44వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
44వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on30 నవంబరు 2013
Hosted byటిస్కా చోప్రా
గుల్షన్ దేవయ్య
Highlights
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రంబీట్రిజ్ వార్
Lifetime achievementజిరి మంజిల్

44వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2013 నవంబరు 20 నుండి నవంబరు 30 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1][2][3][4]

2013, నవంబర్ 20న గోవాలోని పనాజీలో 44 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభోత్సవానికి సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జ్) శ్రీ మనీష్ తివారీ జ్యోతి ప్రజ్వలన చేశాడు. గోవా ముఖ్యమంత్రి, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోహర్ పారికర్, శ్రీ బిమల్ జుల్కా, నటుడు కమల్ హాసన్, నటి వహీదా రెహమాన్, అమెరికన్ నటి శ్రీమతి సుసాన్ సరన్డాన్ ఉన్నారు

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]

విజేతలు[మార్చు]

  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: లుయిగి అక్విస్టో, బెట్టీ రీస్ దర్శకత్వం వహించిన బీట్రిజ్ వార్
  • ఉత్తమ దర్శకుడు: కౌశిక్ గంగూలీ - అపుర్ పంచాలి సినిమా
  • ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటుడు అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "ఎ ప్లేస్ ఇన్ హెవెన్ " సినిమాలో నటించిన అలోన్ అబుత్బుల్
  • ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: ఇన్ హైడింగ్ సినిమాలో నటించిన మాగ్డలీనా బోజార్ స్కా

ప్రత్యేక అవార్డులు[మార్చు]

  • జీవన సాఫల్య పురస్కారం: జిరి మంజిల్
  • స్పెషల్ జ్యూరీ అవార్డు: ఓనూర్ ఒంకు తీసిన గిల్ట్ ది ఈవ్
  • శతాబ్ది పురస్కారం: కమలేశ్వర్ ముఖర్జీ - మేఘే ధాకా తార (సినిమా)
  • స్పెషల్ మెన్షన్: రోహిత్ శెట్టి
  • ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: వహీదా రెహమాన్

మూలాలు[మార్చు]

  1. "'Beatriz's War' wins Golden Peacock at 44th International film festival of India - Times of India".
  2. "IFFI 2013 Winners - The Golden Peacock award goes to BEATRIZ's WAR." iffigoablog.blogspot.in.
  3. http://employmentnews.gov.in/IFFI.pdf
  4. http://pib.nic.in/newsite/feacontent.aspx?relid=100683
  5. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  6. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  7. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.

బయటి లింకులు[మార్చు]