అగ్నిపూలు (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్నిపూలు
అగ్నిపూలు ధారావాహిక పోస్టర్
ఆధారంగానాన్ తంతి (నాలుగు తీగలు) అనే కన్నడ సీరియల్ మూలకథ
రచయిత
  • మంజులా నాయుడు
  • ఉషారాణి
దర్శకత్వంమంజులా నాయుడు
తారాగణంఅరవింద్, విజయ్, అంజు అస్రాని, అభినయ, శ్రీలక్ష్మి కనకాల
Theme music composerబంటి
Opening themeఅగ్నిపూలు
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల2 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య1326
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్
  • సుధాకర్ పల్లమాల
  • శశాంక్ పల్లమాల
నిడివి22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీశ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ ఎస్.డి., 1080ఐ హెచ్.డి.
వాస్తవ విడుదల13 ఆగస్టు 2012 (2012-08-13) –
25 ఆగస్టు 2017 (2017-08-25)
బాహ్య లంకెలు
Website

అగ్నిపూలు జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక. నాన్ తంతి (నాలుగు తీగలు) అనే కన్నడ సీరియల్ మూలకథ ఆధారంగా మంజులా నాయుడు రూపొందించిన ఈ ధారావాహిక 2012 ఆగస్టు 3వ తేదినుండి 2017 ఆగస్టు 25వ తేది వరకు 5 సంవత్సరాలపాటు 1326 ఎపిసోడ్లు ప్రసారమయింది. యద్దనపూడి సులోచనారాణి రాసిన అగ్నిపూలు నవల పేరు ఈ సీరియల్ కు పెట్టబడింది.

కథా నేపథ్యం

[మార్చు]

ఇది నలుగురు అమ్మాయిల మధ్యనున్న స్నేహం, బంధాలు, మానవత్వం, నైతిక విలువలపై ఆధారపడిన రూపొందించబడిన ధారావాహిక. అమాయక ప్రజలను వారి స్వార్థంకోసం హింసించే కొన్ని పాత్రలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ధారావాహిక వినోదంతోపాటు జీవిత పాఠాలను నేర్పుతుంది.

తండ్రి చనిపోయిన తరువాత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోకి వెళ్ళిన ఒక సాధారణ అమ్మాయి ఆ కుటుంబం ద్వారా ప్రపంచానికి ఎలా ఎదురు తిరిగింది అనేది మొదటి కథ. ఒక పాత్రికేయురాలుది రెండో కథ. తల్లితండ్రి లేని అమ్మాయి బొంబాయిలో రచయితగా ఎన్ని కష్టాలు ఎదర్కొని ఎలా ఎదిగింది అనేది మూడో కథ.

అగ్నిపూలు సూర్యుని వేడి, అడవి తుఫానులను ఎదుర్కొని అద్భుతమైన తన ప్రకాశాన్ని కోల్పోకుండా తాజాగా కొమ్మలపై నిలబడుతాయి. ఈ ధారావాహికలోని నలుగురు అమ్మాయిల పాత్రలు కూడా "అగ్ని పువ్వులు" లాగా నిజాయితీ, పట్టుదలతో సమాజ మంచికోసం నిరంతరం పాటుపడుతుంటారు.

నటవర్గం

[మార్చు]
  • అరవింద్
  • విజయ్ భార్గవ్
  • శ్రీనివాస్
  • అంజు అస్రాని[1][2]
  • అభినయ దాసరి
  • లాలాత్య
  • శిరీష
  • శ్రీలక్ష్మి కనకాల[3]
  • గురు
  • పవిత్రనాథ్ కార్తికేయ
  • ఆదర్శ్
  • సింధూజ
  • పూర్ణికాసాన్వి[4]
  • సింధూర
  • విక్రమ్
  • భార్గవరామ్
  • గురుచరణ్
  • గీతాంజలి చైతన్య[5]
  • భార్గవ్ గుత్తికొండ
  • విద్యాసాగర్
  • ప్రసన్న కుమార్
  • వంశీ
  • పావని రెడ్డి

సాంకేతికవర్గం

[మార్చు]
  • ఆధారం: నాన్ తంతి (నాలుగు తీగలు) అనే కన్నడ సీరియల్ మూలకథ
  • రచయిత: మంజులా నాయుడు, ఉషారాణి
  • దర్శకత్వం: మంజులా నాయుడు
  • టైటిల్ సాంగ్ కంపోజర్: బంటి
  • నిర్మాతలు: సుధాకర్ పల్లమాల, శశాంక్ పల్లమాల
  • ప్రొడక్షన్ సంస్థ: శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్

ఇతర వివరాలు

[మార్చు]
  1. ఇందులో ప్రధానపాత్ర పోషించిన శ్రీలక్ష్మి కనకాలకు 2017లో జెమిని స్పెషల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది.
  2. సినీనటుడు విద్యాసాగర్ 12ఏళ్ళ విరామం తరువాత ఈ ఇందులో నటించాడు.

మూలాలు

[మార్చు]
  1. నవతెలంగాణ, మానవి (26 July 2015). "ఛాలెంజింగ్‌ పాత్రలే ఇష్టం". NavaTelangana. Archived from the original on 7 April 2020. Retrieved 7 April 2020.
  2. అగ్నిపూల అంజు, నమస్తే తెలంగాణ జందగీ, 10 అక్టోబరు 2014
  3. The Times of India, Entertainment (6 April 2020). "Suma Kanakala's sister-in-law and TV actress Srilakshmi Kanakala passes away battling cancer". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 6 April 2020. Retrieved 7 April 2020.
  4. సాక్షి, ఫ్యామిలీ (14 August 2019). "యాడ్‌ ఫిల్మ్‌తో అవకాశం". Sakshi. జి. నిర్మలారెడ్డి. Archived from the original on 14 August 2019. Retrieved 7 April 2020.
  5. సాక్షి, ఫ్యామిలీ (29 May 2019). "సంప్రదాయ సిరి". Sakshi. జి. నిర్మలారెడ్డి. Archived from the original on 6 ఏప్రిల్ 2020. Retrieved 7 April 2020.