Jump to content

అంతర్ధానుఁడు

వికీపీడియా నుండి
విజయరాఘవ మందిరం, అయోద్య

అంతర్ధానుఁడు పృథుచక్రవర్తి కొడుకు. ఇతనికి ఇరువురు భార్యలు. మొదటిభార్యయగు శిఖండి వసిష్ఠుని శాపముచే భూమి యందు పుట్టి త్రేతాగ్నులయిన పావకుఁడు, పవమానుఁడు, శుచి అను మువ్వురు పుత్రులను కనెను. వీరు బాల్యమునందే చనిపోయిరి. రెండవభార్యయగు నభస్వతికి హవిర్ధానుఁడు అను కొమరుఁడు పుట్టెను.

ప్రస్తానము

[మార్చు]

తండ్రి రఘువు. కొడుకు దశరథుఁడు. కొందఱు రఘుమహారాజునకు పృథుశ్రవుఁడు అను నొక కొడుకు ఉండినట్లును, అతనికి అజుఁడు పుట్టినట్లును చెప్పుదురు. విదర్భరాజు కూఁతురగు ఇందుమతీస్వయంవరమునకు పోవునపుడు ఇతఁడు మార్గమున ఒక ఋషిశాపముచే ఏనుఁగయి ఉండిన యొక గంధర్వుని చంపఁ బోవఁగా ఆ మృగము తన పూర్వగంధర్వరూపమును దాల్చి యితనికి అనేకాస్త్రములను ఉపదేశింపఁగా ఆయస్త్రముల సాహాయ్యమువలన ఇతఁడు ఎల్లరాజుల జయించి స్వయంవరమున ఇందుమతిని వివాహమాయెను.[1]

మూలాలు

[మార్చు]
  1. [పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 ]