అందుకూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందుకూరు
—  రెవిన్యూ గ్రామం  —
అందుకూరు is located in Andhra Pradesh
అందుకూరు
అందుకూరు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°31′43″N 80°10′22″E / 16.528639°N 80.172859°E / 16.528639; 80.172859
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం క్రోసూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,243
 - పురుషులు 1,109
 - స్త్రీలు 1,134
 - గృహాల సంఖ్య 696
పిన్ కోడ్ 522410
ఎస్.టి.డి కోడ్

అందుకూరు, గుంటూరు జిల్లా, క్రోసూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 522 410., ఎస్.టి.డి,కోడ్ = 08640.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

క్రోసూరు మండలం[మార్చు]

క్రోసూరు మండలంలోని అందుకూరు, అనంతవరం, అగ్రహారం, ఉయ్యందన, ఊటుకూరు, క్రోసూరు, పారుపల్లి, పీసపాడు, బయ్యవరం, బాలెమర్రు, విప్పర్ల గ్రామాలు ఉన్నాయి.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో 2014,నవంబరు-2న వాసిరెడ్డివారి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాజా వాసిరెడ్డి వంశవృక్షంలోని, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలకు చెందిన పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసారు. వాసిరెడ్డి అభ్యుదయ సమితి వారు ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించుచున్నారు. వాసిరెడ్డి వంశవృక్షంలోని వెనుకబడిన విద్యార్థుల అభ్యున్నతికి చేయూతనివ్వడం, ధరణికోటను రాజధానిగా పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పరిపాలన విధానాలను, అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాల గురించి నేటి యువతకు అవగాహన కల్పించడం ఈ సదస్సు యొక్క ముఖ్యోద్దేశ్యం. కార్యక్రమంలో భాగంగా వెంకటాద్రినాయుడు క్యాలెండర్లను, నూతన గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా 14వ శతాబ్దం నుండి 1905 వరకు వాసిరెడ్డి వంశవృక్షంపై నూతన రచనలను ముద్రింపజేస్తున్నట్లు తెలియజేసినారు. [2] & [3]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,485.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,267, స్త్రీల సంఖ్య 1,218, గ్రామంలో నివాస గృహాలు 620 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 783 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,243 - పురుషుల సంఖ్య 1,109 - స్త్రీల సంఖ్య 1,134 - గృహాల సంఖ్య 696

సమీప గ్రామాలు[మార్చు]

విప్పర్ల 2 కి.మీ, బాలెమర్రు 2 కి.మీ, దొడ్లేరు 3 కి.మీ, క్రోసూరు 3 కి.మీ, గ్రంధసిరి 5 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన అచ్చంపేట మండలం, తూర్పున పెదకూరపాడు మండలం, దక్షణాన సత్తెనపల్లిమండలం, పశ్చిమాన రాజుపాలెం మండలం.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-08-23.


"https://te.wikipedia.org/w/index.php?title=అందుకూరు&oldid=2860611" నుండి వెలికితీశారు