వీగనిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీగనిజం అనేది జంతువులకు సంబంధించిన ఈ పదార్థాన్నైనా తిరస్కరించే (ముఖ్యంగా ఆహారంలో) పద్ధతి. దీని మూలతత్వం జంతువులను ఒక వ్యాపార వస్తువుగా చూడకూడదు అనే తత్వంలోనుంచి పుట్టుకొచ్చింది. వీగనిజం అనుసరించే వారిని వీగన్ అంటారు.

అనుసరించే పద్ధతిని బట్టి వీగన్లకు వివిధ వర్గాలుగా విభజించవచ్చు. ఆహారంలో వీగనిజం అనుసరించే వారు శుద్ధ శాకాహారులు అనవచ్చు. వీళ్ళు మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఇంకా ఏ ఇతర జంతు ఆధారిత ఉత్పత్తులు ఏవీ ఆహారంగా స్వీకరించరు. ఒక నైతికపరమైన వీగన్ అయితే జంతు సంబంధిత పదార్థాలను ఆహారంగా స్వీకరించకపోవడమే కాకుండా జంతువులను, జంతువు ఉత్పత్తులను, జంతువుల మీద ప్రయోగించిన ఉత్పత్తులను కూడా వీలైనంత మేరకు వాడరు.

చరిత్ర[మార్చు]

శాకాహార మూలాలు సా.శ.పూ 3300-1330 మధ్యలో భారత ఉపఖండంలో, ముఖ్యంగా పురాతన ఉత్తర, పశ్చిమ భారతదేశంలో[1] విలసిల్లిన సింధు లోయ నాగరికతలో ఉన్నాయి.[2][3][4] భారతీయ తత్వవేత్తలయిన పార్శ్వనాథుడు, మహావీరుడు, కుందకుందాచార్యుడు, ఉమాస్వాతి, సమంతభద్రుడు, తిరువళ్ళువర్ మొదలైన వారు తొలి శాకాహారులు.

దేశాల వారీగా[మార్చు]

2005-2006 నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం భారతదేశంలో సర్వే చేసిన 1.6 శాతం మందిలో జంతు ఉత్పత్తులు ఏమీ స్వీకరించమని చెప్పారు. గుజరాత్ (4.9%), మహారాష్ట్ర (4.0%) ఇది అత్యధికంగా ఉంది.[5]

మూలాలు[మార్చు]

  1. Singh, Upinder (2008). A History of Ancient and Early medieval India: from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. p. 137. ISBN 978-81-317-1120-0.
  2. Bajpai, Shiva (2011). The History of India – From Ancient to Modern Times. Himalayan Academy Publications (Hawaii, USA). ISBN 978-1-934145-38-8.
  3. Spencer, Colin (1996). The Heretic's Feast: A History of Vegetarianism. Fourth Estate Classic House. pp. 33–68, 69–84. ISBN 978-0-87451-760-6.
  4. Tähtinen, Unto (1976). Ahimsa: Non-violence in Indian tradition. London: [1976], Rider and Company. ISBN 978-0-09-123340-2.
  5. Agrawal, Sutapa; Millett, Christopher J; Dhillon, Preet K; Subramanian, SV; Ebrahim, Shah (2014). "Type of vegetarian diet, obesity and diabetes in adult Indian population". Nutrition Journal. 13 (1): 89. doi:10.1186/1475-2891-13-89. PMC 4168165. PMID 25192735.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
"https://te.wikipedia.org/w/index.php?title=వీగనిజం&oldid=4074482" నుండి వెలికితీశారు