విడాకులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పెళ్ళి తరువాత భార్యాభర్తలు అనివార్య కారణాల వలన విడిపోవాలని నిర్ణయించుకోవడాన్ని విడాకులు గా పిలుస్తారు. విడాకుల వల్ల విడిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది.వివాహాల సమయంలోనే ముందస్తు విడాకుల పిటిషన్లు దాఖలవుతున్నాయి.భాగస్వామికి కుష్టు, మానసిక అనారోగ్యం లాంటి వ్యాధులున్నాయనే కారణాలపై విడాకులు ఇవ్వవచ్చు.వీటిని కొన్ని జంటలు దుర్వినియోగం చేస్తున్నాయి.'పాత రోజుల్లో మన తాత, ముత్తాతలకు ఇలాంటి సమస్యలు లేవు. అప్పట్లో వివాహ వివాదాలు నాలుగు గోడల మధ్య ఇంట్లోనే పరిష్కారమయ్యేవి. పిల్లలకోసం తల్లిదండ్రులు అహం వదులుకోవాలి.తల్లిదండ్రుల విడాకులవల్ల చివరకు బాధపడేది పిల్లలే. ఆడపిల్ల విషయంలోనైతే వివాహం సమయంలోపరిస్థితి మరీ తీవ్రంగా ఉంటుంది.

ఇస్లాంలో విడాకులు[మార్చు]

ఇస్లాం ప్రకారం భర్త మూడుసార్లు తలాక్ అంటే ఇక ఆ వివాహ బంధం రద్దు అయినట్లే. భర్త సరదాగా అన్నా కూడా ఇక ఆ వివాహం చెల్లదు. కతార్‌కి చెందిన ఒక వ్యక్తి సరదాగా ఇంటర్నెట్ లో తన భార్యకి తలాక్ అని మూడు సార్లు చెప్పాడు. దీంతో అతడి వివాహం రద్దు చేయబడింది. షరియా చట్టం ప్రకారం ఇస్లామిక్ మతసంస్థ దార్-ఉల్-ఉలూమ్ వివాహం చెల్లదని తీర్పు ఇచ్చింది. డియోబండ్ కి చెందిన దార్-ఉల్-ఇఫ్తా అతడికి ఇక నుంచీ తన భార్య హరామ్ అని పేర్కొంది. తనకి భార్య మీద ప్రేమ ఉన్నా ఇప్పుడు ఆమెతో అతడు జీవితం కొనసాగించలేకపోతున్నాడని వాపోయాడు. పోనీ మళ్ళీ ఆమెనే పెళ్ళి చేసుకుందామన్నా ఇందుకు ఇస్లామిక్ చట్టాలు అంగీకరించవు. ఇందుకు ఒక పరిష్కారం సూచించారు. అదే హలాలాహ్. అంటే ఆమె వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుని అతడికి విడాకులిస్తేగానీ తిరిగి పాత భర్తని వివాహం చేసుకునేందుకు అర్హురాలు కాదు. అంతకన్నా ముందు ఆమె ఇద్దత్ ని అనుసరించాలి. అనగా విడాకులు పొందాక మూడు నెలలు పాటు మళ్ళీ వివాహం చేసుకోరాదు. అంతేగాక తను అన్ని సంతోషాలకు, సంబరాలకు దూరంగా ఉండాలి. ఇలా రెండు మార్లు ఇద్దత్ అనుభవించిన తర్వాత తిరిగి పాత భర్తని వివాహం చేసుకోవాలి. భార్య తలాక్ ఇచ్చిందా లేదా అన్న విషయంతో సంబంధం లేదని ఫత్వాలో పేర్కొనబడింది. ఈ విషయాలు బుఖారీలో(Vol. 2, P. 791) మరియు ఫతావా అల్-హిన్దియా లో పేర్కొనబడ్డాయని దార్-ఉల్-ఉలూమ్ కి చెందిన ముఫ్తీ ఆరిఫ్ కస్మీ చెప్పాడు.[1] మొబైల్‌ ఫోన్లో తలాక్‌ :మొబైల్‌ ఫోన్లో మూడుసార్లు తలాక్‌ చెప్పినప్పుడు నెట్‌వర్క్‌ సమస్య వల్ల కానీ ఇతర కారణాల వల్ల కాని అతని భార్యకు వినపడకపోయినా అది చెల్లుబాటు అవుతుందని దార్‌ ఉల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌ ఫత్వా జారీ చేసింది.[2]

మనోవర్తి[మార్చు]

విడిపోయిన భార్య పోషణ కోసం భర్త చెల్లించవలసిన భరణం. ఎయిడ్స్‌ ఉన్నా మనోపర్తి చెల్లించాల్సిందే. విడిపోయిన భార్యాపిల్లలకు మనోవర్తి చెల్లించకుండా తప్పించుకోవడం కుదరదు.భర్తగా.. నైతిక, సామాజిక, చట్టపరమైన తన బాధ్యత నుంచి అతను తప్పించుకోలేడు.రెండో భార్యకు మనోవర్తి రాదు.వివాహితుడ్ని పెళ్లాడిన హిందూ మహిళ తనకు మనోవర్తి కావాలని కోరే అవకాశం లేదు.హిందూ చట్టం ప్రకారం మొదటి భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకోవడం కుదరదు. బహుభార్యలున్న భర్త తనను సరిగా చూసుకోవడం లేదని సమాన ప్రాధాన్యం ఇవ్వడం లేదనీ ఓ ముస్లిం మహిళ నిశ్చయించుకొని విడాకులు కోరితే ముస్లిం వివాహ చట్టం 1939లోని సెక్షన్‌ 2 (6)(ఎఫ్‌) ప్రకారం కోర్టులు ఆమె వాదనను అంగీకరించాల్సిందే.భర్త తనపై వివక్ష చూపుతున్నాడా? లేదా అనే విషయాన్ని నిర్ణయించడంలో భార్యే సరైన జడ్జి.

విడాకులు పొందిన కూతురూ కుటుంబ పింఛనుకు అర్హురాలే[మార్చు]

పింఛను పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయనపై ఆధారపడిన వితంతు, విడాకులు పొందిన కుమార్తె కుటుంబ పింఛను పొందవచ్చు. ఈ విషయంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.గతంలో ఉద్యోగి బతికి ఉండగానే కూతురు వితంతువై లేదా విడాకులు పొంది ఉంటేనే పింఛను అందేది. 25 ఏళ్ల వయోపరిమితి వరకే వర్తింపజేయాలనే నిబంధన ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం వితంతు, విడాకులు పొందిన కూతురు మళ్లీ వివాహం చేసుకున్నా, మరణించినా ,ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి లేదా స్వయంఉపాధి ద్వారా నెలకు రూ.2440 పొందుతున్నా పింఛను ఆగిపోతుంది.

విడాకులకు కారణాలు[మార్చు]

భార్యా భర్తల మధ్య అపనమ్మకం; ప్రేమ లేకపోవడం; లైంగిక సామర్ద్యం లోపించడం; వివాహేతర సంబంధాలు; డబ్బు మీద వ్యామోహం; పాశ్చాత్య సంస్కృతి ప్రభావం; అత్యధిక జీతాలు; అహం; వరకట్న వేధింపులు; స్త్రీ ఉద్యోగ -ఆర్ధిక స్వేచ్ఛ దుర్వినియోగం; ఒకరిమీద ఒకరు ఆధారపడకపోవడం; నైతిక విలువలు లోపించడం; ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం; 498 ఎ గృహహింస చట్టం దుర్వినియోగం; మొదలగున్నవి కారణాలుగా చెప్పవచ్చు.

చట్ట ప్రకారంగా వ్యభిచారం, క్రూరత్వం, వదిలేసి వెళ్లిపోవడం, మరో మతంలోకి మార్చడం, మతి స్థిమితం లేకపోవడం, నయం కానంత తీవ్రస్థాయిలో లెప్రసీ ఉండడం, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సుఖ రోగాలు ఉండడం, సన్యసించడంతోపాటు ఏడేళ్లుగా బతికి ఉన్నారని తెలియని సందర్భాల్లో విడాకులు కోరవచ్చు. జీవిత భాగస్వామితో సఖ్యత ఇక సరిదిద్దలేని స్థాయికి చేరిందని, అతడు లేక ఆమె వాయిదాలకు హాజరు కాకుండా, కోర్టుకు రాకుండా 'వేధిస్తున్నా'రని ఇద్దరిలో ఎవరో ఒకరు నిరూపిస్తే విడాకులు కోరవచ్చు.

లా కమీషన్ చెప్పిన అంశాలు[మార్చు]

 • దంపతుల మధ్య వైరుధ్యాలు నెలకొని, వారిరువురూ ఇక భార్యాభర్తలుగా కలిసి ఉండటం అసాధ్యమని తెలిసిన తర్వాత కూడా వారి దాంపత్యాన్ని నిలబెట్టాలని ప్రయత్నించటం అర్థరహితమే కాదు.. అసంబద్ధం, అమానవీయం కూడా.
 • వివాహం డొల్లగా మారిపోయి.. అందులో సారం పోయినప్పుడు.. పైకి బంధంలా కనబడుతూ.. లోపల మాత్రం అది కేవలంగుదిబండగానే మిగిలినప్పుడు.. దాన్ని విడదీయక తప్పదు. ఇటువంటి సందర్భాల్లో విడాకులే పరిష్కారం.
 • విడాకుల కోసం దరఖాస్తు చెయ్యటానికి ముందు- మూడు సంవత్సరాల కాలం పాటు వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తల మధ్య వైవాహిక బంధం 'సరిచెయ్యలేనంతగా దెబ్బతిన్నట్టుగా' భావించవచ్చు
 • విడాకులు మంజూరు చెయ్యటానికి ముందు కోర్టులు- స్త్రీల ఆర్థిక రక్షణ, పిల్లల సంరక్షణ బాధ్యతలను కచ్చితంగా సరిచూడాలి.
 • విడాకుల కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కోర్టుకు కావాలని గైర్హాజరవుతూ.. కేసు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. భాగస్వామిని వేధించేందుకు దీన్నొక మార్గంగా ఎంచుకుంటున్నారు. ఫలితంగా రెండో వ్యక్తి నష్టపోవాల్సి వస్తోంది.
 • ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎదుటివారు తప్పు చేశారని నిరూపించటం అవసరం కాబట్టి- దానికోసం భార్యాభర్తలు దాంపత్యజీవితంలోని 'బయటకు చెప్పుకోలేని అంశాలను' కూడా కోర్టులో చెప్పుకోవాల్సి రావటం.. బెడద అంతా చట్టసవరణద్వారా తప్పుతుంది.
 • వైవాహిక బంధం కోలుకోలేనంతగా దెబ్బతిన్నదని తెలిసిన తర్వాత కూడా దాన్ని నిరవధికంగా కొనసాగించనివ్వటం సరికాదు.మానవ జీవితం చిన్నది.ఇటువంటి బాధాకర అనుభవాలను నిరవధికంగా కొనసాగనివ్వకూదదు.ఎక్కడో చోట దీనికి ముగింపు ఇవ్వాలి. చట్టం ఇవేవీ పట్టనట్టు ఉండటం సరికాదు.

ఇదీ పరిస్థితి[మార్చు]

 • మనదేశంలో ప్రతి 1000 వివాహ బంధాల్లో కనీసం 11 విడాకులకు వెళుతున్నాయి.
 • అమెరికాలో ప్రతి 1000 పెళ్లిళ్లకు 400 విచ్ఛిన్నమవుతున్నాయి.
 • విడాకులు పొందటానికి మనదేశంలో 6 నెలల నుంచి 20 ఏళ్ల వరకూ పట్టొచ్చు.అమెరికాలో 2 ఏళ్లు, ఐరోపా దేశాల్లో 6 ఏళ్ల సమయం పడుతుంది.

ఎక్కడైనా[మార్చు]

 • హిందూ మహి ళ ఎక్కడైనా విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, ఇందుకు హిందూ వివాహ చట్టం అనుమతిస్తుందనీ మద్రాసు హైకోర్టు ప్రకటించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-19కి సవరణలు చేయడం ద్వారా భారత్‌లో ఉన్న మహిళ విదేశాల్లోని తన భర్త నుంచి విడాకులు కోరుతూ, తాను నివసిస్తున్న ప్రాంతానికి చెందిన కుటుంబ న్యాయస్థానంలోనే కేసు దాఖలు చేసుకోవచ్చు.

మూలాలు[మార్చు]

 1. http://news.in.msn.com/national/article.aspx?cp-documentid=4508570
 2. ఈనాడు 16.11.2010
"http://te.wikipedia.org/w/index.php?title=విడాకులు&oldid=1208965" నుండి వెలికితీశారు