అంతిరెడ్డిగారి విఠల్ రెడ్డి
Appearance
అంతిరెడ్డిగారి విఠల్ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1989 - 1994 | |||
ముందు | ఆర్.ఎస్. వాసురెడ్డి | ||
---|---|---|---|
తరువాత | దేవర వాసుదేవ రావు | ||
నియోజకవర్గం | రామాయంపేట | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1999 - 2004 | |||
ముందు | దేవర వాసుదేవ రావు | ||
తరువాత | పద్మా దేవేందర్ రెడ్డి | ||
నియోజకవర్గం | రామాయంపేట | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1940 మాసాయిపేట, మాసాయిపేట మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | టీడీపీ | ||
నివాసం | తెలంగాణ భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అంతిరెడ్డిగారి విఠల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రామాయంపేట శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అంతిరెడ్డిగారి విఠల్ రెడ్డి 1959 నుంచి 1981 వరకు మాసాయిపేట సర్పంచ్‌గా, 1981 నుంచి 1986 వరకు రామాయంపేట సమితి అధ్యక్షుడిగా పని చేసి 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రామాయంపేట శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం.ఎన్.లక్ష్మీనారాయణపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 1994లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవర వాసుదేవ రావు చేతిలో ఓడిపోయి 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవర వాసుదేవ రావుపై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (6 November 2023). "పల్లెల్లో గెలిచి.. పదవులు వరించి". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ Sakshi (24 October 2023). "గతమెంతో ఘనం." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ Eenadu (14 November 2023). "గట్టి పోటీ.. ఓటమితో సరిపెట్టి". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.