మాసాయిపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాసాయిపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, మాసాయిపేట స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, మాసాయిపేట స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, మాసాయిపేట స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం మాసాయిపేట
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 212 km² (81.9 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 42,309
 - పురుషులు 20,842
 - స్త్రీలు 21,467
పిన్‌కోడ్ {{{pincode}}}


మాసాయిపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లో 2020 డిసెంబరు 24న కొత్తగా ఏర్పడింది.[1].దీని ప్రధాన పరిపాలనా కేంద్రం మాసాయిపేట.ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజను పరిధిలోకి వస్తుంది.[2] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత నుండి 2021 వరకూ మధ్య గల కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఇది ఒకటి.[3][4] దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[5] పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా తూప్రాన్ రెవెన్యూ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం మాసాయిపేట.

గణాంకాలు[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 212 చ.కి.మీ. కాగా, జనాభా 42,309. జనాభాలో పురుషులు 20,842 కాగా, స్త్రీల సంఖ్య 21,467. మండలంలో 9,516 గృహాలున్నాయి.[6]

2020 లో ఏర్పడిన మండలం[మార్చు]

ఇదే జిల్లా ఎల్దుర్తి మండలం లోని మాసాయిపేట, రామాంతపూర్, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలతో, చేగుంట మండలం లోని చెట్ల తిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి గ్రామాలతో మాసాయిపేట మండలాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది.[2]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అచ్చంపేట
 2. హకీంపేట
 3. రామాంతపూర్
 4. లింగారెడ్డిపల్లి
 5. మాసాయిపేట
 6. కొప్పులపల్లి
 7. పోతంశెట్టిపల్లి
 8. చెట్లతిమ్మాయిపల్లి
 9. పోతంపల్లి

మూలాలు[మార్చు]

 1. "ఏండ్ల కల.. నెరవేరుతున్న వేళ". Namasthe Telangana. 2021-04-06. Retrieved 2022-01-09.
 2. 2.0 2.1 "కొత్త మండలంగా మాసాయిపేట.. తుది నోటిఫికేషన్‌ విడుదల". ETV Bharat News. Retrieved 2021-05-23.
 3. "మాసాయిపేట మండలం ఉత్తర్వులతో సంబురాలు". andhrajyothy. Retrieved 2022-01-03.
 4. Arun (2020-07-01). "Maasaipet announces New Mandalఇచ్చిన మాటనిలబెట్టుకున్న సీఎం కేసీఆర్…". Great Telangaana. Retrieved 2022-01-03.
 5. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
 6. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]