సెగవ్యాధి

వికీపీడియా నుండి

సెగవ్యాధి
వర్గీకరణ & బయటి వనరులు
ICD-10 A54
ICD-9 098
MeSH D006069

సెగవ్యాధి (Gonorrhea లేదా gonorrhoea) ఒక విధమైన అంటు వ్యాధి. ఇది నిసీరియా గొనోరియా (Neisseria gonorrhoeae) అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ఒక సామాన్యమైన సుఖ వ్యాధి (sexually transmitted infection). అమెరికాలో దీనిది క్లమీడియా తర్వాత రెండవ స్థానం.[1],[2]

స్త్రీ పురుష జననేంద్రియ అవయవాలే కాకుండా పురీషనాళం, గొంతు, కన్ను మొదలైన అవయవాలకు కూడా ఇది సోకవచ్చును. స్త్రీలలో ఇది గర్భాశయ గ్రీవం మొదట చేరుతుంది. అక్కడ నుండి రతి క్రీడ ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. ప్రసవ కాలంలో తల్లినుండి పుట్టబోయే పిల్లలకు ఇది వ్యాపించవచ్చును. పిల్లలలో కంటి పొరకు సోకి సరైన సమయంలో వైద్యం చేయని పక్షంలో అంధత్వం సంక్రమించవచ్చును. ఈ వ్యాధి నిరోధన లక్ష్యంతోనే చాలా దేశాలలో పుట్టిన బిడ్డలకు ఎరిత్రోమైసిన్ (erythromycin) లేదా సిల్వర్ నైట్రేట్ (silver nitrate) కంటి చుక్కలు వేస్తారు. [3]

[మార్చు] మూలాలు

  1. CDC - STD Surveillance - Gonorrhea. తీసుకొన్న తేదీ: 2008-08-21.
  2. CDC Fact Sheet - Chlamydia. తీసుకొన్న తేదీ: 2008-08-21.
  3. Erythromycin ointment for ocular prophylaxis of neonatal chlamydial infection. తీసుకొన్న తేదీ: 2008-07-14.
పేజీకి సంభందించిన లింకులు