అంగానా రాయ్
అంగనా రాయ్ | |
---|---|
వృత్తి | నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 2013-ప్రస్తుతం |
అంగనా రాయ్, ప్రధానంగా తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటిస్తున్న భారతీయ నటి. ఆమె తెలుగులో శ్రీమంతుడు (2015), తమిళంలో కళగ తలైవన్ (2022) లలో నటించింది.
కెరీర్
[మార్చు]అంగానా రాయ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటి. ఆమె కామర్స్, ఫైనాన్స్ లలో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసింది. ఆమె ఫార్చ్యూన్ 500 సంస్థలో కార్పొరేట్ హెచ్ఆర్ గా పనిచేసింది. ఆమె విద్యతో పాటు శాస్త్రీయ హిందూస్థానీ సంగీతంలో కూడా శిక్షణ పొందింది. ఆమె క్రీడా ఔత్సాహికురాలు, అలాగే మోడల్ కూడా అయిన ఆమె దేశం అంతటా అనేక బ్రాండ్లకు పనిచేసింది, పలు ప్రదర్శనల ర్యాంప్ లలో మెరిసింది. ఆ తరువాత, కరుణాస్ నటించిన హాస్య చిత్రం రాగలైపురం లో నటించింది, దీనికి దర్శకుడు మనోహర్. [1][2][3]
2014లో ఆమె కబదం లో డ్యూయల్ షేడ్స్ తో ఒక పాత్రను పోషించింది. మేఘలో నర్సుగా ఆమె కనిపించింది.[4] ఆమె తొలి మలయాళ చిత్రం పికెట్ 43 కాగా, తమిళ చిత్రం మహాబలిపురం.[4]
ఇక తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంలో ఆమె నటించింది. ఆ తరువాత ఆమె నటించిన బాహుబలి చిత్రం కూడా భారీ హిట్ అయింది. 2016లో ఆమె తెలుగులో నటించిన మరో రెండు చిత్రాలు విడుదలయ్యాయి, శ్రీ శ్రీలో కృష్ణ కుమార్తెగా, ఇది రాష్ట్ర అవార్డు పొందిన మరాఠీ చిత్రం అధికారిక రీమేక్. ముంబైలో 'భారత్ ఐకాన్ అవార్డ్స్ 2016', కర్ణాటక ప్రభుత్వంచే మహిళా అచీవర్స్ స్టేట్ అవార్డులను ఆమె అందుకుంది.
ఆమె కలర్స్ తమిళ టెలివిజన్లో ప్రైమ్ టైమ్ స్లాట్లో ఒక మెగా సిరీస్, విజయ్ టీవీ మొదటి ఫాంటసీ సిరీస్ అయిన స్టార్ విజయ్ టెలివిజన్ లో మరో ప్రాజెక్ట్ లో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషించింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనిక |
---|---|---|---|---|
2013 | వాతికుచి | తమిళ భాష | తెలుగులో గోలీసోడ గా విడుదలైంది | |
రాజపురం | కల్యాణి | తమిళ భాష | ||
2014 | కబడం | పద్మిని | తమిళ భాష | |
మేఘా | తులసి | తమిళ భాష | ||
2015 | పికెట్ 43 | హనారా | మలయాళం | |
మహాబలిపురం | సంగీత | తమిళ భాష | ||
శ్రీమంతుడు | హర్ష బంధువు | తెలుగు | ||
2016 | మణితన్ | ప్రియా సోదరి | తమిళ భాష | |
శ్రీ శ్రీ | తెలుగు | |||
ఛల్ ఛల్ గుర్రం | తెలుగు | |||
2017 | 7 నాట్కల్ | జెన్నిఫర్ | తమిళ భాష | |
కడైసీ బెంచ్ కార్తి | దివ్య | తమిళ భాష | ||
2018 | హూ? | నీనా | మలయాళం | |
2022 | కళగ తలైవన్ | రెబా | తమిళ భాష |
టీవీ సిరీస్
[మార్చు]సంవత్సరం | ధారావాహిక | పాత్ర | భాష | ఛానల్ |
---|---|---|---|---|
2018 | గ్రామతిల్ ఒరు నాల్ | పోటీదారు | తమిళ భాష | సన్ టీవీ |
2019 | థారి | నక్షత్ర | తమిళ భాష | కలర్స్ తమిళ్ |
2019 | తాజంపూ | వాసుకి | తమిళ భాష | స్టార్ విజయ్ |
మూలాలు
[మార్చు]- ↑ Manigandan, K. R. (16 June 2012). "Dream debut". The Hindu. Retrieved 7 October 2017.
- ↑ "Sachin and Angana Roy pair up for Kabadam". Deccan Chronicle. 11 August 2014. Retrieved 7 October 2017.
- ↑ "Angana Roy replaces Shona in Cobra?". The Times of India. 5 February 2014. Retrieved 7 October 2017.
- ↑ 4.0 4.1 "Angana Walks the Road to Success". The New Indian Express. Archived from the original on 2 October 2014. Retrieved 7 October 2017.