షాజెహాన్ ఆపా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షాజెహాన్ ఆపా(~1936 - సెప్టెంబర్ 8, 2013) భారతదేశానికి చెందిన మహిళా హక్కుల కార్యకర్త. ఆమె కుమార్తెలలో ఒకరు వరకట్న మరణంలో హత్యకు గురైన తర్వాత, భారతదేశంలో వరకట్న హత్యలు, పరిహారం, లింగవివక్షను ఎదుర్కోవడానికి ఇతర భారతీయ మహిళలు, తల్లులతో కలిసి స్త్రీవాద క్రియాశీలత జీవితాన్ని ప్రారంభించేందుకు ఆపా ప్రేరణ పొందింది.1987లో, షాజెహాన్ ఆపా శక్తి శాలినీ అనే సంస్థను స్థాపించారు, ఇది న్యూఢిల్లీలో కేంద్రీకృతమై, లింగ-ఆధారిత హింసను ఎదుర్కోవడానికి, వేలాది మంది భారతీయ మహిళలకు మద్దతునిస్తుంది.[1]మిచిగాన్ విశ్వవిద్యాలయం యొక్క ‘’’గ్లోబల్ ఫెమినిజమ్స్ ప్రాజెక్ట్’’’, స్త్రీవాద కార్యకర్తలు, నిర్వాహకులతో మౌఖిక చరిత్ర ఇంటర్వ్యూల శ్రేణి ద్వారా ఆమె జీవితపు పోరాటాన్ని ప్రపంచం ముందు వుంచబడింది.

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

1947 భారత విభజన సమయంలో రెండు దేశాలలో జరిగిన అల్లారులు,హింసా సంఘటనల్లో షాజహాన్ తల్లిదండ్రులు చంపబడ్డారు,అప్పటికి షాజెహాన్ ఆపా వయసు 11 సంవత్సరాలు.[2]తల్లి దండ్రుల మరణం తరువాత ఆమె సోదరితో పాటు, ఆమె భారతదేశం లోని మథురలోని గ్రామీణ, పేద పొరుగు ప్రాంతంలో పెంపుడు కుటుంబంతో పెరిగింది.ఆమె పెంపుడు తల్లిదండ్రులు ఆమెను మదరసా(ఒక మతపరమైన ముస్లిం ప్రాథమిక పాఠశాల)అందులో ఖురాన్, ఉర్దూపై ప్రాథమిక విద్యను అభ్యసించడానికి అనుమతించారు.[3]14 సంవత్సరాల వయస్సులో, ఆమెకు ఇష్టం లేకున్నా,ఆమె పెంపుడు తల్లిదండ్రుల కోరికపై తన పెంపుడు తల్లిదండ్రుల కొడుకును వివాహం చేసుకుంది.14 ఏళ్ల వయస్సులో ఆపా వారి కుటుంబానికి చెందిన గేదెలు, ఆవులను పోషించడంతో పాటుగా ఇంటి వ్యవసాయ, ఇంటి పనిలో ఎక్కువ భాగం పూర్తి చేసె భాద్యత ఆపా భుజస్కంధాల పై పడినది.. [3]ఆమె ఎప్పుడైనా ఒక పనిని పూర్తి చేయడానికి నిరాకరించినట్లయితే, ఆమె భర్త షాజహాన్‌ను మాటలతో దుర్భాషలు ఆడేవాడు , శారీరకంగా దాడి చేసేవాడు. [4]ఆమె భర్తతో విడాకులు తీసుకుని విడిపోయే నాటికి ఆపా సంతానం ఏడుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[4]విడాకుల తర్వాత, ఆమె తన సోదరి నివసించే ఢిల్లీకి వెళ్లింది. జీవనం కోసం అల్లికలు పని, కుట్లు పని చేస్తూ తన పిల్లలను పోషించుకునేది.

స్త్రీవాద-స్త్రీ సాధికార క్రియాశీలతకు పునాది[మార్చు]

షాజెహాన్ కుమార్తె నూర్జహాన్ను ఆమె భర్త కుటుంబ సభ్యులు,ఆమె అడిగిన కట్నం ఇవలేదని సజీవ దహనం చేసారు. ఈ ఘటన షాజెహాన్ లో నిద్రితమై వున్న స్త్రీవాదం ,అన్యాయాన్ని ఎదిరించే తత్వం స్త్రీవాద క్రియాశీలత బయటికి వచ్చింది.

కూతురు మరణం[మార్చు]

1979లో ఢిల్లీలోని నాంగ్లోయ్లో,ఆప కూతురు నూర్జెహాన్ తాను చంపబడే నెలల ముందు, తల్లి షాజహాన్ కు తన అత్తమామలకు తగినంత ధనం/కట్నం చెల్లిస్తే వారి వేధింపులు మానివేస్తామనీ చెప్పారని తెలియజేసింది.కానీ షాజహాన్ కు అనుకున్న సమయానికి అంత డబ్బు లభించలేదు,డబ్బుతో రాకపోవడంతో,నూర్జెహాన్‌ను కొట్టి, కిరోసిన్ పోసి, ఆమె ఇంట్లోనే నిప్పంటించారు. [2]తన కూతురు హత్య విషయమై ,పోలీసులు తక్షణమే, షాజహాన్ కుటుంబాన్ని జైలులో పెట్టాలని డిమాండ్ చేశాడు.ఈ విషయంపై షాజహాన్, స్థానిక సంఘం సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ర్యాలీ కూడా నిర్వహించారు. [2]స్థానిక పోలీసులు ఒక నివేదికను దాఖలు చేయవలసిందని పట్టుపట్టింది , అయితే పోలీసుల నివేదిక ఫైల్ చదివిన ఆమె నివ్వెర పోయింది నూర్జెహాన్ క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడుతోందని, ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొనబడినది.[2]ఆపా కన్న ముందు చాలా మంది కేసులలో జరిగిన విధంగానే, పోలీసులు, న్యాయవ్యవస్థ ఆమె ఫిర్యాదులను తగిన రీతిలో పరిష్కరించలేదు. క్రిమినల్ కోర్టు తన కూతురు హత్య కేసును విచారించాలని ఆమె మూడు సంవత్సరాలు విశ్వ ప్రయత్నాలు చేసింది, కానీ పోలీసుశాఖలో విస్తృతంగా వున్న అవినీతి కారణంగాకేసు బాగా ఆలస్యం చేయబడింది.[5]తనకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేయటంలో న్యాయ వ్యవస్థ యొక్క వైఫల్యం తో పాటు ఆమె అనుభవించిన విపరీతమైన దుఃఖం, ఆమె గృహిణి జీవితం నుండి వైదొలగి స్త్రీవాద సంస్థలోకి ప్రవేశించడానికి ప్రోత్సహించింది, ప్రత్యేకంగా స్త్రీలపై జరిగే గృహ హింసను అరికట్టడం,తగ్గించడంపై దృష్టి సారించింది.[1]

శక్తి శాలిని[మార్చు]

షాజెహాన్ మొదట్లో బస్తీ లోని ప్రభుత్వ ప్యానెల్ లో పని చెయ్యడం ద్వారా రాజకీయ క్రియాశీలతను కొనసాగించింది, అక్కడ ఆమె న్యాయసహాయం కోరుతూ వచ్చిన నిరాశ్రయులైన మహిళలకు సహాయం చేసేది.మహిళలకు వారి నిర్దిష్ట కట్నం లేదా దుర్వినియోగ కేసులను పరిష్కరించడంలో షాజెహాన్ తరచుగా సహాయం చేయలేకపోయినందున ఇది నిరాశపడేది.ఆమె తోటి సహోద్యోగి,సత్య రాణి చద్దా, 25 మంది మహిళలు ఈ కేసులలో చట్టపరమైన చర్యల కోసం వాదించడానికి, బాధితుల వైద్య ఖర్చుల కోసం నిధులను సేకరించడానికి ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారని షాజెహాన్‌కు తెలియజేసింది . [5]ఈ బృందం వరకట్న బాధితుల తల్లిదండ్రుల సంఘం పేరుతో క్రమం తప్పకుండా సమావేశం కావడం ప్రారంభించింది, కానీ త్వరలోనే శక్తి శాలిని, ప్రభుత్వేతర సంస్థ (NGO)గా అభివృద్ధి చెందింది,దీనిని జనవరి 1987లో ఢిల్లీలో షాజహాన్, సత్య సహ-స్థాపించారు.[6]రాజస్థాన్కి చెందిన శాంతి అనే మహిళ ను ఆమె భర్త భవనంలోని మూడవ అంతస్తు నుండి విసిరి వేయబడిన కేసులో ఆమె కోర్టు ద్వారా పొరాడి కేసు గెలిచిన,ఒక చిరస్మరణీయ సందర్భంలో షాజెహాన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ NGO కు ఆమె పేరు పెట్టబడింది.ఈ కేసులో షాజెహాన్ పూర్తిగా నిమగ్నమై , ఆమె స్వంత కూతురు కేసు విచారణకు కోర్టుకు గైరు హాజరు అవ్వడం వలన ఆమె వ్యక్తిగత కేసు రద్దు చేయబడింది.[7]

గృహ హింస బాధితులను రక్షించడానికి చట్టం కోసం ప్రచారం చేయడం వీరి సమూహంద్వారా ప్రారంభమైంది. ఏది ఏమైనప్పటికీ, సంస్థ నిరహణ యొక్క లక్ష్యం , కేంద్ర బిందువు సాధారణ మహిళలకు సరైన గృహనిర్మాణం, దోపిడీకి గురైన మహిళలకు విద్య, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో పాటు వారిని ఆభివృద్ధి వైపు నడిపించడంలో ,ఈ సంస్థ మరింత కృషి జరిపి అభివృద్ధి చెందింది.[8]న్యాయ వ్యవస్థ వంటి సంస్థలు విలువైన మార్పును సృష్టించలేవు కానీ దానిని శాశ్వతంగా కొనసాగించగలవని షాజెహాన్ దృక్పథం కారణంగా ఈ సంస్థ నిరహణ లక్ష్యంలో మార్పు జరిగింది.బదులుగా, శక్తి శాలిని బాధితుల హక్కులు, జీవితాలను మెరుగు పరచడానికి చర్చలు, వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా వారి న్యాయవాదానికి అత్యంత వ్యక్తిగతమైన విధానాన్ని తీసుకుంది.[2]షాజెహాన్ NGO కు వ్యవస్థాపకురాలు , అధ్యక్షురాలిగా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంచారు,వీరి సమూహం యొక్క మొదటి ‘’’మహిళల ఆశ్రయ’’’ 1987 జూలైలో ప్రారంభించబడింది.[9]ఆశ్రయం బాధితులు, వారి పిల్లలకు 90+ రోజుల సురక్షిత స్వర్గాన్ని అందించడం ప్రారంభించింది, చివరికి స్థానిక పోలీసులు కూడా మహిళలకు ఈ సంస్థను రక్షిత మైనదిగా సూచించే ప్రదేశంగా మారింది.ఈ రోజు వరకు,శక్తి శాలిని లింగ-ఆధారిత హింస, కమ్యూనిటీ క్రియాశీలతను ఎదుర్కోవడంపై దృష్టి సారిస్తున్నది, ప్రత్యేకంగా మహిళలు, యువతులకు ఆశ్రయం, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, విద్య, వృత్తి శిక్షణ రూపంలో సహాయం అందించడంలో ప్రాధాన్యతనిస్తుంది. [8]ఈ బృందం మహిళలు పాఠశాల విద్యను ముగించిన తర్వాత వారికి ఉద్యోగాలనుకల్పిస్తుంది లేదా వారు ఇప్పటికీ పాఠశాలలో ఉన్నట్లయితే (చాలా మంది సెకండరీ పాఠశాల లేదా కళాశాలలో) వారి పరీక్షలకు సిద్ధం చేయడంలో వారికి సహాయం చేస్తుంది.ఈ NGO మహిళకు ప్రారంభ ఉద్యోగ నియామకం తర్వాత సంవత్సరాల పాటు మహిళలతో సన్నిహితంగా ఉంటుంది, ఈ మహిళల పిల్లలకు సహాయం చేయడం, అవసరమైనప్పుడు వారికి విద్యా కోర్సులు లేదా ఆశ్రయం అందించడం కూడా కొనసాగిస్తుంది.ఈ కోర్సులు విద్యాపరంగా ప్రయోజన కరమైనవి మాత్రమే కాదు, స్త్రీ స్వాతంత్రాన్ని,మహిళా సాధికారత పొందటానికి, ప్రోత్సహిం చడా నికి స్త్రీవాద భావజాలాన్ని కూడా కలిగి ఉంటాయి. పని చేయకూడదనుకునే శక్తి షాలిని వద్దకు తీసుకురాబడ్డ కొంతమంది స్త్రీలకు, NGO తగిన కుటుంబాలతో వివాహాలు కూడా చేస్తుంది. [10]సంస్థ తన కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఆహారం, నివాసం కోసం ప్రభుత్వ గ్రాంట్లు, విరాళాలు, ప్రత్యేకంగా విద్య కోసం అందుకుంటుంది. వారి వెబ్‌సైట్ ప్రకారం, శక్తి శాలిని 36 సంవత్సరాల కాలంలో 15,000+ వ్యక్తులకు సహాయం చేసింది, ఈ సంస్థ న్యూఢిల్లీలో కనీసం అయిదు అట్టడుగు వర్గాల్లోని వారికి సహాయ సహకారాలు అందించినది.[8]

మరణం[మార్చు]

సెప్టెంబరు 28, 2013న, షాజెహాన్ ఆప తన 77వ ఏట మరణించాడు. ఒకరిపై జరిగిన హింసపై చర్చించ టానికి,సహాయం అందించటానికి ఒక మహిళా సంఘం తరుపున మహిళా పంచాయతీకి వెళ్లే మార్గంలో షాజహాన్‌ను మోటారు వాహనం ఢీకొట్టి ప్రమాదంలో చనిపోయినది.[9]

ఇవి కూడా చదవండి[మార్చు]

1.ప్రియా జింగన్

2.వీణా మజుందార్

3.సంపత్ పాల్ దేవి

4.షర్మిలా రేగే

5.శశి దేశ్‌పాండే

మూలాలు /ప్రస్తావనలు[మార్చు]

  1. 1.0 1.1 Frederick, Jennifer K.; Stewart, Abigail J. (May 2018). ""'I Became a Lioness': Pathways to Feminist Identity Among Women's Movement Activists"". Psychology of Women Quarterly. 42 (3): 263–278. doi:10.1177/0361684318771326. ISSN 0361-6843 – via Sage Journals.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Savaş, Özge; Caulfield, Sueann; Smith, Hanna; House, Madeline; Stewart, Abigail J. (August 2023). "Vulnerability and empowerment on the ground: Activist perspectives from the global feminisms project". Feminism & Psychology. 33 (3): 429–446. doi:10.1177/09593535221139135. ISSN 0959-3535. S2CID 259021476 – via Sage Journals.
  3. 3.0 3.1 Kannadasan, Akila (July 13, 2013). "Finding Wings". The Hindu. ISSN 0971-751X. Retrieved November 13, 2023.
  4. 4.0 4.1 Savaş, Özge; Stewart, Abigail J. (2019). ""Alternative pathways to activism: Intersections of social and personal pasts in the narratives of women's rights activists."". Qualitative Psychology. 6 (1): 27–46. doi:10.1037/qup0000117. ISSN 2326-3598. S2CID 158960705 – via APA PsycNet.
  5. 5.0 5.1 Stewart, Abigail J.; Lal, Jayati; McGuire, Kristin (June 2011). "Expanding the Archives of Global Feminisms: Narratives of Feminism and Activism". Signs: Journal of Women in Culture and Society. 36 (4): 889–914. doi:10.1086/658683. ISSN 0097-9740. S2CID 144600334 – via University of Chicago Press.
  6. Teays, Wanda (1991). "The Burning Bride: The Dowry Problem in India". Journal of Feminist Studies in Religion. 7 (2): 29–52. ISSN 8755-4178. JSTOR 25002154.
  7. Jamshed, Nida (2022). "Women activists' resistance and social change in India". Journal of Peace Psychology. 28 (4): 413–428. doi:10.1037/pac0000596. ISSN 1532-7949. S2CID 247125757.
  8. 8.0 8.1 8.2 "Shakti Shalini – Promoting gender equality, individual choice and dignity since 1987" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-17.
  9. 9.0 9.1 "Shahjahan Apa (India) | WikiPeaceWomen – English". wikipeacewomen.org. Retrieved 2023-11-16.
  10. Kumari, Upasha (2023-07-15). "Exploring the Role of NGOs in Addressing Gender-Based Violence Against Women". Journal of Advanced Research in Women's Studies. 1 (1): 38–52. doi:10.33422/jarws.v1i1.413. ISSN 2783-7122.