Jump to content

అంతరిక్ష యానంలో మహిళలు

వికీపీడియా నుండి
2010లో అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ లోని గుమ్మం నుంచి భూమిని చూస్తున్న నాసా వ్యోమగామి ట్రేసీ కాల్డ్ వెల్ డైసన్
1992లో స్పేస్ ల్యాబ్ లోని ఎస్.టి.ఎస్-47లో మయే జెమిసన్
2011లో ఐ.ఎస్.ఎస్ వ్యోమనౌకలో వేణువు వాయిస్తున్న మహిళా వ్యోమగామి కేథరిన్ కోలెమన్

ప్రపంచంలోని చాలా మంది మహిళా వ్యోమగాములు అంతరిక్షయానం చేశారు. భూమి సముద్రమట్టానికి 100కి.మీ పైన ఉన్నదాన్ని కెరమన్ లైన్ అని అంటారు. ఎందరో మహిళలు ఆ లైను కన్నా పైన, ఔటర్ స్పేస్ లో కూడా ప్రయాణించారు. కానీ డిసెంబరు 2016 వరకూ భూమి కక్ష్య దాటి ఏ మహిళా ప్రయాణించలేదు.[1]

చాలా దేశాలకు చెందిన మహిళలు అంతరిక్ష పరిశోధనలలో పని చేశారు. అంతరిక్ష యానం చేసిన మొట్టమొదటి మహిళా వ్యోమగామి  వాలెంతినా తెరిష్కోవారష్యా కు చెందిన ఆమె 1963లో తొలిసారి అంతరిక్ష యానం చేశారు. అంతరిక్ష యానం, పరిశోధనల విభాగంలో మహిళలను ఎంపిక చేసుకోవడం చాలా అరుదుగా ఉండేది. 1980ల నుంచి మహిళా వ్యోమగాముల సంఖ్య పెరిగింది. ఎక్కువమంది మహిళా వ్యోమగాములు అమెరికా పౌరులుకాగా, వారు ఎక్కువగా అంతరిక్ష  నౌకలోనే  పనిచేసున్నారు.  చైనారష్యాఅమెరికా  దేశాలు అంతరిక్ష  యాన విభాగాల్లో మహిళలకు  ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. వీటితో పాటు కెనడాఫ్రాన్స్భారత్ఇరాన్ఇటలీజపాన్దక్షిణ కొరియాయునైటెడ్ కింగ్‌డమ్ దేశాలు కూడా రష్యా లేదా యుఎస్  అంతరిక్ష  మిషన్స్ లో తమ మహిళా వ్యోమగాములను పంపాయి.[2]


అంతరిక్షంలో మహిళలు పురుషులు ఎదుర్కొంటున్న అన్ని సవాళ్లను ఎదుర్కొంటారు: భూమ్యేతర పరిస్థితుల వల్ల కలిగే శారీరక ఇబ్బందులు, ఒంటరితనం, వేరుపడటం వల్ల కలిగే యొక్క మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఆడ ఉభయచరాలు, మానవేతర క్షీరదాలపై జరిగిన శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం సాధారణంగా చిన్న చిన్న అంతరిక్ష కార్యకలాపాలు ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపించవు. అయితే దీర్ఘకాలం పాటు అంతరిక్ష ప్రయాణం వారి పునరుత్పత్తిపై ఎంతమేర ప్రభావం చూపిస్తుందో తెలియదు.

మూలాలు

[మార్చు]
  1. ",Women in Space ,history.nasa.gov/". Archived from the original on 2017-02-13. Retrieved 2017-03-17.
  2. "First Russian woman in International Space Station mission". bbc.com/. Retrieved 17 March 2017.