సదాగోపన్ రమేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సదాగోపన్ రమేష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సదాగోపన్ రమేష్
పుట్టిన తేదీ (1975-10-13) 1975 అక్టోబరు 13 (వయసు 48)
మద్రాసు
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడీచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 219)1999 జనవరి 28 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2001 సెప్టెంబరు 2 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 122)1999 మార్చి 30 - శ్రీలంక తో
చివరి వన్‌డే1999 అక్టోబరు 3 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.4
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/96–2005/06తమిళనాడు
2007/08అస్సాం క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే
మ్యాచ్‌లు 19 24
చేసిన పరుగులు 1367 646
బ్యాటింగు సగటు 37.97 28.08
100లు/50లు 2/8 0/6
అత్యధిక స్కోరు 143 82
వేసిన బంతులు 5 36
వికెట్లు 0 1
బౌలింగు సగటు 38.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/23
క్యాచ్‌లు/స్టంపింగులు 18/– 3/–
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4

సదాగోపన్ రమేష్ (జననం 1975 అక్టోబరు 13) భారతీయ క్రికెటర్, తమిళ సినిమా నటుడు. [1] [2] అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలరు.[3] 1999 సెప్టెంబరులో అతను వన్‌డే క్రికెట్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ క్రికెటర్ అయ్యాడు.

క్రికెట్ కెరీర్[మార్చు]

తన మొదటి ఆరు టెస్టుల్లో 50కి పైగా బ్యాటింగ్ సగటును కలిగి ఉండి, టాప్ బౌలర్‌లకు వ్యతిరేకంగా సులభంగా ఆడగలనని నిరూపించుకున్నప్పటికీ, అతను తన తొలి విజయాలను పెద్ద స్కోర్లుగా మార్చుకోలేకపోయాడు. భారత శ్రీలంక పర్యటన తర్వాత అతను 6 ఇన్నింగ్సు ఆడి ఐదింటిలో 30 పరుగులు దాటగా, ఒక ఇన్నింగ్స్‌లో మాత్రమే 50 దాటాడు. దాంతో అతన్ని జట్టు నుండి తొలగించారు. చెన్నై సూపర్ కింగ్స్ అతనిని 8.7 కోట్లకు ఎంచుకుంది గానీ, సినిమాల్లో నటించేందుకు గాను దాన్ని నిరాకరించాడు. మొదట తమిళనాడు తరపున ఆడినప్పటికీ, 2005-06, 2006-07 సీజన్లలో కేరళ తరపున, 2007-08 సీజన్‌లో అస్సాం తరపునా దేశీయ క్రికెట్ ఆడాడు.

సినిమా కెరీర్[మార్చు]

రమేష్ 2008 ఏప్రిల్‌లో విడుదలైన సంతోష్ సుబ్రమణ్యం అనే తమిళ చిత్రంలో నటించాడు.[4][5][6] పొట్ట పొట్టి చిత్రంలో తొలిసారిగా ప్రధాన నటుడిగా కూడా నటించాడు.[7]

వ్యక్తిగత జీవితం[మార్చు]

రమేష్ 2002లో అపర్ణను పెళ్లాడాడు. వీరికి ఒక కూతురు ఉంది.

వ్యాపారం[మార్చు]

2019లో, రమేష్ 'స్వరాస్', [8] మల్టీపర్పస్ కరవోకే స్టూడియోలో పెట్టుబడి పెట్టాడు.

మూలాలు[మార్చు]

  1. "Sadagopan Ramesh, Former Cricketer". 30 March 2011 – via The Hindu.
  2. "Rediff on the NeT: The Rediff Interview: Sadagopan Ramesh". Archived from the original on 14 October 2013. Retrieved 2013-10-12.
  3. "Ramesh dismissed in Sydney".
  4. "A flying start for Sadagopan Ramesh". The Times of India. Archived from the original on 2013-10-14.
  5. "Cricketer Sadagopan Ramesh becomes hero". Archived from the original on 2016-09-15. Retrieved 2023-08-07.
  6. "News Today - An English evening daily published from Chennai". www.newstodaynet.com. Archived from the original on 2011-05-25.
  7. "Cricketer does a star turn | Deccan Chronicle". www.deccanchronicle.com. Archived from the original on 2013-01-16.
  8. Kumar, Pradeep (3 June 2019). "Sadagopan Ramesh gives Smuleans a platform". The Hindu.