అనంత్ పాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Anant Pai
ಅನಂತ್ ಪೈ
अनंत पै
జననం(1929-09-17)1929 సెప్టెంబరు 17
కర్కాలా, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా
మరణం2011 ఫిబ్రవరి 24(2011-02-24) (వయసు 81)
ముంబై, మహారాష్ట్ర
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఅంకుల్ పాయ్
వాల్ట్ డిస్నీ ఆఫ్ ఇండియా[1]
గుర్తించదగిన సేవలు
అమర్ చిత్ర కథ
జీవిత భాగస్వామిలలితా పాయ్ (1961-2011)
వెబ్‌సైటుhttp://www.unclepai.com/

అంకుల్ పాయ్గా (తెలుగులో విడుదలైన పుస్తకాల్లో "పాయ్ మామ"గా) సుప్రసిద్ధుడైన అనంత్ పాయ్(Kannada:ಅನಂತ ಪೈ) (17 సెప్టెంబర్ 1929 – 24 ఫిబ్రవరి 2011) ఒక భారతీయ కామిక్స్ సృష్టికర్త. 1967 లో ఆయన ప్రారంభించిన అమర్ చిత్ర కథ పుస్తకాల ద్వారా పాఠకులకు బాగా చేరువయ్యాడు. బొమ్మల ద్వారా భారతీయ జానపద కథలను, పౌరాణిక కథలను తరువాతి తరం వారికి చేరువయ్యేలా చేశాడు. ఇది కాక, 1980లో పిల్లల కోసం మరొక బొమ్మల కథల పత్రిక "టింకిల్"ను కూడా ప్రారంభించాడు.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

అనంత్ పాయ్ కర్ణాటక లోని కర్కాలాలో వెంకటరాయ పాయ్, సుశీలా పాయ్ దంపతులకు జన్మించాడు. ఆయనకు రెండు సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులిద్దర్నీ పోగొట్టుకున్నాడు. పన్నెండు సంవత్సరాల వయసులో ముంబైకి వచ్చి మాహిమ్ లోని ఓరియంటల్ స్కూల్ లో చదివాడు. బాంబే విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం చదివాడు.

కామిక్స్, పుస్తక ప్రచురణ పట్ల ఉన్న ఆసక్తి కొద్దీ 1954లో "మానవ్" అన్న పిల్లల పత్రిక ఒకటి స్థాపించాడు కానీ, అది ఎక్కువ కాలం నిలబడలేదు. తరువాత "టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రికలో చేరాడు. ఆ సమయంలోనే ఆ పత్రిక "ఇంద్రజల్ కామిక్స్" మొదలుపెట్టింది.

ఆయన ధర్మపత్ని లలితా పాయ్.

సూచికలు

[మార్చు]
  1. PTI (2013-02-26). "Business Line : Features News : Amar Chitra Katha pays tribute to Uncle Pai with a comic title". Thehindubusinessline.com. Retrieved 2013-03-08.

యితర లింకులు

[మార్చు]