Jump to content

అక్వేరియం

వికీపీడియా నుండి
లండన్ లో నీటి అడుగున ఉన్న అక్వేరియం

అక్వేరియం (ఆంగ్లం: Aquarium) అనేది నీటితో నిండిన పాత్ర లేదా గాజు తొట్టె. దీనిలో ప్రత్యక్ష జల జంతువులను లేదా మొక్కలను ఉంచుతారు. ఆంగ్ల ప్రకృతి శాస్త్రవేత్త ఫిలిప్ హెన్రీ గోస్సే రూపొందించిన ఆక్వేరియం అనే పదానికి, లాటిన్లో ఆక్వా అంటే 'నీరు' అని అరియం అంటే 'సంబంధిత స్థలం' అని అర్ధం. ఆక్వేరియం సూత్రాన్ని రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ వారింగ్టన్ 1850లో, ఒక కంటైనర్‌లోని నీటిలో మొక్కలు జంతువులకు మద్దతుగా తగినంత ఆక్సిజన్‌ను ఇస్తాయని వివరించాడు. 1853లో లండన్ జూలో మొట్టమొదటి పబ్లిక్ అక్వేరియంను  గోస్సే సృష్టించాడు. ఇతను 1854లో మొదటి మాన్యువల్, "ది అక్వేరియం: యాన్ అన్‌వెయిలింగ్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ది డీప్ సీ"ని ప్రచురించాడు.[1] చేపలను కలిగి, అక్వేరియంను నిర్వహించే వారిని ఆక్వేరిస్ట్ అంటారు. అక్వేరియం సాధారణంగా గాజు లేదా అధిక శక్తి కలిగిన యాక్రిలిక్‌తో నిర్మించబడుతుంది. క్యూబాయిడ్ అక్వేరియంను ఫిష్ ట్యాంకులు లేదా కేవలం ట్యాంకులు అని కూడా పిలుస్తారు,  గిన్నె ఆకారంలో ఉండే అక్వేరియంను ఫిష్ బౌల్స్ అని కూడా అంటారు.

చరిత్ర

[మార్చు]
జార్జియా లో ఉన్న సొరంగ అక్వేరియం

చేపల పెంపకం అనేది 4,500 సంవత్సరాల క్రితం ప్రారంభమయింది. చైనాలో, ఆసియా దేశాలలో, షుంగ్ రాజవంశం (960-1278) పాలనలో, ఎర్ర చేపలు (బంగారు చేపలు) ఇంటి అలంకరణ కోసం పెంచడం ప్రారంభించారు. చైనీయులు చిన్న పాత్రలలో ఉంచడానికి, అలంకరణకు అనువైన ప్రత్యేక జాతుల చేపలను అభివృద్ధి చేశారు. 1369లో, చైనాకు చెందిన హాంగ్వు చక్రవర్తి గోల్డ్ ఫిష్ నిర్వహణ కోసం పెద్ద పింగాణీ టబ్‌లను ఉత్పత్తి చేసే పింగాణీ కంపెనీని స్థాపించాడు.[2] ఇరవయ్యవ శతాబ్దపు చివరి భాగంలో అక్వేరియం డిజైన్‌ను రూపొందించడంలో జపాన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది, తకాషి అమనో కంపెనీ ఆక్వాస్కేపింగ్ డిజైన్‌లు చేపల పెంపకందారులను ప్రభావితం చేసే గృహ ఆక్వేరియంలను రూపొందించాయి. యునైటెడ్ స్టేట్స్‌లో, 1996 నాటికి అక్వేరియం అనేది స్టాంపుల సేకరణ తర్వాత రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన అభిరుచిగా మారింది. అమెరికన్లు సుమారు 139 మిలియన్ మంచినీటి చేపలు, 9.6 మిలియన్ ఉప్పునీటి చేపలను కలిగి ఉన్నారని, జర్మనీలోని ఆక్వేరియంలో ఉంచిన చేపల సంఖ్య కనీసం 36 మిలియన్లు, అలాగే ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికాలో 40% ఆక్వేరిస్టులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ట్యాంకులను నిర్వహిస్తున్నారని నేషనల్ పెట్ ఓనర్స్ సర్వే తెలిపింది.[3]

అక్వేరియం రకాలు

[మార్చు]
అక్వేరియంలోని చేప

క్రీసెల్ ట్యాంక్

[మార్చు]

క్రీసెల్ ట్యాంక్ (క్రీసెల్ అంటే జర్మన్ భాషలో "స్పిన్నింగ్ టాప్ " లేదా " గైరోస్కోప్ ") అనేది జెల్లీ ఫిష్, నవజాత సముద్ర గుర్రాలు వంటి సున్నితమైన జంతువులను ఉంచడానికి రూపొందించబడిన క్షితిజ సమాంతర సిలిండర్ ఆకారంలో ఉండే అక్వేరియం .

బయోటోప్

[మార్చు]

బయోటోప్ అక్వేరియం అనేది ఒకే స్థలంలో కలిసి జీవించే చేపలు, మొక్కలను కలిగి ఉంటుంది. ఉదా: ఇంట్లో ఉండే అక్వేరియం.

నానో అక్వేరియం

[మార్చు]

మినీ అక్వేరియంలు (150 లీటర్లు లేదా 40 గ్యాలన్ల కంటే తక్కువ) లేదా నానో అక్వేరియంలు (75 లీటర్లు లేదా 20 గ్యాలన్ల కంటే తక్కువ) అనేవి చాలా చిన్న అక్వేరియంలు.

పబ్లిక్ అక్వేరియం

[మార్చు]

పబ్లిక్ ఆక్వేరియం అనేవి అనేక చిన్న ఆక్వేరియంలను కలిగి ఉంటాయి, అలాగే అవి ఇంటిలో ఉండే వాటికంటే చాలా పెద్దవి. అతిపెద్ద ట్యాంకులు మిలియన్ల గ్యాలన్ల నీటిని కలిగి ఉంటాయి, ఇవి షార్క్ లు లేదా బెలూగా తిమింగలాలతో సహా పెద్ద జాతులను కలిగి ఉంటాయి.

వర్చువల్ అక్వేరియం

[మార్చు]

వర్చువల్ అక్వేరియం అనేది వ్యక్తిగత కంప్యూటర్‌లో అక్వేరియంను పునరుత్పత్తి చేయడానికి 3డి గ్రాఫిక్‌లను ఉపయోగించే కంప్యూటర్ ప్రోగ్రామ్. వీటిని తరచుగా స్క్రీన్‌సేవర్‌లుగా ఉపయోగిస్తారు.

అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం

[మార్చు]

ఇది సముద్రం లేదా నది అడుగున పాక్షికంగా లేదా పూర్తిగా నిర్మించబడిన సొరంగం.

వాక్-త్రూ టన్నెల్ అక్వేరియం

[మార్చు]

దీనిని మొదటి సారిగా విశాఖపట్నంలో ప్రారంభించారు. ఇది 52 మిల్లీమీట్ల మందం కలిగిన గాజుతో తయారు చేశారు. ఇది వీక్షణను వక్రీకరించకుండా నీటి ఒత్తిడిని తట్టుకోగలదు. సొరంగం కోసం దాదాపు 1,200 లీటర్లు ఉపయోగించారు. ఇందులో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో చేపలను పెంచుతారు. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే చేపలు చనిపోతాయి. దీనిని ఎక్కడికి అయిన తీసుకెళ్లవచ్చు. సొరంగం ఎనిమిది ముక్కలుగా చేసి చేపలు లేకుండా లారీ కంటైనర్లలో రవాణా చేస్తారు.[4] ఒక్కొక్కటి 3.5 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల పొడవు ఉన్న 70 ట్యాంకులలో చేపలను ఉంచి, ఆక్సిజన్ కోసం 7.5 కిలోవాట్ జనరేటర్‌ ఉన్న ట్రక్కు ద్వారా ట్యాంకులను రవాణా చేస్తారు. వీటిని ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, బెంగళూరులలో జరుగుతున్న ఫిష్ ఎగ్జిబిషన్ లో కూడా ఉంచారు. ఈ 250 అడుగుల పొడవైన టన్నెల్ ఆక్వేరియం(Tunnel Fish Aquarium)లో 500 రకాలకు చెందిన చేపలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ ప్రదర్శనలో అరభైమా రకం చేపకూడా ఉంది. ఇది సుమారు 60 కిలోలు ఉంటుంది. దీని విలువ రూ.6లక్షల వరకు ఉంటుంది. ఇది రోజుకు కిలోన్నర చికెన్‌ తింటుంది.[5]

వాక్-త్రూ టన్నెల్ అక్వేరియం, హైదరాబాదు ఫొటో గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Mintz, S. (2007-03-01). "Pets in America: A History. By Katherine C. Grier (Chapel Hill: University of North Carolina Press, 2006. vii plus 377 pp. $34.95)". Journal of Social History. 40 (3): 750–752. doi:10.1353/jsh.2007.0057. ISSN 0022-4529. S2CID 142685135.
  2. Brunner, Bernd (2003). The Ocean at Home. New York: Princeton Architectural Press. pp. 21–22. ISBN 1-56898-502-9.
  3. "NPOS". 2007-04-06. Archived from the original on 2007-04-06. Retrieved 2023-05-07.
  4. Ganguly, Nivedita (2023-01-30). "A peep into the 200-foot-long mobile underwater fish aquarium in Visakhapatnam". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-05-07.
  5. "Aquarium: కూకట్‌పల్లిలో అండర్‌ వాటర్‌ టన్నెల్‌ అక్వేరియం." EENADU. Retrieved 2023-05-07.