Jump to content

అక్కమొగుడు (ధారావాహిక)

వికీపీడియా నుండి
అక్కమొగుడు
జానర్కుటుంబ నేపథ్యం
రచయితకొమ్మనాపల్లి గణపతి రావు
ఛాయాగ్రహణంరమ్మ ప్రదీప్
దర్శకత్వంవెంకట కోటి డేగల
తారాగణంప్రీతి శ్రీనివాస్
వాసుదేవరావు
వందన గొల్లు
కావ్య గౌడ
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల2 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య692 (2021 ఫిబ్రవరి 2021)
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్బిక్షమయ్య సంగం
వెంకట కోటి డేగల
ఛాయాగ్రహణంచంద్రశేఖర్ నార్నికొల్లు
ఎం. మధుకిరణ్
ఎడిటర్లుశివప్రసాద్ రాచూరి
కాశిం షేక్ (మున్నా)
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నిడివి20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీబిఎస్ ప్రొడక్షన్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ (ఎస్.డి.)
1080ఐ (హెచ్.డి)
వాస్తవ విడుదల28 మే 2018 - ప్రస్తుతం
కాలక్రమం
Preceded byజైజై వినాయక (7:30PM)
మహకాళి (6:30PM)
Followed byచంద్రకుమారి

అక్కమొగుడు, 2018 మే 28న జెమినీ టీవీలో ప్రారంభమైన తెలుగు ధారావాహిక.[1] ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ 6:30 గంటలకు ప్రసారమైన ఈ సీరియల్‌కు వెంకట కోటి డేగల దర్శకత్వం వహించాడు. ఈ సీరియల్‌లో ప్రీతి శ్రీనివాస్,[2] వాసుదేవరావు,[3] వందన గొల్లు, కావ్య గౌడ కీలక పాత్రల్లో నటించారు.

సిరీస్ ప్రసారం

[మార్చు]
సీజన్ ఎపిసోడ్ల సంఖ్య ప్రసార ప్రారంభం
సిరీస్ ప్రీమియర్ సిరీస్ ముగింపు
1 532 5 (2018) 2020 ఆగస్టు 10 (2020-08-10 )
2 --- 8 (2020) ఇంకా ప్రకటించలేదు ()

కథా సారాశం

[మార్చు]

వ్యక్తిత్వం, ఆదర్శాలలో వేరువేరు అభిప్రాయాలతో ఉన్న రమ్య, సౌమ్య అనే ఇద్దరు కవలల నేపథ్యంలో ఈ సీరియల్ సాగుతుంది. వారి జీవితాల్లోకి అమర్ ప్రవేశించినప్పుడు పరిస్థితులు అనేక మలుపు తిరుగుతాయి. ఈ ఇద్దరు సోదరీమణులు తమ జీవితాల్లోని అవరోధాలను ఎలా అధిగమిస్తారు అనేది మిగిలిన కథ. కథ నేపథ్యం ఆధారంగా సీరియల్ టైటిల్ ఎంపిక చేయబడింది. కవల సోదరీమణుల కథ, వారి వైవాహిక జీవితాలకు ఇది సరైన పేరు కాబట్టి ఈ టైటిల్ ఎంపిక చేయబడింది.

నటవర్గం

[మార్చు]

సీజన్ 2

[మార్చు]
  • ఐశ్వర్య గౌడ (533 - 564)/ప్రీతి శ్రీనివాస్ (564 - ప్రస్తుతం): మేఘనగా
  • వాసుదేవ రావు (జై)
  • వందన గొల్లు (రమ్య, అమర్ కుమార్తె చైత్ర)
  • సౌజన్య (రమ్య కుమార్తె గుర్రంకొండ దేవమ్మ)
  • కావ్య గౌడ (సౌమ్య)
  • మేక రామకృష్ణ (చైత్ర తాత రఘురామ్‌)
  • నళిని బండి (చైత్ర అమ్మమ్మ సీతమ్మ)
  • సంధ్య పెద్దాడ (జై తల్లి సంతమ్మ)
  • స్వరూప (మేఘన తల్లి)
  • సుధీర్ (దేవమ్మ సోదరుడు భైరవ)
  • కొండమ రాజు (దేవమ్మ సోదరుడు బసవ)
  • అనిల్ (సౌమ్య అసిస్టెంట్ సంకెత్)

సీజన్ 1

[మార్చు]
  • ఐశ్వర్య గౌడ (రమ్య)
  • కావ్య గౌడ (ముఖ శస్త్రచికిత్స తర్వాత సౌమ్య)
  • వాసుదేవ రావు (రమ్య భర్త అమర్)
  • శ్యామ్ గోపాల్ (రమ్య బెస్ట్ ఫ్రెండ్ సందీప్)
  • సాక్షి శివ (అమర్‌ తండ్రి రఘురామ్‌)
  • అమని (కుటుంబ న్యాయ సలహాదారు జనని)
  • జానకి వర్మ (రమ్య, సౌమ్యల తల్లి సీతమ్మ)
  • శోభారాణి (సందీప్ తల్లి రాజేశ్వరి)
  • సింధుజ (సందీప్ భార్య డాక్టర్ మధులత)
  • ఆబిద్ భూషణ్ (రాబ్ కుమార్)
  • వీరబాబు (రాజ్‌కుమార్ సహాయకుడు బంటు)
  • మల్లాది శివనారాయణ (అమర్ తాతయ్య)
  • మౌనిక (శైలు)
  • జయ హరిక (నిషా)

ఇతర నటవర్గం

[మార్చు]
  • ఐశ్వర్య గౌడ: సౌమ్య ముఖ శస్త్రచికిత్సకు ముందు (ద్విపాత్రాభినయం)

ప్రసారం

[మార్చు]

2018 మే 28న జెమినీ టీవీకలో ఈ సీరియల్ ప్రారంభమైంది. మొదట్లో ఈ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 7:30 గంటలకు ప్రసారం చేయబడింది. చంద్రకుమారి అనే సీరియల్ రావడంతో 2018, డిసెంబరు 24 నుండి ఈ సీరియల్‌ సాయంత్రం 6:30 గంటలకు మార్చబడింది.

డబ్బింగ్ వెర్షన్

[మార్చు]

తమిళ సీరియల్ భామ రుక్మిణి సీరియల్ సన్ టీవీలో ఉదయం 11 గంటలకు ప్రసారం అయింది.[4]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం గ్రహీత పాత్ర ఫలితం
2019 పద్మోమోహన అవార్డులు 2019[5] ఉత్తమ దర్శకుడు వెంకటకోటి దేగల ----- గెలుపు

క్రాస్ఓవర్ ఎపిసోడ్లు

[మార్చు]
  • 2019 మార్చి 22న ఎపిసోడ్ 215లో అక్కమొగుడు సీరియల్ ప్రతిఘటన సీరియల్ తో క్రాస్ఓవర్ అయింది.
  • 2019 డిసెంబరు 18 నుండి - 2019 డిసెంబరు 19 నాడు ప్రసారమైన 421, 422 ఎపిసోడ్లలో రోజా సీరియల్ అక్కమొగుడు సీరియల్ తో క్రాస్ఓవర్ అయింది.

మూలాలు

[మార్చు]
  1. "Akka Mogudu Serial in Gemini TV, Cast and Crew". Telugunestam.com. Archived from the original on 2020-11-21. Retrieved 2021-05-31.
  2. "Telugu Tv Actress Preethi Srinivas Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
  3. Kumar, Hemanth (16 October 2014). "I want people to talk about my acting : Vasudev Rao". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
  4. "Bhama Rukmani Tamil Serial: Today Episode, Cast & Crew, Videos, Promo, TV Timings". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
  5. "Padmamohana Arts" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-18. Retrieved 2021-05-31.