సీతారామయ్యగారి మనవరాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సీతారామయ్యగారి మనవరాలు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ‌క్రాంతికుమార్
తారాగణం మీనా ,
అక్కినేని నాగేశ్వరరావు,
రోహిణి హట్టంగడి
సంగీతం కీరవాణి
నిర్మాణ సంస్థ వి.ఎమ్.సి. పిక్చర్స్
భాష తెలుగు

ఇది 1991లో విడుదలైన తెలుగు సినిమా.

చిత్రకథ[మార్చు]

తూర్పు గోదావరి జిల్లా లోని ఒకానొక పల్లెటూళ్ళొ సీతారామయ్య అనే మోతుబరి ఉంటాడు. ఆయన ఇంట్లో పెళ్ళి జరుగుతున్నపుడు ఒక అమ్మాయి ఆ పెళ్ళికి వస్తుంది. చాలా ఏళ్ళ క్రితం ఇండియా వదిలివెళ్ళిపోయిన సీతారామయ్య కొడుకు కుమార్తె ఆ అమ్మాయి. తండ్రీకొడుకుల మధ్య వచ్చిన అభిప్రాయ భేదం వల్ల తండ్రి కొడుకుతో మాట్లాడటం మానివేయడంతో అతడు అమెరికా వెళ్ళిపోతాడు. చదువుకొనే రొజుల్లో కూడా తండ్రి సాంగత్యాన్నివదులుకోలేని కొడుకు రావాలని అనుకొంటూ తండ్రి పిలవని కారణంగా రాడు. ఐనా మనవరాలు పెళ్ళి కి వచ్చి , తన తల్లి తండ్రులు పని వత్తిడి వల్ల రాలేక పోయారని చెప్తుంది. మనవరాలి పేరు సీత అని తన పేరే పెట్టీనందుకు తాత పరోక్షంలో మురిసిపోతాడు. తన ఎదురుగా పెరిగే వారు అలవరచుకోని సంగీత సంప్రదాయాలు మనవరాలిలో చూసి గర్విస్తాడు. వచ్చిన మనవరాలు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పెంపొందిస్తూ విడిపోయిన చిన్నత్త తాతయ్యల కుటుంభాలను కలుపుతుంది. ఆమెను విడిచి సీతారామయ్య గడపలేను అనుకొనే సమయంలో ఆయన భార్య మరణిస్తుంది. అప్పుడు కూడా రాని కొడుకు మీద కోపంతో మనవరాలిని కూడా వెళ్ళిపొమ్మంటాడు. ఆమె వెళ్ళాక కొడుకు కోడలు అంతకు మునుపే మరణించారని తమ కోసమే ఆమె కొడుకు బ్రతికున్నట్టు నాటకం ఆడిందని తెలిసి ఆమెను వెనుకకు పిలవడంతో కథ సుఖాంతం అవుతుంది.


చిత్ర విశేషాలు[మార్చు]

  • ఎ.ఎన్నార్ చిత్రం ఆద్యంతం విగ్గు లేకుండా పంచె కట్టు తో సహజంగా కనిపిస్తారు
  • సీతారామయ్య స్నేహితునిగా దాసరి నారాయణరావు గోదావరి యాస తో మాట్లాడే పెద్దమనిషిగా నటించారు

పాటలు[మార్చు]

  1. కలికి చిలకల కొలికి
  2. పూచింది పూచింది పున్నాగా, కూసింత నవ్వింది నీలాగ
  3. భద్రాద్రి రామయ్యా పాదాలు కడగంగా పరవళ్ళూ -సమయానికి తగిన