Jump to content

మధ్య వేలు

వికీపీడియా నుండి
మధ్య వేలు
ఎడమచేతి మధ్య వేలు
వివరములు
లాటిన్డిజిటస్ III మానస్, డిజిటస్ మీడియస్ మానస్, డిజిటస్ తెర్షియస్ మానస్
అరచేతి లోని వేళ్ళ ధమనులు
అరచేతి వెనుకవైపు ఉన్న వేళ్ళ ధమనులు
అరచేతి లోని వేళ్ళ సిరలు
అరచేతి వెనుకవైపు ఉన్న వేళ్ళ సిరలు
Dorsal digital nerves of radial nerve, proper palmar digital nerves of median nerve
Identifiers
TAA01.1.00.055
FMA24947
Anatomical terminology

మధ్య వేలు, మనిషి చేతి చూపుడు వేలుకూ, ఉంగరపు వేలుకూ మధ్య ఉన్న వేలు. చేతివేళ్ళలో ఇది మూడవది, మధ్యది. సాధారణంగా వేళ్ళన్నిటి లోకీ ఇదే అత్యంత పొడవుగా ఉంటుంది. శరీర నిర్మాణ శాస్త్రంలో, దీనిని మూడవ వేలు, డిజిటస్ మెడియస్, డిజిటస్ టెర్టియస్ లేదా డిజిటస్ III అని కూడా పిలుస్తారు.

అవలోకనం

[మార్చు]

పాశ్చాత్య దేశాలలో, మధ్య వేలును (దాన్నొక్కదాన్నే గానీ, లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో చూపుడు వేలితో పాటుగా) ఒక అప్రియమైన, అశ్లీలమైన సంజ్ఞ. నిటారుగా ఉన్న పురుషాంగంతో దానికి ఉన్న సారూప్యత కారణంగా ఇలా మధ్యవేలును చూపించడాన్ని అవమానించడానికి గుర్తుగా భావిస్తారు.[1][2] అమెరికా, యుకెల్లో వ్యావహారికంలో దీనిని "ఫ్లిప్పింగ్ ఆఫ్",[3] అనీ, "వేలు ఇవ్వడం" అనీ అంటారు.

మధ్య వేలును, బొటనవేలుతో కలిపి చిటికెలు వేస్తారు.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "When did the middle finger become offensive?". BBC News. 6 February 2012.
  2. "The shock index: is giving the finger still offensive?". The Guardian. 22 February 2012.
  3. Jason Joseph, Rick Joseph (2007). 101 Ways to Flip the Bird. Broadway Books. ISBN 978-0-7679-2681-2.
  4. (November 2021). "The ultrafast snap of a finger is mediated by skin friction".
"https://te.wikipedia.org/w/index.php?title=మధ్య_వేలు&oldid=4318249" నుండి వెలికితీశారు