అంజనా భౌమిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంజనా భౌమిక్
జననం
ఆరతి భౌమిక్

(1944-12-30)1944 డిసెంబరు 30
కూచ్ బెహార్, ప్రిన్స్లీ స్టేట్, బ్రిటిష్ ఇండియా
మరణం2024 ఫిబ్రవరి 17(2024-02-17) (వయసు 79)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1960–1980
జీవిత భాగస్వామిఅనిల్ శర్మ
పిల్లలునీలాంజనా సేన్‌గుప్తా
చందన శర్మ
బంధువులుజిష్షూసేన్ గుప్తా (అల్లుడు)

అంజనా భౌమిక్ (1944 డిసెంబరు 30 - 2024 ఫిబ్రవరి 17) బెంగాలీ సినిమాల్లో భారతీయ నటి. తన 1960ల నుండి 1980ల వరకు కెరీర్ లో కహోనా మేఘ్‌, థానా థేకే అస్చీ, చౌరంగీ లాంటి క్లాసిక్‌ చిత్రాల్లో నటించి మంచి ప్రశంసల్ని అందుకుంది. అనుస్టూప్‌ ఛంద (1964) సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. 1965లో థానా థేకే అస్చీ చిత్రంతో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

2012లో సినిమా రంగానికి ఆమె చేసిన కృషికిగాను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అంజనా భౌమిక్ 1944 డిసెంబరు 30న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బెహార్‌లో జన్మించింది. ఆమె అసలు పేరు ఆరతి భౌమిక్, మారుపేరు బాబ్లీ. ఆమె తండ్రి బిభూతి భూషణ్ భౌమిక్. కూచ్ బెహార్‌లో ఆమె పాఠశాల రోజులు గడిపింది. భౌమిక్ 1961లో కూచ్ బెహర్‌లోని సునీతి అకాడమీ నుండి పశ్చిమ బెంగాల్ బోర్డ్ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత ఉన్నత చదువు కోసం కోల్‌కతా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆమె కలకత్తా విశ్వవిద్యాలయంలోని సరోజినీ నాయుడు కాలేజ్ ఫర్ ఉమెన్‌లో కూడా చదువుకుంది.

అంజనా నేవీ ఆఫీసర్ అనిల్ శర్మను పెళ్లి చేసుకుని ముంబైలో స్థిరపడింది. వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ఆమెకు ఇద్దిరు కుమార్తెలు నీలాంజనా శర్మ, చందనా శర్మ ఉన్నారు. వీరు కూడా నటీమణులే.[1] నీలాంజనా శర్మ బెంగాలీ సినిమా నటుడు జిష్షూసేన్ గుప్తాను వివాహం చేసుకుంది.[2][3]

ఆమె హిప్ హిప్ హుర్రే అనే భారతీయ టీన్ డ్రామా సిరీస్ లో చేసింది. ఇది 1998 ఆగస్టు 21 నుండి 2001 మే 25 వరకు జీ టీవిలో ప్రసారం చేయబడింది. దీనిని నుపుర్ ఆస్థాన దర్శకత్వం వహించింది.[4] అయితే, నీలాంజనా చాలా సంవత్సరాలుగా నటనకు దూరంగా ఉంది.

చందన శర్మ టెలివిజన్ నటి. దర్శకుడు రబీ కినాగి రూపొందించిన బెంగాలీ సినిమా ప్రేమి(2004)తో ఆమె తెరంగేట్రం చేసింది.[5] టెలివిజన్ నటిగా కెరీర్ కొనసాగిస్తున్న ఆమె షారుఖ్ ఖాన్‌తో ఎయిర్‌టెల్ యాడ్ ఫిల్మ్‌లోనూ నటించింది.[6]

కెరీర్

[మార్చు]

1964లో పిజూష్ బోస్ దర్శకత్వం వహించిన అనుస్తుప్ చందా చిత్రంలో ఆమె తన 20వ ఏట సినీరంగ ప్రవేశం చేసింది. సినిమా విడుదలకు ముందు ఆమె తన పేరును ఆరతి నుండి అంజనగా మార్చుకుంది. ఆమె మొదటి సినిమా విడుదలతోనే పాపులర్ అయింది. ఆమె నటనా ప్రతిభను ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసించారు. ఆమె ఉత్తమ్ కుమార్ ప్రధాన హీరోయిన్లలో ఒకరిగా మారింది. ఆమె, ఉత్తమ్ కుమార్ చౌరంగీ, కొఖోనో మేఘ్, నాయికా సంగ్‌బాద్, రౌద్ర ఛాయా, రాజ్ ద్రోహి వంటి పెద్ద హిట్‌లను అందించారు.[7] ఆమె కెరీర్‌లో ఒక నిర్దిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ హీరోగా నటించకపోతే ఆమె విజయం సాధించదని విమర్శకులు అంచనా వేసిన సమయంలో, ఆమె అత్యంత ప్రశంసలు పొందిన మహాశ్వేతలో సౌమిత్ర ఛటోపాధ్యాయతో జతకట్టింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా
1987 నిషిబసార్
1981 సుఖే థాకో
బందిని కమల
1979 భాగ్యలిపి
1973 రౌద్ర ఛాయా
1971 ప్రథమ బసంత
1970 డిబ్రత్రిర్ కబ్యా
1969 శుక్ సారి
1968 చౌరంగీ
1968 కహోనా మేఘ్‌
1967 మహాశ్వేతా
1967 నాయికా సంగ్బాద్
1966 గృహ సంధానే
1966 రాజద్రోహి
1965 థానా థేకే అస్చీ
1964 అనుస్తుప్ ఛంద

మరణం

[మార్చు]

అంజనా భౌమిక్ 79 ఏళ్ల వయసులో 2024 ఫిబ్రవరి 17న కోల్‌కతాలో మరణించింది.[8][9] ఆమె వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా మంచాన పడింది, ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 16న దక్షిణ కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న ఆమె మరుసటి రోజు తుదిశ్వాస విడిచింది.

మూలాలు

[మార్చు]
  1. "Tollywood top girls on the go, at a glance". The Telegraph. Calcutta, India. 4 September 2004. Archived from the original on 29 January 2009. Retrieved 29 October 2008.
  2. প্রতিবেদন, নিজস্ব. "অঞ্জনা ভৌমিকের বিরল ছবি শেয়ার করলেন সৃজিত". www.anandabazar.com (in Bengali). Retrieved 2023-04-14.
  3. [1]
  4. "From Hip Hip Hurray to Remix: 5 classic campus series of Indian TV we will always cherish". India Today. Retrieved 20 December 2020.
  5. "Tollywood top girls on the go, at a glance". Calcutta, India: www.telegraphindia.com. 2004-09-04. Archived from the original on 28 December 2004. Retrieved 2008-10-29.
  6. "Airtel Ad-Shahrukh Khan and Chandana Sharma". www.youtube.com. Archived from the original on 2021-12-15. Retrieved 2011-11-29.
  7. "Chowringhee actress Anjana Bhowmik passes away at 79". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-17.
  8. "సీనియర్‌ నటి అంజనా భౌమిక్‌ మృతి |". web.archive.org. 2024-02-18. Archived from the original on 2024-02-18. Retrieved 2024-02-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Veteran actor Anjana Bhowmick dies due to prolonged illness at 79". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-02-17.