Jump to content

అజ్మీరా బాబీ

వికీపీడియా నుండి
(అజ్మీరా బాబి నుండి దారిమార్పు చెందింది)

అజ్మీరా బాబీ తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్ణపేటకు చెందిన విమాన పైలట్.దేశంలో తొలి లంబాడీ గిరిజన మహిళ పైలట్.అమెరికా,ఇండోనేషియాలో దేశాలలో పైలట్ శిక్షణ పూర్తి చేసింది[1][2][3].

అజ్మీరా బాబీ
త్రిపుర గవర్నర్ తో పైలట్ అజ్మీరా బాబీ
వ్యక్తిగత వివరాలు
జననంకర్ణపేట దండేపల్లి, మంచిర్యాల,తెలంగాణ, భారతదేశం
వృత్తికమర్సియల్ పైలట్
Military service
Allegiance భారతదేశం
Branch/serviceవైమానిక దళం, భారతదేశం
Rank కమర్సియల్ పైలెట్

జననం,విద్య

[మార్చు]

అజ్మీరా బాబీ తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలంలోని కర్ణపేట గ్రామంలో జన్మించింది. పదవ తరగతి ఇంటర్మీడియట్ లక్సెట్టిపేట, మంచిర్యాల యందు పూర్తి చేసి బి.ఏ డిగ్రీ సోషియాలజీ,సైకాలజి, పరిపాలనా శాస్త్రం కోర్సు చదవి అనంతరం ఎం.ఏ సోషియాలజీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నుండి బంగారు పతకం సాధించారు. ఆ తర్వాత ఎంబిఏ డిగ్రీ కూడా ఉత్తీర్ణులైనారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అజ్మీరా బాబీ తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో జన్మించింది.ఈమె తండ్రి వ్యవసాయదారుడు తల్లి గృహిణి.ఈమె చిన్నప్పుడు నుండి చదువులో చురుకుగా ఉండేది.విద్యార్థిగా ,చదువులు,క్రీడలు ,పాఠ్యేతర కార్యకలాపాలలో ఎన్.సి.సి క్యాడెట్ ,జాతీయ స్థాయిలో జావెలిన్ త్రోవర్ లో రాణించిన ఆమె మంచి ఆల్ రౌండర్ విద్యార్థినులలో ఆమే ఒకరు. బాబీ ఒక రోజు దుబాయ్ నుండి వచ్చే తన బంధువులను ఆహ్వానించడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళే క్రమంలో తన ఆశయానికి బీజం పడింది.ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలమని అంటోంది‌.

కెరీర్

[మార్చు]

అజ్మీరా బాబీ ఎంబిఏ డిగ్రీ పూర్తి కాగానే ఒక ఎయిర్ లైన్స్ సంస్థ కేబిన్ క్రూ సిబ్బంది కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తొలి ప్రయత్నంలో గగనసఖి ఎయిర్ హూస్టెస్ సాధించారు.ఐదేళ్ల పాటు విధులు కూడా నిర్వర్తించారు‌. కాని ఎయిర్ హూస్టెస్ వృతి సంతృప్తినివ్వకపోగా, పైలట్ కావాలనే కొరిక బలంగా ఉండేది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు కూడా ఈమెకు పూర్తి సహకారం అందించారు.ఎన్నో కష్టాలను ఓర్చుకొని అమెరికా,ప్లోరిడాలోని టమియామిలో ఉన్న డీన్ ఇంటర్నేషనల్ ప్లయింగ్ స్కూల్ లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణ పూర్తి చేసింది.ఇండోనేషియా దేశాలలో పైలట్ శిక్షణ పూర్తి చేసుకుని పైలట్ గా ఎంపికై పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచి దేశంలోనే తొలి బంజారా లంబాడీ మహిళ పైలట్ గా రికార్డును సొంతం చేసుకుంది[4].

ప్రభుత్వ ఆర్థిక సహాయం

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అజ్మీరా బాబీ ఒక గిరిజన మహిళలను పైలట్ లు గా ప్రోత్సహించేందుకు లక్ష రూపాయిలు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు[5].

ఇవి కూడా చూడండి

[మార్చు]

జోయా అగర్వాల్

మోహనా సింగ్

మూలాలు

[మార్చు]
  1. Chakravorty, Reshmi (2021-03-12). "From mud houses to soaring in the clouds". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-13.
  2. Jaffer, Askari (2018-07-12). "Flying high: Ajmeera Bobby". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-13.
  3. "international startup festival 2024: ప్రోత్సహిస్తే దూసుకుపోతారు". EENADU. Retrieved 2024-10-13.
  4. "Adilabad tribal woman pilot Azmeera Bobby helps Hyderabad women stand on their own legs, trains them as auto drivers - Times of India". The Times of India. Retrieved 2024-10-13.
  5. "KCR now helps tribal girl to chase her dream". The Hindu (in Indian English). 2015-03-31. ISSN 0971-751X. Retrieved 2024-10-13.