అజయ్ కుమార్ మిశ్రా
అజయ్ మిశ్రా తేని | |||
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 జులై 2021 2024 నిత్యానంద రాయ్ & నిషిత్ ప్రమాణిక్ తో సంయుక్త నిర్వహణ | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | జి.కిషన్ రెడ్డి | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం మే 2014 – 2024 | |||
ముందు | జాఫర్ అలీ నాక్వి | ||
నియోజకవర్గం | ఖేరి | ||
16వ ఉత్తరప్రదేశ్ శాసనసభలో సభ్యుడు
| |||
పదవీ కాలం మార్చి 2012 – మే 2014 | |||
ముందు | కృష్ణ గోపాల్ పటేల్ | ||
తరువాత | కృష్ణ గోపాల్ పటేల్ | ||
నియోజకవర్గం | నిఘాసన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] లఖింపూర్ ఖీరీ | 1960 సెప్టెంబరు 25||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | అంబికా ప్రసాద్ మిశ్రా (తండ్రి) | ||
జీవిత భాగస్వామి | పుష్ప మిశ్రా | ||
సంతానం | 3 | ||
నివాసం | బన్వీర్ పూర్, నిఘాసన్, లఖింపూర్ ఖీరీ (ఉత్తర్ ప్రదేశ్) | ||
పూర్వ విద్యార్థి | కాన్పూరు యూనివర్సిటీ (ఎల్‌ఎల్‌బీ)[2] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త |
అజయ్ కుమార్ మిశ్రా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]అజయ్ కుమార్ 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిఘాసన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 16వ ఉత్తరప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టాడు. ఆయన 2014, 2019లో ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా లోక్‌సభకు రెండుసార్లు వరుసగా ఎన్నికయ్యాడు. ఆయన 2021 జూలై 8 న నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితుడై బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
లఖింపూర్ హింసాకాండ
[మార్చు]ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో 2021 అక్టోబరు 3న సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపైకి ఆయన కొడుకు ఆశిశ్ మిశ్రా కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో మొత్తం 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.[4] కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి.[5] ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ అశిశ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో 2022 ఫిబ్రవరి 10వ తేదీన అశిశ్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.[6] ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ బాధిత కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు, యూపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ "Member Profile". Legislative Assembly official website. Retrieved 17 Dec 2015.
- ↑ "Shri Ajay Kumar Mishra | Ministry of Home Affairs | GoI".
- ↑ BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
- ↑ BBC News తెలుగు (3 October 2021). "లఖీంపుర్ ఖేరీ: రైతుల నిరసన ప్రదర్శనపైకి దూసుకెళ్లిన కారు.. ఎనిమిది మంది మృతి". Archived from the original on 6 April 2022. Retrieved 6 April 2022.
- ↑ Sakshi (17 December 2021). "అజయ్‌మిశ్రాను తొలగించాలి!". Archived from the original on 6 April 2022. Retrieved 6 April 2022.
- ↑ TV9 Telugu (15 February 2022). "లఖీంపూర్ ఖేరి కేసులో.. జైలు నుంచి విడుదలైన కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా." Archived from the original on 6 April 2022. Retrieved 6 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)