి పాలించు మార్చి 26, 2016 ప్రపంచవ్యాప్తంగానూ, ప్రత్యేకించి మన దేశంలోనూ వర్గవైషమ్యాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే రాజకీయవాదుల ఉపకరణం ఇది. దీని గురించి వ్యాసం అనువదించి, అభివృద్ధి చేశాను మొలక స్థాయి దాటి అభివృద్ధి.
7 ద్విజాతి సిద్ధాంతం మార్చి 27, 2016 భారతదేశ చరిత్రలో కీలక ఘటన అయిన భారత విభజన గురించిన పలు అంశాలపై వ్యాసాలు అభివృద్ధి, అనువాదం చేస్తున్నాను. ఆ క్రమంలో రాసిన వ్యాసమిది. మొలక స్థాయి దాటి అభివృద్ధి.
8 63వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు మార్చి 28, 2016 అవార్డులు ప్రకటించిన రోజే ఈ వ్యాసాన్ని అనువదించాను ఆరంభ స్థాయికి అభివృద్ధి
9 మధురవాణి (పాత్ర) మార్చి 29, 2016 కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు రాసిన మధురవాణి పాత్ర తెలుగువారికి రక్తమాంసాలున్న మనిషే అయిపోయింది. ఆమె మరెన్నో సాహిత్య ప్రక్రియల్లో రావడమే కాక ప్రజల పలుకుబళ్ళలో కూడా చేరింది. పాత్రలపై వ్యాసాలు రాయడం అన్నది నాకు చాలా ఇష్టమైన పని. మొలక స్థాయి దాటి ఆరంభ స్థాయికి అభివృద్ధి
10 శివరంజని రాగం మార్చి 30, 2016 సినిమాలు, లలిత సంగీతంలో ప్రసిద్ధమైన రాగం గురించిందీ వ్యాసం. ఈమాటలో మంచి వ్యాసం మూలంగా లభిస్తే దాన్ని ఆధారం చేసుకుని అభివృద్ధి చేశాను. మొలక స్థాయి దాటి అభివృద్ధి
11 పండితారాధ్య చరిత్ర మార్చి 31, 2016 సాహిత్యంలో శైవ యుగంలో సుప్రసిద్ధ కావ్యం. తెలుగు వారి జన జీవన విజ్ఞాన సర్వస్వంగా పేరొందింది. మొలక స్థాయి దాటి అభివృద్ధి
12 సత్య (సినిమా) ఏప్రిల్ 1, 2016 రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సత్య సినిమా భారతీయ చరిత్రలో టేకింగ్ పరంగా గొప్ప మలుపు. కొందరు విమర్శకుల ప్రకారం రాంగోపాల్ వర్మ తీసిన ఆఖరు గొప్ప సినిమా. ఆల్ టైం గ్రేట్ లిస్టుల్లో చాలావాటిలో చేరింది. తెవికీలో వ్యాసం ఉండాల్సింది. మొలక స్థాయి దాటింది, అనువాదం సాగుతోంది.
13 నర్తనశాల (నాటకం) ఏప్రిల్ 2, 2016 విశ్వనాథ సత్యనారాయణ రాసిన నర్తనశాల నాటకం పలు విధాలుగా ప్రాచుర్యం పొందింది. గ్రీకు విషాద నాటకాలతో పోలుస్తూ చేసిన పీహెచ్డీ పరిశోధనలు కూడా ఉన్నాయి. ఆరంభ స్థాయి వ్యాసంగా విస్తరించాను.
14 రజనీగంధ ఏప్రిల్ 3, 2016 బాసూ చటర్జీ తీసిన రెండో సినిమా, అమోల్ పాలేకర్ మొదటి సినిమా. అత్యంత సున్నితమైన ప్రేమకథ హిందీ వెండితెరపై తీయగా నిలిచిపోయింది. మంచి సినిమా గురించి రాయబుద్ధేసి రాశాను. ఆరంభ స్థాయికి విస్తరించాను.
15 అంకుర్ (సినిమా) ఏప్రిల్ 4, 2016 సుప్రసిద్ధ దర్శకుడు శ్యాం బెనగళ్ తొలిచిత్రం. అంకుర్ సినిమా భారతీయ పారలల్ సినిమాపై గట్టి ప్రభావం చూపించింది. తెవికీలో వ్యాసం ఉండవలసినది. ఆరంభ స్థాయిలో ఉంది.
16 పియా కా ఘర్ ఏప్రిల్ 5, 2016 బొంబాయి మహా నగరంలో మధ్యతరగతి రెండు గదుల చోటు కోసం ఒకనాడు పడిన పాట్లు హాస్యంతో కూడిన కరుణ రసాత్మకంగా చూపించిన హిందీ సినిమా. హిందీ సినిమా రంగానికి సున్నితత్వం చూపిన బాసూ చటర్జీ దర్శకత్వం వహించిన సినిమా. 6 కెబి దాటింది
17 భారత అత్యవసర స్థితి ఏప్రిల్ 6, 2016 1970ల్లో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర స్థితి స్వాతంత్రానంతర భారతదేశ చరిత్రను మలుపుతిప్పిన ప్రధాన ఘటన. రాజ్యాంగపరంగా ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని దేశ ప్రజల ప్రాథమిక హక్కులను నిషేధిస్తూ విధించిన ఈ ఎమర్జెన్సీ తర్వాత రాజకీయ స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది తెవికీలో ఉండాల్సిన ముఖ్య వ్యాసం దాదాపు 12 కెబి
18 తిరుమళిశై ఆళ్వార్ ఏప్రిల్ 7, 2016 పన్నెండు మంది వైష్ణవ మహాభక్తులను ఆళ్వారులని పిలుస్తారు. వీరు వైష్ణవ సంప్రదాయంలో చాలా ముఖ్య భక్తులు. వారిలో ఒకరైన తిరుమళిశై ఆళ్వార్ గురించి జీవితచరిత్రాత్మక వ్యాసం 3 కెబిలకు పైగా సమాచారం
19 పథేర్ పాంచాలి ఏప్రిల్ 8, 2016 సత్యజిత్ రే భారతీయ కళాత్మక సినిమాకు ఎనలేని సేవలు చేసినవారు. భారతీయ సినీ రంగానికి చెందినవారిలో భారతరత్న, ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్న ఏకైక వ్యక్తి. ఆయనకి దాదాపు పర్యాయపదంగా నిలిచిన సినిమా పథేర్ పాంచాలి. ప్రపంచవ్యాప్తంగా మరణించేలోగా చూడాల్సిన వంద సినిమాలుగా టైమ్ పత్రిక ఎంచిన జాబితాలో రెండవదీ సినిమా. తెలుగు వికీపీడియాలో తప్పక ఉండాల్సిన వ్యాసం. 2.6 కెబిలే విస్తరించాను
20 ఆంధ్రోద్యమం ఏప్రిల్ 9, 2016 ఆంధ్రోద్యమం తెలుగువారి చరిత్రలో ఎనలేని ప్రాధాన్యం కలిగివుంది. ఉద్యోగాలు, రాజకీయాధికారం వంటి వాటిలో తమిళుల చేతిలో అవమానాలు పడుతూ ఇటు బ్రిటీష్ పాలిత రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల తెలుగువారు, తమ భాషను తెలంగీ భేడంగీ అని అవమానిస్తూ రెండవ స్థాయి భాషగా తెలుగును నిలబెడితే అటు నైజామాంధ్రులు ప్రారంభించినదీ ఆంధ్రోద్యమం. తెలుగు వికీపీడియాలో ఉండవలసిన వ్యాసమే. 1.8 కెబి వరకూ విస్తరించాను
21 స్క్రీన్ ప్లే ఏప్రిల్ 10, 2016 స్క్రీన్ ప్లే తెర కోసం రచయిత రాసే సాహితీ ప్రక్రియ. సినిమా, సీరియల్ వంటివాటిలో చాలా మౌలికమైన అంశం. తెవికీలో అవసరమైన వ్యాసం. 600 బైట్లలోపు ఉంది
23 బైసికిల్ థీవ్స్ ఏప్రిల్ 11, 2016 నియోరియలిజం ఉద్యమంలో భాగంగా వచ్చిన ప్రపంచ స్థాయి అత్యుత్తమ చలనచిత్రం బైసికిల్ థీవ్స్. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఇటలీలోని జన జీవితాన్ని ప్రతీకాత్మకంగా ప్రతిబింబించే ఈ సినిమా విదేశీ చిత్రం అయివుండీ ఆస్కార్ సహా పలు గౌరవాలు పొందింది. 5 కెబి పై వరకూ విస్తరించాను
24 మృణాళ్ సేన్ ఏప్రిల్ 12, 2016 భారతీయ సమాంతర సినిమా రంగానికి ఒరవడి దిద్దిన దర్శక త్రయంలో సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్ లతో సహా మృణాళ్ సేన్ ఒకరు. ఆయన ప్రపంచవేదికపై భారతీయ సినిమాకు కొన్నేళ్ళపాటు ప్రాతినిధ్యం వహించారు. ఉండవలసిన వ్యాసం. 5 కెబిల పైన విస్తరించాను
25 సమాంతర సినిమా ఏప్రిల్ 13, 2016 భారతీయ సినిమా రంగంలో పార్లల్ సినిమాగా సుప్రసిద్ధమైన నవతరంగం 1960ల నుంచి 80ల వరకూ ఎన్నో విలువైన చలన చిత్రాలను, నటులను, సాంకేతిక నిపుణులను అందించింది. ప్రపంచ వేదికలపై భారతీయ బావుటాను సగర్వంగా రెపరెపలాడించినదీ ఉద్యమం. తెవికీలో ఉండాల్సిన వ్యాసం 2 కెబిలకు పైగా విస్తరించాను.
26 మాబాబు(నవల) ఏప్రిల్ 14, 2016 ప్రముఖ తెలుగు రచయిత విశ్వనాథ సత్యనారాయణ రాసిన సాంఘిక నవల ఇది. ఈ నవలలో 20వ శతాబ్ది నాటి తొలినాళ్ళ గుంటూరు, కృష్ణా జిల్లాల పల్లెటూరి జీవనం ప్రతిబింబించారు. మరీ తక్కువ సమాచారం, విస్తరించాలి.
27 ధర్మారావు (పాత్ర) ఏప్రిల్ 15, 2016 వేయిపడగలు నవలలోని పాత్ర. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రముఖమైన, చర్చింపబడ్డ, వివాదాస్పదమైన పాత్రల్లో ఒకటి. మొలక స్థాయిలో ఉంది, విస్తరించాలి
28 ముద్రారాక్షసం ఏప్రిల్ 16, 2016 ప్రముఖ సంస్కృత చారిత్రక నాటకం. చాణక్యుడు, రాక్షస మంత్రిల నడుమ జరిగిన రాజకీయ చదరంగపుటెత్తుల మయమైన కథాంశం. ఆరంభ స్థాయి వ్యాసం
29 ధ్వన్యాలోకం ఏప్రిల్ 17, 2016 సంస్కృత సాహిత్యంలో ప్రముఖమైన ఆలంకారిక శాస్త్ర గ్రంథం. ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఈ రచన భారతీయ సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివుంది. ఆరంభ స్థాయిలో చక్కగా విస్తరింపబడింది
30 మధుర్ భండార్కర్ ఏప్రిల్ 18, 2016 మధుర్ భండార్కర్ జాతీయ పురస్కారం పొందిన హిందీ సినిమా దర్శకుడు మొలక స్థాయి దాటింది. లీడ్ సెక్షన్ మాత్రం ఉంది.
31 భారతదేశ ఏకీకరణ ఏప్రిల్ 19, 2016 భారత స్వాతంత్రం సమయంలో విభజనతో పాటు జరిగిన అత్యంత కీలకమైన ఘటన భారతదేశ ఏకీకరణ. ఈనాటి భారతదేశ రాజకీయ పటం ఈ రూపంలో ఉండడానికి కారణం ఈ సంఘటన. ఇది భారత చరిత్రకు సంబంధించి తెవికీలో ఉండి తీరాల్సిన ముఖ్యమైన వ్యాసం మొలక స్థాయి వ్యాసం, చాలా తక్కువ సమాచారం, మూలాలు ఇవ్వలేదు
32 1943 బెంగాల్ కరువు ఏప్రిల్ 20, 2016 1943 బెంగాల్ కరువు అత్యంత దారుణమైన ప్రకృతి వైపరీత్యం, పరిపాలనా నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది ప్రజలు మరణించడం, కోట్ల మంది స్థానభ్రంశం చెందడం జరిగింది. భారత చరిత్రలో ఒకానొక ముఖ్యమైన సంఘటన. లీడ్ సెక్షన్ ఉంది, మొలక స్థాయి దాటింది
33 త్రిశూలం (నాటకం) ఏప్రిల్ 21, 2016 విశ్వనాథ సత్యనారాయణ రాసిన చారిత్రిక నాటకం మొలక స్థాయిలో ఉంది
34 శివసాగర్ రాంగులామ్ ఏప్రిల్ 22, 2016 శివసాగర్ రాంగులామ్ మారిషస్ స్వాతంత్ర సమరయోధుడు, తొలి ప్రధాని, జాతిపిత. ఆయన భారత సంతతికి చెందిన వ్యక్తి. శివసాగర్ తండ్రి బీహార్ నుంచి వలసవెళ్ళారు, శివసాగర్ గాంధీ నుంచి, భారత జాతీయోద్యమం నుంచి స్ఫూర్తి పొందారు. ఆరంభ స్థాయిలో, చక్కగా మలిచాను
35 దుల్కర్ సల్మాన్ ఏప్రిల్ 23, 2016 దుల్కర్ సల్మాన్ మలయాళ సినీ నటుడు, మమ్ముట్టి కుమారుడు. ఆయన సినిమాలు తెలుగులోకి అనువాదం కావడమే కాక కొన్ని సినిమాలు నేరుగా మలయాళంలోనే తెలుగువారు చూసివున్నారు, తెలుగులోనూ కొంత పేరు సంపాదించుకున్నారు. ఆరంభ స్థాయిలో, చక్కటి స్థితికి తీసుకువచ్చాను
36 ఆపరేషన్ కుకూన్ ఏప్రిల్ 24, 2016 దశాబ్దంపైగా, మూడు రాష్ట్రాల పోలీసులు స్మగ్లర్ వీరప్పన్ కోసం చేసిన తీవ్రమైన వేట చివరకు ముగిసింది. అనేక మలుపులతో ఆసక్తికరమైనదీ, చాలామంది చదవడానికి ఆసక్తి చూపేదీను వ్యాసం చక్కని స్థితికి విస్తరించాను
37 అశోక్ మెహతా ఏప్రిల్ 25, 2016 జాతీయ పురస్కారాల గ్రహీత ఐన ఛాయాగ్రాహకుడు మొలక స్థాయి దాటింది
38 కెఎఫ్‌సీ ఏప్రిల్ 26, 2016 ప్రపంచ ప్రసిద్ధి చెందిన హోటళ్ళ చైన్. తెలుగులో ఉండాల్సిన వ్యాసం. ఇంకా అనువాదం పూర్తి కాలేదు
39 శ్రీరమణ ఏప్రిల్ 27, 2016 తెలుగు వ్యంగ్య రచయిత, సినిమా నిర్మాత. ఉండవలసిన వ్యాసం సహ వికీపీడియన్లు అంతా సాయం పట్టి మంచి అయ్యే వ్యాసం చేశారు
40 ఇ-చౌపల్ ఏప్రిల్ 28, 2016 ఐటీసీ సంస్థ 1990ల్లోనే అంతర్జాలాన్ని ఉపయోగించి రైతులకు మరింత మంచి ధర లభించేలా ఏర్పరిచిన మార్కెటింగ్ విధానం మొలక స్థాయి దాటింది
41 అమెరికాలో బానిసత్వం ఏప్రిల్ 29, 2016 అమెరికన్ పౌర యుద్ధానికి పూర్వం దాదాపు ప్రతీ అమెరికా రాష్ట్రంలోనూ చట్టబద్ధంగా బానిసత్వం సాగింది. నల్లవారిని, స్థానికులను బానిసలుగా చేసి అమ్మడం, కొనడం సాధారణంగా చేసేవారు. దాని గురించిన వ్యాసం బాగా చిన్న వ్యాసం, విస్తరించాలి
42 షణ్ముగలింగం శివశంకర్ ఏప్రిల్ 30, 2016 పొట్టు అమ్మన్ గా ప్రసిద్ధుడు, ఎల్టీటీఈలో రెండో ర్యాంకులో కొనసాగినవాడు. రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర చేసినవారిలో కీలకమైన వ్యక్తి. మొలక స్థాయి దాటింది.
43 పాల వెల్లువ మే 1, 2016 భారతదేశంలో స్వయం సమృద్ధికి బాటలు వేసిన అతి కీలకమైన ఆహార విప్లవాల్లో ఇదొకటి. పాల కొరత అనుభవిస్తున్న స్థితి నుంచి దేశాన్ని ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఒకటిగా మలిచిన అద్భుతమైన మలుపు. తెవికీలో ఉండి తీరాల్సిన వ్యాసాల్లో ఒకటి. మొలక స్థాయి దాటింది, కానీ విస్తరించాలి
44 1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు మే 2, 2016 భారతదేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. తెవికీలో ఉండితీరాల్సిన వ్యాసం ఆరంభ స్థాయిలో ఉంది, మంచి అయ్యేదిగా మలచవచ్చు.
45 బాబ్రీ మసీదు కూల్చివేత మే 3, 2016
46 బి.ఆర్.పంతులు మే 4, 2016
47 రామచంద్ర గుహ మే 5, 2016
48 మే 6, 2016
49 మే 7, 2016
50 మే 8, 2016
51 మే 9, 2016
52 మే 10, 2016
53 మే 11, 2016
54 మే 12, 2016
55 మే 13, 2016
56 మే 14, 2016
57 మే 15, 2016
58 మే 16, 2016
59 మే 17, 2016
60 మే 18, 2016
61 మే 19, 2016
62 మే 20, 2016
63 మే 21, 2016
64 మే 22, 2016
65 మే 23, 2016
66 మే 24, 2016
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100

వ్రాయదగ్గవి (మూలాలు)[మార్చు]