మృదుల సిన్హా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మృదుల సిన్హా (జననం 27 నవంబరు 1942) గోవా రాష్ట్రానికి గవర్నర్.[1] ఆమె రాజకీయ నాయకురాలు కావడమే కాక, సుప్రసిద్ధ హిందీ రచయిత్రి కూడా.[2][3]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

27 నవంబర్ 1942న బీహార్ రాష్ట్రంలో ఉన్న ముజఫ్ఫర్పూర్ జిల్లాలోని చప్రా ధరంపూర్ అనే గ్రామంలో జన్మించారు మృదుల. ఆమె తండ్రి బాబు చబిలే సింగ్, తల్లి అనుపా దేవి. ఆమె గ్రామంలోనే ఉన్న ఒకస్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్య చదువుకున్నారు. ఆ తరువాత లఖిసరై జిల్లాలోని బాలికా విద్యాపీఠ్ అనే రెసిడెన్షియల్ పాఠశాలలో చదువు కొనసాగించారు మృదుల.[4] చిన్నప్పటినుంచే హిందీ సాహిత్యం  పట్ల ఇష్టం పెంచుకున్న ఆమె, తరువాత హిందీ భాషలో గద్య సాహిత్యం రాయడం ప్రారంభించారు.

మూలాలు[మార్చు]

  1. "PRESS COMMUNIQUE". Press Information Bureau. 26 August 2014. Retrieved 26 August 2014. 
  2. "Sheila Dikshit resigns; Kalyan Singh is new Governor of Rajasthan". Indian Express. PTI. 26 August 2014. Retrieved 26 August 2014. 
  3. "Mridula Sinha appointed Goa Governor". Goa News. Goa News Desk. 26 August 2014. Retrieved 26 August 2014. 
  4. Balika Vidyapeeth