వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ (ఇంజనీరింగ్)
రకంప్రైవేట్
స్థాపితం1983
చైర్మన్డాక్టర్ పి రాజేశ్వర్ రెడ్డి
చిరునామమేడ్చల్ , మల్కాజ్గిరి జిల్లా హైదరాబాద్, హైదరాబాద్ , తెలంగాణ , భారత్
కాంపస్మేడ్చల్
జాలగూడుhttps://anurag.edu.in

అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉన్న ఒక ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం. ఎన్.ఐ.ఆర్.ఎఫ్ 2020 ర్యాంకింగ్ ప్రకారం 180వ స్థానంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది [1].

కోర్సులు[మార్చు]

ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం నాలుగు సంవత్సరముల, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరముల కోర్సులు ఉన్నాయి[2]. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక ఫీజు సహకారం అందిస్తారు[3]. 2018-2019 సమాచారం ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం నాలుగు సంవత్సరముల ఇంజనీరింగ్ కోర్సులలో 4907 విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 3022 మంది అబ్బాయిలు, 1885 మంది అమ్మాయిలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరముల కోర్సులలో 428 విద్యార్థులు చదువుతుండగా, ఇందులో 212 మంది అబ్బాయిలు, 216 మంది అమ్మాయిలు. ప్రతి కోర్సులలో అమ్మాయిల, అబ్బాయిల నిష్పత్తి సుమారు 1:1.54 ఉన్నారు.

ఉద్యోగ నియామకాలు ఉన్నత చదువులు[మార్చు]

2018-2019 సంవత్సరం లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం నాలుగు సంవత్సరముల కోర్సులలో వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 3.25 లక్షలు. ఉద్యోగ నియామకాలకి పోటీపడే విద్యార్థులలో 37% సఫలం అయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరములు కోర్సులలో వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 4.25 లక్షలు,89 శాతం మంది ఉద్యోగం సంపాదించడం లో సఫలీకృతులు అయ్యారు. 2018-2019 సంవత్సరం లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం నాలుగు సంవత్సరముల విద్యార్థులలో 8 శాతం,పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరముల విద్యార్థులలో 10 శాతం మంది పైచదువులకు వెళ్లారు[4].

వ్యయం[మార్చు]

విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల వార్షిక వేతనాలు బయటి కాలేజీల కంటే కొద్దిగా ఎక్కువే ఉంటాయి. 2018-19 సంవత్సరములో అధ్యాపకుల , కార్యాలయ ాలయ సిబ్బంది వేతనాలకై 31.36 కోట్లు ఖర్చు చేశారు . వర్క్‌షాప్‌లు, సెమినార్లు, పరిశోధనా సమావేశాలకు ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు , 2018-19 సంవత్సరములో వీటి కోసము 15.09 లక్షలు ఖర్చు పెట్టారు. గ్రంథాలయాన్ని, ప్రయోగశాలలను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తారు, 2018-19 సంవత్సరములో వీటి కోసము 17.48 లక్షలు ఖర్చు పెట్టారు.    

వికలాంగులకు సౌకర్యాలు[మార్చు]

ఇక్కడ శారీరక వికలాంగులకు సహాయపడే సౌకర్యాలు కలవు.80 శాతం కంటే ఎక్కువ భవనాలలో ఎలివేటర్లు , ర్యాంప్‌లు ఉన్నాయి. వికలాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు 80 శాతంకి పైగా భవనాలలో కలవు. ఒక భవనం నుండి మరో భవనానికి వెళ్ళడానికి వీల్ చైర్ వంటి వసతులు కూడా ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Anurag Group of Institutions | Anurag Group of Institutions" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-18.
  2. "Engineering | Anurag Group of Institutions" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-18.
  3. AU. "Top Engineering Colleges in Telangana, Best Engineering Colleges in Hyderabad". Anurag University (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-17.
  4. "Fast Facts | Anurag Group of Institutions" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-18.