2023 నోబెల్ శాంతి బహుమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2023 నోబెల్ శాంతి బహుమతి
నర్గెస్ మొహమ్మది
Date
  • 2023 అక్టోబరు 6
    (ప్రకటన)
  • 2023 డిసెంబరు 10
    (వేడుక)
Locationఓస్లో, నార్వే
అందజేసినవారునార్వేజియన్ నోబెల్ కమిటీ
Reward(s)9.0 మిలియన్ స్వీడిష్ క్రోనా
మొదటి బహుమతి1901
వెబ్‌సైట్https://www.nobelprize.org

2023 నోబెల్ శాంతి బహుమతి అనేది 2023 సంవత్సరానికిగాను ప్రపంచవ్యాప్తంగా శాంతి, సాహిత్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థికశాస్త్రం, ఔషధరంగం.. ఈ ఆరు రంగాలలో ఎవరైతే వారి కృషితో మానవజాతికి ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తారో వారికి నార్వేజియన్ నోబెల్ కమిటీ అవార్డులను ప్రదానం చేస్తుంది. డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇచ్చే ఆరు అవార్డులలో నోబెల్ శాంతి బహుమతి ఒకటి. ప్రతి సంవత్సరం ఇతర నోబెల్ బహుమతులు స్వీడన్ లో ఇవ్వబడుతుండగా, నోబెల్ శాంతి బహుమతి నార్వేలో ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ బహుమతులు ప్రారంభించినప్పుడు నార్వే, స్వీడన్ ఒక దేశంగా ఉన్నాయి.[1]

2023 నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ కార్యకర్త నర్గెస్ మొహమ్మదిని వరించింది. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం, మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛను పెంపొందించడానికి ఆమె చేసిన పోరాటానికి నోబెల్ శాంతి బహుమతి అందించబడింది.[2] 2003లో షిరీన్ ఇబాదీ గెలిచిన తర్వాత ఇరాన్ నుండి నోబెల్ బహుమతి గ్రహీత ఆమె రెండవది. అయితే బహుమతి ప్రకటించినప్పటికి, ఆమె ఇరాన్‌లోని జైలులో ఉంది.[1] మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తున్న జర్నలిస్ట్ అయిన ఆమె 13 సార్లు అరెస్టయింది. ఆమెకు 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు ఇరాన్‌ ప్రభుత్వం విధించింది.

అభ్యర్థులు[మార్చు]

ఫిబ్రవరి 22న, నార్వేజియన్ నోబెల్ కమిటీ 2023 నోబెల్ శాంతి బహుమతి కోసం మొత్తం 305 మంది అధికారిక అభ్యర్థులను స్వీకరించినట్లు వెల్లడించింది, వారిలో 212 మంది వ్యక్తులు కాగా, 93 సంస్థలు ఉన్నాయి. అయితే 2022 సంవత్సరం 343 మంది అభ్యర్థులతో పోలిస్తే ఈ సంవత్సరం సంఖ్య తక్కువగా ఉంది. 2019తో కాని పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. అభ్యర్థుల అత్యధిక రికార్డు 2016లో ఉంది.[3][4] నామినేషన్లు రహస్యంగా ఉంచబడినప్పటికీ, పలువురు నార్వేజియన్ పార్లమెంటేరియన్లు, ఇతర విద్యావేత్తలు తమ అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించడం విశేషం. ఇదంతా నామినీ, నామినేటర్ లను పెంచడానికి ప్రచారవ్యూహం.[4]

నామినేటర్లు[మార్చు]

నోబెల్ ఫౌండేషన్ నియమాల ప్రకారం, కింది వర్గాలలో ఒకదానిలో ఒక వ్యక్తి, వ్యక్తుల సమూహం ద్వారా నామినేషన్ సమర్పించబడితే అది చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది:[5]

  1. సార్వభౌమాధికారం గల రాష్ట్రాల జాతీయ అసెంబ్లీలు, జాతీయ ప్రభుత్వాల సభ్యులు (క్యాబినెట్ సభ్యులు/మంత్రులు) అలాగే ప్రస్తుత రాష్ట్రాల అధినేతలు
  2. హేగ్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ది పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సభ్యులు
  3. ఇన్‌స్టిట్యూట్ డి డ్రాయిట్ ఇంటర్నేషనల్ సభ్యులు
  4. శాంతి, స్వేచ్ఛ కోసం మహిళల అంతర్జాతీయ లీగ్ అంతర్జాతీయ బోర్డు సభ్యులు
  5. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఎమెరిటీ, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, చట్టం, తత్వశాస్త్రం, వేదాంతశాస్త్రం, మతం అసోసియేట్ ప్రొఫెసర్లు, విశ్వవిద్యాలయ రెక్టార్లు, విశ్వవిద్యాలయ డైరెక్టర్లు
  6. శాంతి పరిశోధనా సంస్థలు, విదేశాంగ విధాన సంస్థల డైరెక్టర్లు
  7. నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తులు
  8. నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రధాన డైరెక్టర్ల బోర్డు, దాని సమానమైన సంస్థల సభ్యులు
  9. నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రస్తుత, మాజీ సభ్యులు
  10. నార్వేజియన్ నోబెల్ కమిటీకి మాజీ సలహాదారులు

కమిటీ[మార్చు]

ఆల్ఫ్రెడ్ నోబెల్ సంకల్పానికి అనుగుణంగా నోబెల్ గ్రహీతల ఎంపికకు నార్వేజియన్ నోబెల్ కమిటీలోని క్రింది సభ్యులు బాధ్యత వహిస్తారు:

  1. బెరిట్ రీస్-ఆండర్సన్ - న్యాయవాది, నార్వేజియన్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, న్యాయ మంత్రి, పోలీసు మాజీ రాష్ట్ర కార్యదర్శి, 2012 నుండి నార్వేజియన్ నోబెల్ కమిటీ సభ్యుడు, 2018–2023 కాలానికి తిరిగి నియమించబడ్డాడు.
  2. అస్లే టోజే - విదేశాంగ విధాన పండితుడు. 2018–2023 కాలానికి నియమించబడ్డారు.
  3. అన్నే ఎంగర్ - సెంటర్ పార్టీ మాజీ నాయకుడు, సాంస్కృతిక మంత్రి. 2018 నుండి సభ్యుడు, 2021–2026 కాలానికి తిరిగి నియమించబడ్డాడు.
  4. క్రిస్టిన్ క్లెమెట్ - మాజీ ప్రభుత్వ పరిపాలన, కార్మిక మంత్రి; విద్య, పరిశోధన మంత్రి. 2021–2026 కాలానికి నియమించబడ్డాడు.
  5. జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ - మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, నార్వే మాజీ బోర్డు సభ్యుడు, నార్వేజియన్ హెల్సింకి కమిటీ బోర్డు సభ్యుడు. 2021–2026 కాలానికి నియమించబడ్డాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Nobel Peace Prize", The Oxford Dictionary of Twentieth Century World History
  2. The Nobel Peace Prize 2023 nobelprize.org
  3. Nominations for the 2023 Nobel Peace Prize nobelprize.org
  4. 4.0 4.1 "Committee says 305 nominated for the 2023 Nobel Peace Prize". AP News. 22 February 2023. Retrieved 10 March 2023.
  5. Nomination and selection of Nobel Peace Prize laureates nobelprize.org