Jump to content

సయ్యద్ అబ్దుల్ రహీమ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
"Syed Abdul Rahim" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

15:19, 22 అక్టోబరు 2021 నాటి కూర్పు

సయ్యద్ అబ్దుల్ రహీమ్ (17 ఆగస్టు 1909 – 11 జూన్ 1963) తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ ఫుట్‌బాల్ కోచ్, ఆటగాడు. 1950 నుండి 1963లో మరణించే వరకు భారత జాతీయ జట్టు మేనేజర్ గా వ్యవహరించాడు.[1][2] రహీమ్ సాబ్ అని పిలువబడిన రహీమ్ ఆధునిక భారతీయ ఫుట్‌బాల్ రూపశిల్పిగా పరిగణించబడ్డాడు.[3] వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రహీమ్[4][5] కోచ్‌గా పనిచేసినంతకాలం భారతదేశంలో ఫుట్‌బాల్ "స్వర్ణయుగం" గా పరిగణించబడుతోంది.[6] భారత ఫుట్‌బాల్ జట్టుకు నాయకత్వం వహించిన రహీమ్ ఆసియా క్రీడలలో బంగారు పతకాలు (1951-ఢిల్లీ, 1962-జకార్తా), సమ్మర్ ఒలింపిక్స్‌లో సెమీ-ఫైనల్స్ ( 1956-మెల్‌బోర్న్) సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.[7][8]

జననం

రహీమ్ 1909, ఆగస్టు 17న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించారు.[9]

క్రీడారంగం

తొలిరోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు.[10][11] కాలేజీలో ప్రస్తుత-పూర్వ విద్యార్థులతో రూపొందించబడిన "ఎలెవన్ హంటర్స్" జట్టు కోసం కూడా ఆడాడు.[12]

ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన తరువాత, రహీమ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేయడానికి తన పూర్వ కళాశాలకు వచ్చాడు. కాచిగూడ మిడిల్ స్కూల్, ఉర్దూ షరీఫ్ స్కూల్, దారుల్-ఉల్-ఉలూమ్ హై స్కూల్, చాదర్‌ఘాట్ హైస్కూల్‌లలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.[12] ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తిచేసి, టీచర్‌గా పనిచేసిన చివరి రెండు స్కూల్స్‌లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాధ్యతలు తీసుకున్నాడు.[12]

కొంతకాలం రహీమ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా స్థానిక లీగ్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటైన ఖమర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[13] మేనేజర్ అవ్వడానికిముందు డచ్ క్లబ్ కోసం కూడా ఆడాడు.[14]

వ్యక్తిగత జీవితం

రహీమ్ కుమారుడు, సయ్యద్ షాహిద్ హకీం మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు. ఇతడు 1960 సమ్మర్ ఒలింపిక్స్ టోర్నమెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[15]

మరణం

క్యాన్సర్ కారణంగా ఆరు నెలలపాటు మంచం మీద పడుకున్న రహీమ్ 1963, జూన్ 11న మరణించాడు.[16][12]

వారసత్వం

భారత మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ఫార్చ్యూనాటో ఫ్రాంకో "రహీమ్ సాబ్" గురించి ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించాడు;

అతనితో అతను భారత ఫుట్‌బాల్‌ను సమాధికి తీసుకెళ్లాడు.[17]

ప్రముఖ సంస్కృతిలో

రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మైదాన్ అనే సినిమా సినిమా 2022 జూన్ 15న విడుదలకానుంది. ఇందులో అజయ్ దేవగన్ మూడు ప్రధాన పాత్రల్లో నటించాడు.[18]

మూలాలు

 

  1. "History in Timeline of Indian Football". All India Football Federation. Archived from the original on 8 March 2020. Retrieved 2021-02-15.
  2. "Syed Abdul Rahim | The Architect of Modern Indian Football". Chase Your Sport (in ఇంగ్లీష్). Archived from the original on 3 July 2021. Retrieved 2021-02-14.
  3. "Forgotten on birth centenary - Legendary coach rahim - SAAB yet to get the honour and respect he deserves". www.telegraphindia.com. Archived from the original on 3 July 2021. Retrieved 2021-02-14.
  4. Basu, Jaydeep. "In unbearable pain but with football on his mind: The last nine months of Syed Abdul Rahim's life". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 8 January 2021. Retrieved 2021-02-14.
  5. "Who is Syed Abdul Rahim? Know about the Indian football coach set to be played by Ajay Devgn". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-13. Archived from the original on 3 July 2021. Retrieved 2021-02-14.
  6. Venkatesan, Sudarshan (2019-01-06). "The Golden Age of Indian Football under Syed Abdul Rahim". The SportsRush (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 11 June 2021. Retrieved 2021-02-14.
  7. "Home Sport Remembering 'the best football coach India'". New Indian Express. 18 August 2009. Retrieved 19 September 2021.
  8. Coutinho, Austin (9 February 2019). "Syed Abdul Rahim: Remembering Indian football's hero as Ajay Devgn-starrer pays homage to legendary coach". FirstPost. Retrieved 19 September 2021.
  9. Sharma, Ayushi. "'Maidan' has the Story of Syed Abdul Rahim who Battled Cancer & Won Gold" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 3 July 2021. Retrieved 2021-02-14.
  10. "Architect Of Modern Indian Football | Syed Abdul Rahim | Maidaan Movie". The Real Gems (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-03-04. Archived from the original on 3 July 2021. Retrieved 2021-02-15.
  11. "Remembering Rahim Saab, the man who put India on the world football map". CatchNews.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2018. Retrieved 2021-02-14.
  12. 12.0 12.1 12.2 12.3 N. Ganesan, "Loss to Indian Soccer", Sport & Pastime, p.14, 27 July 1963.
  13. "Syed Abdul Rahim: The architect of Indian football's "Golden age"". The Football Pink (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-11-23. Archived from the original on 16 January 2021. Retrieved 2021-02-15.
  14. "Hyderabad FC - reigniting the footballing spark in the City of Nizams". Indian Super League (in ఇంగ్లీష్). Archived from the original on 27 April 2021. Retrieved 2021-02-15.
  15. "Hakim's tribute to his father". Sportskeeda. 6 March 2013. Archived from the original on 20 March 2021. Retrieved 2021-02-15.
  16. Shukla, Kaushal. "Indian Football: Visionary coach and master tactician, Syed Abdul Rahim's genius stands test of time". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 9 January 2021. Retrieved 2021-02-15.
  17. Banerjee, P.K; Chatterjee, Anirban (2019). BEYOND 90 MINUTES: An Autobiography. Notion Press. p. 106. ISBN 9781684662623. Retrieved 16 September 2021.
  18. "First look of Syed Abdul Rahim's biopic "Maidaan" released". The Bridge (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-01-30. Archived from the original on 10 April 2021. Retrieved 2022-06-03.