Jump to content

అటనాసియో మాన్‌సెరెట్

వికీపీడియా నుండి
అటానాసియో మోన్‌సెరెట్టే
అటనాసియో మాన్‌సెరెట్


శాసనసభ్యుడు
పదవీ కాలం
2022 మార్చి 10 – ప్రస్తుతం
నియోజకవర్గం పనాజీ
ఆధిక్యత 716

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి జెన్నీఫర్‌[1]

అటనాసియో మాన్‌సెరెట్ గోవా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

అటనాసియో మాన్‌సెరెట్ 2002లో యునైటెడ్ గోయన్స్ డెమోక్రాటిక్ పార్టీ ద్వారా రాజకియలోకి వచ్చి, 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తలైగావ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సోమనాథ్ దత్త జువార్కర్ పై 2261 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] గోవాలో 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ బీజేపీ ప్రభుత్వాన్ని మద్దత్తు తెలిపి మనోహర్ పారికర్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు. ఆయన 2002లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచి ప్రతాప్‌సింగ్ రాణే మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు. ఆయన 2007లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై దిగంబర్ కామత్ మంత్రివర్గంలో విద్య శాఖ మంత్రిగా పని చేశాడు.

అటనాసియో మాన్‌సెరెట్ 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున శాంటా క్రజ్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని 2015లో కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైయ్యాడు. ఆయన 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ శాసనసభ నియోజకవర్గం నుండి యునైటెడ్ గోయన్స్ డెమోక్రాటిక్ పార్టీ తరపున మనోహర్ పారికర్ చేతిలో ఓడిపోయి, 2019లో మనోహర్ పారికర్ మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[4] ఆయన 2022 గోవా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పై 716 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (10 March 2022). "మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  2. Scroll (10 March 2022). "Manohar Parrikar's son loses Panaji seat to BJP's Atanasio Monserrate". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  3. elections.traceall.in (2012). "Taleigao assembly election results in Goa". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  4. The Indian Express (23 May 2019). "Goa: Congress's Atanasio Monserrate wins Panaji assembly seat, says BJP cannot win without Parrikar" (in ఇంగ్లీష్). Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  5. TV9 Telugu (10 March 2022). "గెలిచినా ఆనందం లేదు.. పనాజీ బీజేపీ ఎమ్మెల్యే అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (10 March 2022). "గెలిచినా సంతోషం లేదంటున్న బీజేపీ అభ్యర్థి". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.