అంతర్జాతీయ సంతోష దినం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంతర్జాతీయ సంతోష దినం ( అంతర్జాతీయ సంతోష దినోత్సవం) (The International Day of Happiness) ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండటానికి సరళమైన, రోజువారీ పద్ధతులను అవలంబించమని ప్రజలను ప్రోత్సహించడం ద్వారా సంతోషకరమైన ప్రపంచాన్ని సృష్టించడం ఈ రోజు లక్ష్యం. మార్చి 20వ తేదీని అంతర్జాతీయ సంతోష దినోత్సవంగా జరుపుకుంటున్నామని, 193 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు సంతోషానికి అధిక ప్రాధాన్యమివ్వాలని తీర్మానించాయి. 2011 లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇది సంతోషాన్ని "ప్రాథమిక మానవ లక్ష్యం"గా గుర్తించింది, "ప్రజలందరి ఆనందం, శ్రేయస్సును ప్రోత్సహించే ఆర్థిక వృద్ధికి మరింత సమ్మిళిత, సమానమైన,సమతుల్య విధానం"కు పిలుపునిచ్చింది.

2012 లో మొదటి ఐక్యరాజ్యసమితి సంతోషం సదస్సు జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తొలిసారిగా 2013 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు[1].

అంతర్జాతీయ సంతోష దినోత్సవం
యితర పేర్లుసంతోష దినం
జరుపుకొనేవారుఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు
రకంఐక్యరాజ్యసమితి తీర్మానం
జరుపుకొనే రోజు20 మార్చి
ఉత్సవాలుప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం
ఆవృత్తిసంవత్సరం
అనుకూలనంప్రతి సంవత్సరం

అవలోకనం[మార్చు]

లండన్ లో 2009 నాస్తిక బస్ క్యాంపెయిన్ నినాదం.

ప్రపంచవ్యాప్తంగా వైఖరుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. 'పురోగతి' అనేది కేవలం ఆర్థిక వ్యవస్థను పెంచడం మాత్రమే కాదని, మానవ సంతోషం, శ్రేయస్సును పెంచడం అని ఇప్పుడు గుర్తిస్తున్నారు. దీనికి అనుగుణంగా మార్చి 20వ తేదీని అంతర్జాతీయ సంతోష దినోత్సవంగా జరుపుకుంటున్నామని, 193 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు సంతోషానికి అధిక ప్రాధాన్యమివ్వాలని తీర్మానించాయి. 160 దేశాలకు చెందిన ప్రజల లాభాపేక్షలేని ఉద్యమం యాక్షన్ ఫర్ హ్యాపీనెస్, భావసారూప్య సంస్థల భాగస్వామ్యంతో దీనిని సమన్వయం చేస్తుంది. 2011 లో, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇందులో సంతోషాన్ని "ప్రాథమిక మానవ లక్ష్యం"గా గుర్తించింది. "ప్రజలందరి ఆనందం, శ్రేయస్సును ప్రోత్సహించే ఆర్థిక వృద్ధికి మరింత సమ్మిళిత, సమానమైన, సమతుల్య విధానం"కు పిలుపునిచ్చింది. 2013లో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.[2]

ఆలోచన[మార్చు]

1972 సంవత్సరంలో భూటాన్ రాజు జిగ్మే సింగ్యే వాంగ్ చుక్ ఒక దేశ పురోగతిని దాని సంతోషాన్ని బట్టి కొలవాలని, దేశ పురోగతిని ఎంత ఉత్పత్తి చేస్తుందో, ఎంత డబ్బు సంపాదిస్తుందో కాదని అన్నాడు. దీనిని గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ (జీఎన్హెచ్) గా ఆయన అభివర్ణించారు. ఇందుకోసం భూటాన్ దేశం ప్రజల మానసిక ఆరోగ్యం, సాధారణ ఆరోగ్యం, సమయాన్ని ఎలా గడుపుతారు, ఎక్కడ నివసిస్తున్నారు, విద్య, పర్యావరణం వంటి విషయాల ఆధారంగా ఆనందాన్ని కొలవడానికి ఒక వ్యవస్థను అభివృద్ధి చేసింది.  ఇందుకు గాను భూటాన్ ప్రజలు సుమారు 300 ప్రశ్నలకు సమాధానం ఇస్తారు,  పురోగతిని కొలవడానికి ప్రతి సంవత్సరం ఫలితాలను పోల్చుతారు. దేశం కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ లో ఉన్న ఫలితాలను, ఆలోచనలను ఉపయోగిస్తుంది. ఇతర ప్రదేశాలు ఈ రకమైన నివేదిక లాంటి సారూప్యముతో వెర్షన్లను ఉపయోగిస్తాన్నారు. కెనడాలోని విక్టోరియా నగరం, అమెరికా లోని సియాటెల్, వెర్మాంట్ రాష్ట్రం ఇలాంటి వ్యవస్థను పెట్టుకున్నారు. అంతర్జాతీయ సంతోష దినోత్సవం వెనుక ఉన్న వ్యక్తి జేమ్ ఇలియన్ అనే ఐక్యరాజ్యసమితి సలహాదారు సంతోషాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ దినోత్సవం ఆలోచనను 2011 సంవత్సరంలో సూచించాడు, దానిని  2012లో సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఆమోదించారు. భారతదేశంలోని కలకత్తా1లో జన్మించిన జేమ్ చిన్నతనంలోనే అనాథ అయ్యాడు. ఆయనను అన్నా బెల్లె ఇలియన్ అనే అమెరికన్ నర్సు దత్తత తీసుకుంది. అనాథలకు సహాయం చేయడానికి ఆమె ప్రపంచవ్యాప్తంగా పర్యటించింది, ఆమె జేమ్ ను తనతో తీసుకెళ్లింది. అతను తనలాంటి పిల్లలను చూశాడు, వారి కోసం బాలలు, మానవహక్కుల రంగాల్లో పనిచేశాడు.[3]

లాభాలు[మార్చు]

సంతోషముతో ఉన్న బాలురు

సంతోషము ప్రయోజనాలలో కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, మానవ ఆరోగ్యానికి కీలకమైనది బలమైన సామాజిక సంబంధాలు, ఉద్దేశ్య భావన. ఆనందంగా, సంతోషంగా ఉండటం మానవాళి 'గొప్ప మేలు' కోసం చేసే పనుల్లో ఇమిడి ఉంటుంది. ఇందుకు సానుకూల మనస్తత్వం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కొందరు పేర్కొంటారు. మన శ్రేయస్సు భావాలలో 90% వరకు ఉంటుంది. ఇతరులకు సహాయపడటం, సమాజాన్ని మెరుగుపరచడానికి కలిసి పనిచేయడం లేదా ఆధ్యాత్మిక వంటి మతపరమైన కార్యకలాపాలను ప్రోత్సహించే పాల్గొనడం వంటివి ఉన్నాయి. సంతోషంగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారని, ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని, అధిక రక్తపోటు, గుండె సమస్యల లాంటివి ఉండవు. అయినప్పటికీ, ఆనందం, ఆనంద స్థాయిలను ఎలా కనుగొనాలి లేదా పెంచాలి అనే దానిపై అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి . అంతర్జాతీయ సంతోష దినోత్సవంమనము ఇతరుల సంతోషానికి విలువనిచ్చే, ప్రజలను సంతోషపెట్టే రోజు. జీవితంలో సంతోషం అధిక ప్రాధాన్యతో ఉండటం మానవ జీవితాలకు శ్రేయస్సుగా ఉండి, మనము ఇతరులకు, సమాజానికి ఉపయోగంగా ఉంటాము.

సలహాలు[మార్చు]

సంతోషంగా ఉండటానికి కొన్ని సలహాలు చిట్కాలు ఈ విధంగా ఉన్నాయి.[4]

  • ఆహారములో నిర్ణయాలు ( పోషక, బలము తో) ఉన్నవాటిని తీసుకోవడం ద్వారా మానసికంగా బలంగా ఉండవచ్చు.
  • తేలికపాటి వ్యాయామం కూడా మెదడు ఫీల్ గుడ్ రసాయనాలను విడుదల చేస్తుంది.
  • తగినంత విశ్రాంతి తీసుకోవడం.
  • ఒత్తిడిని మనసులో బాధలో ఉంచడం కంటే, విషయాలు మాట్లాడటం దానిని వదిలించుకోవడానికి ప్రయత్నం.
  • అసంతృప్తి భావాలను తొలగించుకోవడం.
  • లోతుగా శ్వాస తీసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నందున కొంచెం సంతోషంగా ఉండవచ్చు.
  • స్నేహితుల చుట్టూ ఉండటం మానసిక స్థితిపై భారీ ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే ఇందులోని భావన సంతోషకరమైన జీవితాన్ని గడపడంలో ముఖ్యమైన భాగం.
  • జీవితంలో జరిగిన విషయాల పట్ల లేదా వ్యక్తులపై కోపం గణనీయమైన భారం, కేవలం క్షమించడం ద్వారా సాధించవచ్చును .

మూలాలు[మార్చు]

  1. "The International Day of Happiness | Live Happy" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-16. Retrieved 2023-03-21.
  2. "About The Day". International Day of Happiness - 20 March (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-03-21.
  3. "International Day of Happiness". LearnEnglish (in ఇంగ్లీష్). 2023-03-13. Retrieved 2023-03-21.
  4. "International Day of Happiness 2023: Know Date, Theme, History, Significance, and Key Facts Here". Jagranjosh.com. 2020-03-20. Retrieved 2023-03-21.