గీతాంజలి చైతన్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీతాంజలి చైతన్య
జననంమే 18, 1999
వృత్తిసినిమా, టెలివిజన్ నటి
తల్లిదండ్రులులోకేశ్వర్‌, అరుణ

గీతాంజలి చైతన్య తెలుగు సినిమా, టెలివిజన్ నటి. బాలనటిగా సినిమాలలో నటించిన గీతాంజలి, టీవి సీరియళ్ళలో నటిస్తోంది.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

గీతాంజలి 1999, మే 18న లోకేశ్వర్‌, అరుణ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. లోకేశ్వర్ బ్యాంక్‌ ఉద్యోగి, అరుణ గృహిణి. వైజాగ్ నుండి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు. దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందింది.[1]

సినిమారంగం

[మార్చు]

నటనపై ఆసక్తివున్న గీతాంజలి బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయమయి, మహాత్మ, మొగుడు, ఉయ్యాలా జంపాల, రేసుగుర్రం సినిమాల్లో బాలనటిగా చేసింది. భానుచందర్ కుమారుడు నటించిన మిక్సర్ పొట్లం సినిమలో హీరోయిన్ గా నటించింది. కానీ, ఆ సినిమా విడుదలకాలేదు.

టీవిరంగం

[మార్చు]

అమెరికా అమ్మాయి, వరూధిని పరిణయం టీవీ సీరియల్స్‌లోనూ బాలనటిగా చేసిన గీతాంజలి, జెమినీ టీవీలో వచ్చిన అగ్నిపూలు సీరియల్‌లో తొలిసారిగా ప్రధానపాత్రలో నటించింది. ఆ తరువాత సూర్యవంశం, రామ సక్కని సీత సీరియళ్ళలో నటించింది.[2]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, ఫ్యామిలీ (29 May 2019). "సంప్రదాయ సిరి". Sakshi. జి. నిర్మలారెడ్డి. Archived from the original on 6 ఏప్రిల్ 2020. Retrieved 30 April 2020.
  2. హోమ్లీ క్యారెక్టర్స్ ఇష్టం, వెలుగు, దర్వాజ (ఆదివారం సంచిక), నిఖిత నెల్లుట్ల, 5 మే 2019, పుట.14-15.

ఇతర లంకెలు

[మార్చు]