దిగంబర్ కామత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిగంబర్ కామత్
దిగంబర్ కామత్


ప్రతిపక్ష నేత, గోవా అసెంబ్లీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
18 జులై 2019
గవర్నరు మృదుల సిన్హా
సత్యపాల్ మాలిక్
భగత్ సింగ్ కొష్యారి
(అదనపు భాద్యత)
పి. ఎస్. శ్రీధరన్ పిళ్ళై
ముందు చంద్రకాంత్ కావలేకర్, కాంగ్రెస్ పార్టీ

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994
ముందు అనంత నార్సిన నాయక్
నియోజకవర్గం మార్గోవా

పదవీ కాలం
8 జూన్ 2007 – 9 మార్చి 2012
ముందు ప్రతాప్‌సింగ్ రాణే
తరువాత మనోహర్ పారికర్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-03-08) 1954 మార్చి 8 (వయసు 70)
మార్‌గావ్, గోవా, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ఆశ కామత్
సంతానం 2
నివాసం గోవా

దిగంబర్ వసంత్ కామత్ గోవా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గోవా 11వ ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. దిగంబర్ కామత్ 2006లో స్విమ్మింగ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

దిగంబర్ వసంతరావు కామత్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 1994లో భారతీయ జనతా పార్టీలో చేరి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన మార్గోవా నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి 2005లో నిర్వహించిన మార్గోవో నియోజకవర్గ ఓటర్ల రిఫరెండంలో ఓటర్ల మద్దతు ప్రకారం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి 2007 జూన్ 8న గోవా 11వ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి 2012 మార్చి 9 వరకు ముఖ్యమంత్రిగా పని చేశాడు.

దిగంబర్ కామత్ 2019లో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికై వ 17 జూలై 2019న గోవా శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన 2022 గోవా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (13 June 2006). "Kamat is new SFI president" (in Indian English). Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
  2. Eenadu (11 March 2022). "గోవాలో మళ్లీ భాజపా సర్కారు". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.