1979 గోదావరి పుష్కరాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1979 సంవత్సరంలో గోదావరి నది సంబంధించిన పుష్కరము యొక్క విశేషాలు :

1979 ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 9 వరకూ జరిగాయి.[1]

పుష్కరాల నిర్వాహక కమిటీ

[మార్చు]

తి.తి.దే. సేవలు

[మార్చు]

తిరుమల తిరుపతి దేవస్థానములు మొదటిసారిగా ఈ పుష్కరాలలో తమ ధార్మిక సేవలను డా. రావుల సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో అందించింది. అప్పటి ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు అప్పటి ఇ.ఒ. శ్రీ పి.వి.ఆర్.కె ప్రసాద్ కార్యక్రమ ప్రణాలికను చిత్రించారు.

అయితే గోదావరి నది పుష్కరాల్లో తితిదే భాగస్వాయ్యమవడం అదే మొదటిసారి కాబట్టి ఏదైనా కొత్తగా చేద్దామని పి.వి.ఆర్.కె. ప్రసాద్ సూచించడంతో.. మూడు ప్రత్యేకతలతో పుష్కరాలలో యాత్రికులకు, భక్తులకు భక్తితత్వాన్ని అందించడానికి టి.టి.డి. శ్రీకారం చుట్టింది. 1. స్వామి, 2. ధార్మిక కార్యక్రమాలు, 3. ఆధ్యాత్మిక గ్రాథాల పంపిణి. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని పూర్తి ప్రణాళికతో, మంచి టీంతో రాజమండ్రికి వచ్చారు. మొత్త అన్ని విభాగాలను సమన్వయపరిచే బాధ్యత సూర్యనారాయణమూర్తి గారు తీసుకున్నారు.

సుబ్రహ్మణ్య మైదానంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతిష్ఠించారు. అర్చకులని, సిబ్బందినీ తీసుకువచ్చారు. ఈ మైదానం అంతా పెండాల్స్ నిర్మించి ధార్మిక కార్యక్రమాలను ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు హరికథలు, పురాణ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వంటివి ఏర్పాటుచేశారు. వీటన్నింటికి ప్రజలనుండి మంచి స్పందన వచ్చింది.

ధార్మిక సాహిత్యానికి ప్రజాదరణ లేదనే అభిప్రాయం ఉండేది. కాబట్టి ఆ సాహిత్యాన్ని నామమాత్రపు ధరకే అందించాలన్నది చెన్నారెడ్డిగారు చెప్పి, ఆ బాధ్యతను టి.టి.డి.కి అప్పగించారు. ఒక్కో పుస్తకం 10వేల కాపీలను ముద్రించి పుష్కరాలకు తీసుకువచ్చి సుబ్రహ్మణ్య మైదానంలోనే గ్రంథ విక్రయశాలను ప్రారంభించారు. నామమాత్రపు ధర 20 పైసల నుండి 50 పైసలుగా నిర్ణయించారు.

జనం చాలామంది వచ్చి పుస్తకాలు కొనుక్కొని వెళ్లారు. కళాకేంద్రం ప్రారంభించడానికి వచ్చిన చెన్నరెడ్డిగారు అక్కడి ఏర్పాట్లను పరిశీలిస్తూ పుస్తకాల షాపు దగ్గరికి వచ్చి అక్కడ జనసంద్రాన్ని చూసి చాలా ఆనందించి, అక్కడి నిర్వాహకుల్ని అభినందించారు. ఆవిధంగా తెచ్చిన స్టాక్ మొదటి మూడు నాలుగు రోజుల్లోనే అయిపోవడంతో మళ్లీ కొన్ని పుస్తకాలు ప్రింట్ చేయించి పంపించారు. అలా పుష్కరాల 12 రోజులూ పుస్తకాలను విక్రయించారు.

ఆ స్ఫూర్తితోనే టి.టి.డి. ఆధ్యాత్మిక గ్రంథాలని అచ్చవేయడమన్నది ఉద్యమస్థాయిలో ప్రారంభించి నిరాటంకంగా కొనసాగుతున్నది. ఆ తరువాత వివిధ స్థాయిల్లో, పలు ప్రమాణాలతో అత్యుత్తమ స్థాయి గ్రంథాల ప్రచురణ, పలు గ్రంథాలకు ఆర్థికసాయం అందించడమన్నది టి.టి.డి. స్వీకరించింది. ఈ గ్రంథాల ప్రచురణకు స్ఫూర్తి గోదావరి పుష్కరాలేనని చెప్పవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. "కృష్ణా పుష్కరాలు". Archived from the original on 2020-10-27. Retrieved 2021-02-14.
  • గత పుష్కరాలలో తి.తి.దే. ధార్మిక సేవ - డా. రావుల సూర్యనారాయణ మూర్తి, మాతల్లి గోదావరి, సప్తగిరి పుష్కర ప్రత్యేక సంచిక, 2003, పేజీలు: 84-5.