అంబా ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమ్మెట అంబా ప్రసాద్
అంబాప్రసాద్ చిత్రం
జననం
అంబా ప్రసాద్

1905
తణుకు దగ్గరులోని సమ్మెట
విద్యమెట్రిక్
ఉద్యోగంవిద్యాశాఖలో గుమస్తా
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హార్మోనియంవాద్యకారుడు, మెకానికల్ ఇంజనీరింగులో పట్టభద్రుడు.
తల్లిదండ్రులు
  • రంగనాయకులు (తండ్రి)
  • సీతమ్మ (తల్లి)

సమ్మెట అంబా ప్రసాద్ ప్రముఖ హార్మోనియం విద్వాంసుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన 1905లో తణుకులో మాతామహుల ఇంట జన్మించారు. తల్లి శ్రీమతి సీతమ్మ. ఆయనకు గల నలుగురు సోదరులూ సంగీత విద్వాంసులే. ఆయన పెద్ద అన్నయ్య వెంకటరావు, తమ్ముడూ హార్మోనియం నిపుణులే. వీరి పూర్వులది బందరు సమీపంలోని సమ్మెట గ్రామం. వారి తాతగారు హైదరాబాదు వలస వచ్చారు. తండ్రి రంగనాయకులు గారు పబ్లిక్ వర్క్స్ శాఖలోనూ, నిజాం నవాబు పాలెస్ వర్క్స్ లోనూ పనిచేసేవాడు, అనేక జ్యోతిష గ్రంథాలను రచించారు. అంబా ప్రసాద్ గారు చాదర్గాట్ హైస్కూలులో మెట్రిక్ చదివారు. చదువు చాలించి విద్యాశాఖలో గుమస్తాగా చేరారు. ఆ శాఖలో 21 సంవత్సరాలు పనిచేసారు. తరువాత మహాబూలియా గర్ల్స్ హైస్కూలులో సిరిస్తాదారుగా నాలుగేళ్ళు పనిచేసారు. పగలంతా ఉద్యోగం చేసి రాత్రిపూట మనో ఉల్లాసం కోసం హార్మోనియం సాధన చేసేవారు.[1]

వీరు చిన్నతనంలో తన సోదరుడు వెంకటరావు వద్దను తర్వాత నిజాం ఆస్థాన విద్వాంసులైన హరి రామచంద్రరావు గార్ల వద్ద హార్మోనియం నేర్చుకున్నారు. విశేషమైన కృషిచేసి, హిందూస్థానీ సంగీత విద్వాంసులైన అబ్దుల్ కరీం ఖాన్, ఉస్తాద్ ఫయ్యజ్ ఖాన్ లకు వాద్య సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. వీరు ఆంధ్ర దేశంలో పలు కచేరీలు చేశారు. మచిలీపట్నంలో వీరు హరి నాగభూషణం గారి ద్వారా సువర్ణ ఘంటా కంకణం పొందారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]