ఎమిలీ షెంకెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎమిలీ షెంకెల్
Subhas Chandra Bose and Wife Emilie Shenkl with German Shephard - 1937.jpg
సుభాష్ చంద్ర బోస్ తో ఎమిలీ షెంకెల్
జననం
ఎమిలీ షెంకెల్

(1910-12-26)1910 డిసెంబరు 26
మరణం13 March 1996(1996-03-13) (aged 85)
వియన్నా, ఆస్ట్రియా
జాతీయతఆస్ట్రో-హంగేరియన్ (1910-18)
ఆస్ట్రో-జర్మన్ (1918-19)
ఆస్ట్రియన్ (1919–96)
వృత్తిస్టెనోగ్రాఫర్
జీవిత భాగస్వామిసుభాష్ చంద్ర బోస్
పిల్లలు అనితా బోస్​ పాఫ్

ఎమిలీ షెంకెల్ (ఆంగ్లం: Emilie Schenkl) జనవరి 26, 1910లో ఆస్ట్రియాలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె 23 ఏళ్ల  ప్రాయంలో వియన్నా, ఆస్ట్రియా(యూరప్‌)లో చికిత్స పొందుతున్న సుభాష్ చంద్రబోస్ 'ద ఇండియన్ స్ట్రగుల్'  అనే పుస్తకం రాయడంలో సహాయకురాలిగా నియమితురాలైంది. ఎమిలీ షెంకెల్  1934 జూన్ నుంచి 34 ఏళ్ల సుభాష్ చంద్రబోస్ తో కలిసి పని చేయడం ప్రారంభించింది.

వృత్తి, కుటుంబం[మార్చు]

ఎమిలీ షెంకెల్ - సుభాష్ చంద్రబోస్ భార్య[1] (సహచరి)[2]. వారి కుమార్తె, అనితా బోస్​ పాఫ్ (జననం: 29 నవంబర్ 1942)[1][3]. 1943 ఫిబ్రవరి యుద్ధ సమయంలో వారిని సుభాష్ చంద్రబోస్ వదిలి ఆగ్నేయాసియాకు వెళ్ళి 1945లో[4] మరణించాడు. 1948లో, సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ చంద్రబోస్ వియన్నాలో వారిని కలుసుకున్నాడు[5]. యుద్ధానంతర సంవత్సరాల్లో, కుటుంబ పోషణ కోసం ఎమిలీ షెంకెల్ ట్రంక్ ఎక్స్ఛేంజ్‌లో పనిచేసింది.[6]

ప్రారంభ జీవితం[మార్చు]

ఎమిలీ షెంకెల్ తాత షూ మేకర్[7], తండ్రి పశువైద్యుడు. విద్యను అభ్యసించడానికి తండ్రి విముఖత కారణంగా, ప్రాథమిక విద్యను తను ఆలస్యంగా ప్రారంభించింది. ఎమిలీ షెంకెల్ మాధ్యమిక పాఠశాల చదువులో పురోగతి పట్ల ఆమె తండ్రి అసంతృప్తి చెందాడు.[7] ఆమెను నాలుగు సంవత్సరాల పాటు సన్యాసినిగా మార్చాడు.[7] న్యాసినిగా మిగిలిపోకూడదని నిర్ణయించుకున్న ఎమిలీ షెంకెల్  తిరిగి పాఠశాలకు వెళ్లి, 20 ఏళ్ళ వయసులో చదువును పూర్తి చేసింది. ఐరోపాలో ఆర్థిక సంక్షోభం కారణంగా కొన్ని సంవత్సరాల పాటూ ఆమె నిరుద్యోగిగా ఉంది.[7]

ఆమె వియన్నాలో నివసిస్తున్న భారతీయ వైద్యుడు డాక్టర్ మాథుర్ ద్వారా సుభాష్ చంద్ర బోస్‌ దగ్గర స్టెనోగ్రాఫర్ గా ఉద్యోగంలో చేరింది.[7] ఎమిలీ షెంకెల్ షార్ట్‌హ్యాండ్ తీసుకోగలదు. ఇంగ్లీష్ భాష, టైపింగ్ నైపుణ్యాలు బాగున్నాయి. ఆమె సహకారంతో సుభాష్ చంద్ర బోస్  'ది ఇండియన్ స్ట్రగుల్'[7] అనే పుస్తకాన్ని పూర్తిచేసాడు. ఆయన ఆలోచనలన్నీ దేశ స్వాతంత్ర్యం మీదే నిమగ్నమై ఉన్నా ఎమిలీ  షెంకెల్ తో ప్రేమలో పడ్డాడు. వారు 1937లో ఒక హిందూ వేడుకలో రహస్యంగా వివాహం చేసుకున్నారు.[1][2] కానీ పురోహితులు, సాక్షులు, ఎలాంటి రికార్డు లేదు. సుభాష్ చంద్ర బోస్ భారతదేశానికి తిరిగి వెళ్ళి 1941 ఏప్రిల్ -ఫిబ్రవరి 1943 లో నాజీ జర్మనీలో తిరిగి కనిపించాడు.

వివాహ జీవితం[మార్చు]

వారి తొమ్మిది సంవత్సరాల వివాహ జీవితంలో.. ఎమిలీ షెంకెల్, సుభాష్ చంద్ర బోస్ కలసి ఉన్నది కేవలం మూడు సంవత్సరాలే. ఇది ఎమిలీ షెంకెల్ పై ఒత్తిడి తెచ్చింది. ఎమిలీ షెంకెల్ ఆమె కుమార్తె అనితా బోస్ యుద్ధం నుండి బయటపడ్డారు. తనతో పాటూ తల్లి, కూతురును పోషించుకోవడానికి ట్రంక్ ఎక్స్ఛేంజ్‌లో పనిచేసేది. సుభాష్ చంద్ర బోస్ బంధువులు, ముఖ్యంగా అతని సోదరుడు శరత్ చంద్ర బోస్‌ ఆస్ట్రియాలో ఆమెని కలసి భారతదేశం స్వాగతించినా ఆమె నిరాకరించారు. ఆమె 1996లో మరణించింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Hayes 2011, p. 15.
  2. 2.0 2.1 Gordon 1990, pp. 344–345.
  3. Hayes 2011, p. 67.
  4. Bose 2005, p. 255.
  5. Gordon 1990, p. 595–596.
  6. Santhanam 2001.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 Gordon 1990, p. 285.