సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Map showing the location of సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం
Map showing the location of సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం
ప్రదేశండార్జిలింగ్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
సమీప నగరంమనిభంగ్ జంగ్
విస్తీర్ణం78.6
స్థాపితం1986
పాలకమండలిభారత ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మనేభాన్ జంగ్ నగరానికి చేరువలో డార్జిలింగ్ అనే ప్రాంతంలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యానవనాన్ని 1986 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. దీనిని 1992 లో జాతీయ ఉద్యానవనంగా గుర్తించారు. ఇది మొత్తం 78.6 చ. కిలోమీటర్ల వైశాల్యం లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం చాలాకాలంగా మానేభంజాంగ్ నుండి సందక్ఫు (పశ్చిమ బెంగాల్ యొక్క ఎత్తైన శిఖరం), ఫలుట్ వరకు ట్రెక్కింగ్ మార్గంగా ఉపయోగించబడింది.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈ ఉద్యానవనంలో ఎర్ర పాండా, చిరుత పులులు, జింకలు, పసుపు గొంతు మార్టెన్, అడవి పంది, పాంగోలిన, పికా, హిమాలయాల్లో నివసించే నల్ల ఎలుగుబంట్లు వంటి ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి.[2]

భౌతిక భౌగోళికం[మార్చు]

పశ్చిమ బెంగాల్లో ఉన్న రెండు ఎత్తైన శిఖరాలు సందక్ఫు (3630 మీ), ఫలుట్ (3600 మీ) ఈ ఉద్యానవనంలో ఉన్నాయి. ఈ ఉద్యానవనం గుండా రామ్మామ్, సిరిఖోలా నదులు ప్రవహిస్తున్నాయి.

మూలాలు[మార్చు]

  1. Das, A.P.; Ghosh, Chandra (March 2011). "Plant wealth of Darjiling and Sikkim Himalayas vis-à-vis Conservation". NBU Journal of Plant Sciences. 5 (1). University of Bengal: 25–33. Retrieved 18 December 2014.
  2. Wikramanayake, Eric; et al. (2002). Terrestrial Ecoregions of the Indo-Pacific: A Conservation Assessment. Washington, D.C.: Island Press. ISBN 1-55963-923-7.