నిజాంపేట్ మండలం (మెదక్ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజాంపేట్
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, నిజాంపేట్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, నిజాంపేట్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, నిజాంపేట్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం నిజాంపేట్ (మెదక్ జిల్లా)
గ్రామాలు 08
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 95 km² (36.7 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 26,449
 - పురుషులు 13,040
 - స్త్రీలు 13,409
పిన్‌కోడ్ 502102

నిజాంపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని ఉన్న మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం నిజాంపేట్.

2016 లో ఏర్పడిన మండలం[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు నిజాంపేట్ గ్రామం మెదక్ జిల్లా, మెదక్ రెవెన్యూ డివిజను పరిధిలోని రామాయంపేట మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నిజాంపేట గ్రామం నూతన మండల కేంద్రంగా, తిరిగి అదే జిల్లా,అదే రెవెన్యూ డివిజను పరిధిలో రామాయంపేట మండలం లోని 24 గ్రామాల నుండి 1+7 (ఎనిమిది) గ్రామాలను విడగాట్టి నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

గణాంకాలు[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 95 చ.కి.మీ. కాగా, జనాభా 26,449. జనాభాలో పురుషులు 13,040 కాగా, స్త్రీల సంఖ్య 13,409. మండలంలో 5,850 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. నందిగావ్
  2. చెల్మెడ
  3. నస్కల్
  4. నిజాంపేట్
  5. కల్వకుంట
  6. బచ్చురాజుపల్లి
  7. నార్లపూర్
  8. వెంకటాపూర్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]