Jump to content

అగర సరస్సు

వికీపీడియా నుండి
అగర సరస్సు
A picture of Agara Lake
పునరుద్ధరణకు ముందు అగర సరస్సు దృశ్యం
అగర సరస్సు is located in India
అగర సరస్సు
అగర సరస్సు
ప్రదేశంబెంగళూరు ఆగ్నేయ దిశ,కర్ణాటక
అక్షాంశ,రేఖాంశాలు12°55′16″N 77°38′28″E / 12.921°N 77.641°E / 12.921; 77.641
ఉపరితల వైశాల్యం0.24 కి.మీ2 (0.093 చ. మై.)
ప్రాంతాలుబెంగళూరు

అగర సరస్సు కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో గల అగర ప్రాంతంలో ఉంది. ఇది 98 ఎకరాల విస్తీరణంలో విస్తరించిన ఒక సహజ సరస్సు. బెంగుళూరులో బాగా ప్రసిద్ధి చెందిన సరస్సులలో ఇది ఒకటి.[1]

భౌగోళికం

[మార్చు]

ఈ సరస్సు 8 వ శతాబ్దానికి చెందినదని చరిత్ర చెబుతుంది. దీనికి ఒక చివర ఉద్యానవనం ఉంది. దీని చుట్టూ పాదచారులు నడవటానికి జాగింగ్ మార్గం కూడా ఉంది. ఈ సరస్సులో దాదాపు 40 జాతుల సరీసృపాలు, వాటర్‌బర్డ్స్ కనుగొనబడ్డాయి. ఈ సరస్సు మడివల సరస్సు నీటితో నిండుతుంది. ఇక్కడి నుండి బెల్లందూర్ సరస్సుకి మిగులు జలాలు వెళ్తాయి.[1]

ప్రత్యేకత

[మార్చు]

అగర సరస్సులో అత్యంత ప్రసిద్ధ ఆకర్షణ చిల్డ్రన్-రూస్టర్ గ్లోబ్. ఇక్కడ 230 కి పైగా మొక్కలు నాటబడ్డాయి.[1]

అభివృద్ధి

[మార్చు]

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక సరస్సుల పరిరక్షణ - అభివృద్ధి అథారిటీ అనే పేరుతో రాష్ట్రంలోని అన్ని సరస్సుల అభివృద్ధికి ఒక ప్రణాళిక వేసి అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Agara Lake | Lakes in Bangalore | Bangalore". Karnataka.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-18. Retrieved 2018-03-20.
  2. Menezes, Naveen (2018). "How a group of citizen activists saved Bengaluru's Agara lake". The Economic Times. Retrieved 2018-03-20.