అంజూ మెహేంద్రూ
అంజూ మహేంద్రూ | |
---|---|
![]() 2010 జీ రిస్తే పురస్కారాల లో అంజూ మహేంద్రూ | |
జననం | బొంబాయి, బొంబాయి రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం) | 11 జనవరి 1946
క్రియాశీల సంవత్సరాలు | 1966-ప్రస్తుతం |
భాగస్వామి | ఇంతియాజ్ ఆలీ (క్రికెటర్) (1971-1979) గార్‌ఫీల్డ్ సోబెర్స్ (1971) రాజేష్ ఖన్నా(1966-1972)[1] |
అంజూ మహేంద్రూ హిందీ సినిమా నటి[2]. ఆమె కహిన్ తో హోగాలో రీవా, కసౌటి జిందగి కే లో కామిని గుప్తా పాత్రల ద్వారా సుపరిచితురాలు.
జీవిత విశేషాలు[మార్చు]
అంజూ మెజేంద్రూ 1946 జనవరి 11న జన్మించింది. ఆమె క్రికెట్ ఆటగాడు గ్యారీ సోబర్స్‌తో నిశ్చితార్థం చేసుకుంది.[3]
1966 నుండి 1972 వరకు నటుడు రాజేష్ ఖన్నాతో ఆమెకు సుదీర్ఘ సంబంధం ఉంది. రాజేష్ ఖన్నాకు 27 ఏళ్ళు వయసు దాటినందున, 1969 నాటికి సినిమా రంగంలో బాగా ప్రాచుర్యం పొందినందున అతని తల్లి అతనికి త్వరగా వివాహం జరిపించాలని కోరుకుంది. కాని 1971 లో ఖన్నా అంజును ప్రతిపాదించినప్పుడు ఆమె నటిగా తన కెరీర్ కోసం పెళ్ళి వాయిదా వేయాలని అన్నది. అయితే ఖన్నా ఆమెను ప్రేమించడం కొనసాగిస్తూ వివాహం చేసుకోమని ఆమెను కోరుతూనే ఉండేవాడు. మహేంద్రు తల్లికి ఖన్నా అంటే చాలా ఇష్టం. ఖన్నా వారికి బంగ్లా బహుమతిగా ఇచ్చాడు. 1971 లో గ్యారీ సోబర్స్, తరువాత 1972 నుండి ఇంతియాజ్ అలీతో ఆమె డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఖన్నా వివాహం పట్ల ఆమెకున్న నిబద్ధతతో విసుగు చెందాడు. దీని ఫలితంగా ఖన్నాకు 1972 లో మహేంద్రుతో బంధం విడిపోయింది.[4]
1973 మార్చిలో బాబీ చిత్రం విడుదలకు ఎనిమిది నెలల ముందు ఖన్నా డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్నాడు[5]. అంజు, రాజేష్ 1987 వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అంజు 1972 నుండి 1979 వరకు ఇంతియాజ్ అలీతో డేటింగ్ చేసింది. కాని అంజు 1979 లో ఇంతియాజ్ నుండి విడిపోయింది.అంజు 1988 నుండి రాజేష్ ఖన్నాతో మళ్లీ స్నేహం చేసి, అతను మరణించే వరకు అంజు తన సన్నిహితురాలిగా ఉంది. అతను చనిపోయేటప్పుడు అతనితో ఉంది. ఆమె మానసిక అపరిపక్వత కారణంగానే 1971 లో ఖన్నా తనతో వివాహం చేసుకోవడాన్ని నిరాకరించింది. ఆమెకు అతనితో వివాహానికి అంగీకరించినట్లయితే ఆమె తన భార్యగా ఉండిపోయేదని ఆమె ఇంటర్వ్యూలో తెలిపింది.[6]
సినిమా జీవితం[మార్చు]
మహేంద్రు తన 13 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ ప్రారంభింంచింది. ఆమె ప్రతిభను కవి, గేయ రచయిత కైఫీ అజ్మీ గుర్తించి బసు భట్టాచార్యకు సిఫారసు చేసాడు. బసు 1966 లో ఉస్కి కహానీలో నటించడానికి అవకాశం ఇచ్చాడు. ఉస్కి కహానీ మహేంద్రుకు తొలి చిత్రం అలాగే బసు భట్టాచార్య యొక్క మొదటి దర్శకత్వం వహించిన చిత్రం. తరువాత ఆమె జ్యువెల్ థీఫ్, బంధన్, దస్తక్ వంటి చిత్రాల్లో నటించింది. ఆమె ఎప్పుడూ గుర్తింపు పొందిన మహిళా పాత్రలలో నటించలేదు. కేరక్టర్ రోల్స్ కు వెళ్ళలేదు. 1980 ల మధ్యలో ఆదిత్య పంచోలి నటించిన నారి హీరా టెలివిజన్ చిత్రాలలో కూడా ఆమె కనిపించింది.
ఆమె 1990 లలో టెలివిజన్లో వివిధ సబ్బుల ప్రకటనలలో నటించింది. జీ టీవీలో హమారి బేటియూన్ కా వివా అనే టీవీ సీరియల్‌లో ఆమె త్రిష్ణ అత్తగా నటించింది. ఆమె గీత్ హుయ్ సబ్సే పరాయిలో మాన్ యొక్క డాడీగా నటించింది. ఏక్ హజారోన్ మెయిన్ మేరీ బెహ్నా హై చిత్రంలో ఆమె జీవ, మాన్వి, డాబూ యొక్క డాడీ పాత్రను పోషించింది. స్టార్ ప్లస్ 'యే హై మొహబ్బతేన్'లో ఆమె సుజాతగా కనిపిస్తుంది. ప్రస్తుతం, ఆమె స్టార్ ప్లస్‌లోని రిష్టన్ కా చక్రవియులో మహిళా ప్రధాన పాత్రధారి అనామికి నానమ్మ గాయత్రి సింగ్ గా కనిపిస్తుంది.
చిత్రాలు[మార్చు]
సంవత్సరం | చిత్రం | పాత్ర | వ్యాఖ్య |
---|---|---|---|
2006 | హమకో దీవానా కర్ గయే | రితు ఎన్ బైరీ | |
2005 | పేజ్ థ్రీ | రితు బజాజ్ | |
2002 | సాథియా | ప్రేమా | |
1988 | విజయ్ | బేలా | |
1977 | ముక్తి | శన్నో |
మూలాలు[మార్చు]
- ↑ https://www.bollywoodshaadis.com/articles/rajesh-khanna-and-anju-mahendru-love-story-9475
- ↑ [1] Archived 5 జూలై 2009 at the Wayback Machine
- ↑ Anubha Sawhney (2007-03-04). "Romancing the maidens". Times Of India. Articles.timesofindia.indiatimes.com. Retrieved 2012-11-18.
- ↑ https://www.bollywoodshaadis.com/articles/rajesh-khanna-and-anju-mahendru-love-story-9475
- ↑ http://www.deccanherald.com/content/164705/rise-fall-superstar.html
- ↑ Bharati Dubey (20 July 2012). "'Anju Mahendru present as Kaka took his final breath'". The Times of India.