అనంత సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంత సింగ్
పుట్టిన తేదీ, స్థలం(1903-12-01)1903 డిసెంబరు 1
Chittagong, Bengal, British India
(now in Bangladesh)
మరణం1979 జనవరి 25(1979-01-25) (వయసు 75)
Calcutta , West Bengal, India
వృత్తిIndependence Activist
జాతీయతIndian
గుర్తింపునిచ్చిన రచనలుChittagong Armoury Raid

అనంత లాల్ సింగ్ (Ananta Lal Singh) ( 1903 డిసెంబరు 1 - 1979 జనవరి 25) ఒక భారతీయ విప్లవకారుడు, అతను 1930లో చిట్టగాంగ్ ఆయుధశాల దాడిలో పాల్గొన్నాడు. తరువాత, ఒక తీవ్ర వామపక్ష రాడికల్ కమ్యూనిస్ట్ గ్రూప్, రివల్యూషనరీ కమ్యూనిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను స్థాపించాడు.[1]

జీవితం

[మార్చు]

అనంత సింగ్ 1903 డిసెంబరు 1న చిట్టగాంగ్లో జన్మించాడు. అతని తండ్రి పేరు గోలప్ (గులాబ్) సింగ్. సింగ్ పూర్వీకులు పంజాబీ రాజపుత్రులు, వీరు ఆగ్రా నుండి వలస వచ్చి చిట్టగాంగ్ లో స్థిరపడ్డారు. అతను చిట్టగాంగ్ మునిసిపల్ స్కూల్ లో చదువుతున్నప్పుడు సూర్యసేన్ ను కలుసుకుని అతని అనుచరుడిగా మారాడు.[2] ఇందుమతి సింగ్ అతని సోదరి, ఆమె ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు.

అనంత సింగ్ తన చదువును ఎక్కువగా విద్యా సంస్థల్లో చదువుకోలేదు. అతడు పాఠశాలలో ఉన్నప్పుడు మాస్టర్- డా సూర్యసేన్ తో పరిచయం ఏర్పడింది, అనంత సింగ్ ధైర్యసాహసాలు, సామర్థ్యం, శౌర్యం, తెలివితేటలు, పని పట్ల శ్రద్ధ సూర్యసేన్ ను ఆకట్టుకున్నాడు. అనంత సింగ్ తొందరలో సూర్యసేన్ కు అత్యంత సన్నిహిత సహచరులలో ఒకరిగా మారాడు. చివరికి సింగ్ తన చదువును విడిచిపెట్టి సేన్ విప్లవ బృందంలో చేరాడు. 1921లో కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమంలో చేరేందుకు తన తోటి విద్యార్థులను ప్రేరేపించాడు. అయితే, ఆయన ఎన్నడూ దాని ఆదర్శాలకు లొంగలేదు. సహాయనిరాకరణోద్యమం విరమించబడినప్పుడు, అతను తన సమయాన్నంతా విప్లవ కార్యకలాపాలకు కేటాయించాడు. అతను విప్లవం కోసం ప్రజల కొరకు బాంబులను, మందులను తయారు చేసేవాడు. బాంబులను తయారు చేసే అతని సామర్ధ్యం ప్రచురించబడింది, కాని ఒక ఆంగ్లేయుడుకి తయారు చేసిన పేరు రావడం జరిగింది. బాంబుల తయారీ భారతదేశం అంతటా తొందరలో వ్యాపించింది. అనంత సింగ్ ఒకసారి విప్లవ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి అస్సాం-బెంగాల్ రైల్వే కంపెనీ డబ్బును దోచుకునే ఆపరేషన్‌కు నాయకత్వం వహించాడు. ఈ ఘటనలో పోలీసులతో పోరాడి కొండ ప్రాంతాల్లోకి అనంత సింగ్ పారిపోవడం జరిగింది.[3]

రచనలు

[మార్చు]

అనంత సింగ్ అనేక విప్లవ సాహిత్య పుస్తకములను రచించాడు. అతని ఆత్మకథ, కెయు బాలే దకాత్, కెయు బాలే బిప్లాబి, సమ్ కాల్ మి ఎ రాబర్, సమ్ కాల్ మీ ఎ రివల్యూషనరీ, అతని అత్యంత ప్రజాదరణ, పొందిన వివాదాస్పద రచనలు.ఇతర రచనలలో అమీ సేయ్ మే,, సూర్య సెనెర్ సప్నా, ఓ సాధన, అగ్నిగర్భ చత్తగ్రామ్ (చిట్టగాంగ్ ఆన్ ఫైర్), మాస్టర్డా ఆన్ సూర్య సేన్, ఛట్టాగ్రామ్ యుబబిద్రోహ (చిట్టగాంగ్ యూత్ రివల్యూషన్) 2 సంపుటాలుగా ప్రచురించబడ్డాయి.[4]

స్వాతంత్ర్య అనంతరం

[మార్చు]

భారతదేశం  స్వాతంత్ర్యం పొందిన తరువాత, అనంత సింగ్ 1960 సంవత్సరం కలకత్తాలో రివల్యూషనరీ కమ్యూనిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక కొత్త వామపక్ష రాజకీయ సంస్థను  స్థాపించాడు. విప్లవ బృందంలోని సభ్యులు ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలు కోసం నిధులను సేకరించడానికి కోల్ కతా లో అనేక బ్యాంకులను, పోస్టఆఫీసులను దోపిడీలు చేశారు.[5] 1969 లో ఆధునిక జార్ఖండ్ రాష్ట్రంలోని జాదుగూడ సమీపంలోని అడవిలో విప్లవ సంస్థల  సభ్యులతో పాటు అతనిని అరెస్టు చేయడం,  అనంత సింగ్ 1977 సంవత్సరం  వరకు జైలు శిక్ష అనుభవించాడు. అనంత సింగ్  1979 జనవరి 25 న మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Ananta Singh". Google Arts & Culture (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-08. Retrieved 2022-04-08.
  2. Basu, Anjali (1960). Samsad Bangali Charitabhidhan (in Bengali). Kolkata: Sahitya Sansad. p. 14.
  3. "Singh, Ananta - Banglapedia". en.banglapedia.org (in ఇంగ్లీష్). Retrieved 2022-04-08.
  4. 4.0 4.1 "Ananta Singh, Indian Revolutionary". IndiaNetzone.com. Retrieved 2022-04-09.
  5. Jul 16, Saibal Gupta / TNN / Updated:; 2015; Ist, 04:02. "Revealed: Inside story of the 1968-69 Calcutta robberies | Kolkata News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-09. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)