సీలియో*

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సీలియో*
తరహా
స్థాపన 1985
ప్రధానకేంద్రము ఫ్రాన్స్
కీలక వ్యక్తులు క్రిస్టియన్ పైమోంట్ (CEO), మార్క్ మరియు లారెంట్ గ్రాస్ మన్(వ్యవస్థాపకులు)
పరిశ్రమ రిటెయిల్
ఉత్పత్తులు వస్త్రాలు
రెవిన్యూ 500 మిలియన్ యూరోలు
ఉద్యోగులు 1800
వెబ్ సైటు www.celio.com
ప్యారిస్ లోని సీలియో ఫ్లాగ్ షిప్ స్టోరు
బెల్జియం లో సీలియో

సీలియో* అనునది అంతర్జాతీయ ప్రమాణాలతో వస్త్రాలను రూపొందించే ఒక రిటైలర్. ఇది ఫ్రాన్స్ లోని సెయింట్-ఓయువెన్ లో ప్రారంభించబడినది.

ప్రాథమికంగా ఐరోపా ఖండానికి సరసమైన ధరలకే ఆధునిక వస్త్రాలను రూపొందిస్తుంది. సీలియో స్టోరులు ఫ్రాన్స్ లోని షాపింగ్ మాల్ లలోను, షాపింగ్ డిస్ట్రిక్ట్ లలోను కనిపిస్తుంటాయి. 2005 లో ఈ సంస్థ 1,800 ఉద్యోగులను నియమించుకోగా, 1,500 స్టోరులలోను, మిగతావారు వేర్ హౌవుస్ లలోను పని చేస్తున్నారు.

చరిత్ర[మార్చు]

1978 లో మార్క్ మరియు లారెంట్ గ్రాస్ మన్ సోదర ద్వయం సెయింట్ లాజారె లో ఉన్న వారి దుకాణం లో పనిని ప్రారంభించారు. 1980 నాటికి దానిని ఇతర ప్రదేశాలకు విస్తరించారు. 1985 నాటికి గానీ సిసలైన సీలియో రూపం దాల్చలేదు. 1989 నాటికి ఫ్రాన్సు లోని 34 చోట్ల స్థాపించబడినది. 1992 కు ఇది 150కి చేరినది. తర్వాత బెల్జియం, స్పెయిన్, 1994లో పోర్చుగల్, 1999లో ఇటలీ లో స్థాపించారు.

భారతదేశంలో సీలియో[మార్చు]

భారతదేశం లో సీలియో జాయింట్ వెంచర్ ఉత్పత్తిగా ఫ్యూచర్ గ్రూప్ కి చెందిన ప్యాంటలూన్ రిటెయిల్ ఇండియా లిమిటెడ్ చే రూపొందించబడుతున్నది. ట్రౌజర్లు, షర్టులు, స్వెటర్ లు, టీ-షర్టులు, పోలో షర్టులు, సూట్లు, జాకెట్లు, బెల్టులు, టైలు మరియు బాక్సర్ షార్టులు అందిస్తుంది.

సీలియో పంచసూత్రాలు[మార్చు]

  • మగతనం
  • ఆకర్షణీయం
  • పారదర్శకత
  • విలువలు
  • సేవ

నిర్దేశిత వినియోగదారులు[మార్చు]

పట్టణంలో నివసించే ముప్పై ఏళ్ళ ఉద్యోగి. ఫ్యాషన్ ని గుడ్డిగా అనుసరించకుండా, విచక్షణతో మంచి దుస్తులను వేసుకోవాలనుకొనేవారు, దుస్తులు సౌకర్యంగానూ, చూడటానికి ఆకర్షణీయంగా కనిపించాలనుకొనేవారు.

మూలాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=సీలియో*&oldid=1219265" నుండి వెలికితీశారు