వేలు
వేలు | |
---|---|
వివరములు | |
లాటిన్ | డిజిటి మానస్ |
Identifiers | |
MeSH | A01.378.800.667.430 |
TA | A01.1.00.030 |
FMA | 9666 |
Anatomical terminology |
వేలు, వ్రేలు లేదా అంగుళి అనగా జంతువుల చేతికి లేదా కాలికి ఉండే చిన్న శరీరభాగాలు. చేతిని ఉన్న వేళ్ళను చేతివేలు అని కాలికి ఉన్న వేళ్ళను కాలివేలు అంటారు. మానవులకు 10 చేతివేళ్ళు, 10 కాలివేళ్ళు ఉంటాయి. మనం చేయితో చేయు చాలా సున్నితమైన పనులకు వేలు కీలకమైనది. అన్ని వేళ్ళకు చివరిభాగంలో గోర్లు ఉంటాయి. కొంతమంది వేలికి ఆభరణంగా ఉంగరం ధరిస్తారు.
చేతివేళ్లు
[మార్చు]- బొటన వేలు: బొటన వేలు చేతిలో మొదటి వేలు.
- చూపుడు వేలు: చూపుడు వేలు చేతి వేళ్ళలో రెండవ వేలు.
- మధ్య వేలు: మధ్య వేలు మూడవ వేలు.
- ఉంగరపు వేలు: మనిషి చేతి వేళ్ళలో నాలుగవది. దీనిని అనామిక లేదా పవిత్రపు వేలు అని కూడా అంటారు.
- చిటికెన వేలు: చిటికెన వేలు మనిషి చేతి వేళ్ళలో ఐదవ వేలు.
రతిక్రీడలో అంగుళీ ప్రవేశము
[మార్చు]సంభోగారంభ దశయందు భార్యతో రతిక్రీడకి తగిన ఆవేశమును కలిగించుటకు మదనచ్ఛత్రమును చేతితో తాకవలెనని తెలిసినదే. అట్లు కేవలము వ్రేలితో మదనచ్ఛత్రమును తాకుటయేకాక పురుషుడు తన చేతివ్రేళ్ళను భార్యయొక్క యోని యందు ప్రవేశపెట్టుట కూడ జరుగుతుంది. దానికి అంగుళీ ప్రవేశమని పేరు. అది యీ దిగువ వివరింపబడుతోంది -
ఈ అంగుళీ ప్రవేశ విధానములు మొత్తం ఆరు.[1]
- 1. కరణము:- భర్త భార్యయొక్క యోనియందు తన చూపుడు వ్రేలిని ప్రవేశపెట్టినచో దానికి ' కరణము ' అనిపేరు.
- 2. కనకము:- భర్త తన చూపుడువ్రేలిని తన నడిమి వ్రేలిమీద కెక్కించి భార్య యోనియందు ప్రవేశపెట్టినచో అది ' కనకము ' అనబడుతుంది.
- 3. వికనము:- కనకమునందువలెనే భార్యయొక్క యోనియందు ప్రవేశపెట్టిన వ్రేళ్ళను (చూపుడువ్రేలు, నడిమివ్రేలు) యోనియందేయుంచి మార్చుట (అనగా నడిమి వ్రేలిమీదనున్న చూపుడువ్రేలిని దిగువచేసి నడిమివ్రేలిని చూపుడువ్రేలిమీదకు ఎక్కించుట) మాటిమాటికి జరిగినచో అది ' వికనము ' అనబడుతుంది.
- 4. పతాక:- భార్య యోనియందు ప్రవేశపెట్టబడిన రెండు వ్రేళ్ళను ఒకదానికొకటి ఎడమగా విస్తరింపజేయుట ' పతాక ' అనబడుతుంది.
- 5. త్రిశూలము:- చూపుడువ్రేలు, నడిమివ్రేలు మాత్రమే కాక ఉంగరపువ్రేలిని కూడా భార్య యోనియందు ప్రవేశపెట్టి వానిని యోనియందే ఒకదానికొకటి ఎడము కావించినచో ఆస్థితి ' త్రిశూలము ' అనబడుతుంది.
- 6. శనిభోగము:- పైన చెప్పినవిధముగా భార్య యోనియందు ప్రవేశపెట్టిన మూడువ్రేళ్ళను ఎడముగాకాక దగ్గరగా చేర్చినచో ఆస్థితి ' శనిభోగము ' అనబడుతుంది.
ఈ అంగుళ ప్రవేశ విధానముల నారింటినికూడ పురుషుడు క్రమముగా ఉపయోగించాలి. ఇట్లు అంగుళ ప్రవేశము చేయుటవలన వనిత ఎట్టిదైనను రతికి అభిముఖ అవుతుంది. ఆమెయందు సంభోగము కొరకై ఒక పరమమైన విహ్వలత ఏర్పడుతుంది. ఈ అంగుళ ప్రవేశము వలన ఆమెయందు రతి కొరకైన విహ్వలత ఏర్పడుతుందేకాని తృప్తి ఏర్పడదు. స్త్రీకి తృప్తి పురుషాంగ సంయోగము చేతనే లభిస్తుంది. ఈ విషయం పురుషుడు గ్రహించాలి. కేవలం అంగుళీ రతంతో మాత్రమే ఆచరించేవాడు పురుషాధముడు. రతిక్రీడయందు మిక్కిలి ఉత్సుకతను కనబరచని స్త్రీల విషయమునందు మాత్రమే ఆవశ్యకత నెరిగి పురుషుడీ అంగుళీ ప్రవేశ విధానమును ఆచరించాలి.
మూలాలు
[మార్చు]- ↑ నాగర సర్వస్వం, పద్మశ్రీ, అభిసారిక ప్రచురణ, 1962, పేజీలు: 127-9.