Jump to content

అనితా బోస్

వికీపీడియా నుండి
అనితా బోస్
అనితా బోస్, ప్రణబ్ ముఖర్జీ, భారత మాజీ రాష్ట్రపతి
జననం
అనితా షెంకెల్

(1942-11-29) 1942 నవంబరు 29 (వయసు 82)
జీవిత భాగస్వామిమార్టిన్ పాఫ్
పిల్లలు
  • పీటర్ అరుణ్
  • థామస్ కృష్ణ
  • మాయ కారినా
తల్లిదండ్రులుసుభాష్ చంద్ర బోస్, ఎమిలీ షెంకెల్

అనితా బోస్ (ఆంగ్లం: Anita Bose Pfaff) భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతురు. తల్లి ఎమిలీ షెంకెల్ (ఆస్ట్రియా). అనితా బోస్ ఒక ఆస్ట్రియన్ ఆర్థికవేత్త. ఆగ్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేసారు. సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ జర్మనీలో[1] రాజకీయవేత్తగా ఎదిగారు.

బాల్యం, విద్య

[మార్చు]

1942లో నవంబరు 29న ఎమిలీ షెంకెల్. సుభాష్ చంద్ర బోస్‌లకు కలిగిన ఏకైక సంతానం అనిత. ఆమె నాలుగు నెలల వయస్సులోనే బోస్ ఇంపీరియల్ జపాన్ సహాయంతో బ్రిటిష్ రాజ్‌పై సాయుధ దాడికి ప్రయత్నించే ఉద్దేశంతో ఆగ్నేయాసియాకు వెళ్లారు. వీరు ఐరోపాలోనే ఉన్నారు. తల్లి, అమ్మమ్మల[2] దగ్గర పెరిగిన అనితకు తండ్రి చివరి పేరు కాక అనితా షెంకెల్‌గా పెరిగింది.[2]

వృత్తి

[మార్చు]

2012 నాటికి, అనితా బోస్ ఆగ్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు.

వైవాహిక జీవితం

[మార్చు]

అనిత ప్రొఫెసర్ మార్టిన్ పాఫ్ ని వివాహం చేసుకుంది. అతను బుండెస్టాగ్ (జర్మన్ పార్లమెంట్) సభ్యుడు. వారికి ముగ్గురు పిల్లలు: పీటర్ అరుణ్, థామస్ కృష్ణ, మాయ కరీనా.[3]

మీడియా

[మార్చు]

'నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో' అనే బాలీవుడ్ చిత్రంలో అనితా బోస్ గురించిన ప్రస్తావన ఉంది.[4]

2021లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం జనవరి 23వ తేదీని పరాక్రం దివస్‌గా ప్రకటించింది. నేతాజీ జయంతిని వేడుకగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించడం పట్ల ఆయన కూతురు డా. అనితా బోస్ పాఫ్ హర్షం వ్యక్తం చేశారు. దేశం పట్ల ఆయనుకున్న అమితమైన ప్రేమే మిగతావాటన్నింటీని అధిగమించేలా చేసిందని తెలిపారు. స్నేహితులు, కుటుంబంతో విధేయతగా ఉండేవారని, దేశం స్వేచ్ఛ కోసం ప్రాణాలనే పణంగా పెట్టారని స్మరించుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "'To have an iconic dad is, of course, difficult' says Anita Bose Pfaff, Netaji Subhash Chandra Bose's daughter".
  2. 2.0 2.1 Madhuri Bose (12 November 2015). The Bose Brothers and Indian Independence: An Insider’s Account. SAGE Publications. ISBN 978-93-5150-396-5.
  3. "Netaji's daughter speaks!". www.rediff.com.
  4. "Netaji Subhas Chandra Bose: The Forgotten Hero" – via www.imdb.com.