అనితా శుభదర్శిని
అనితా శుభదర్శిని | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
ముందు | ప్రమీలా బిసోయి | ||
---|---|---|---|
నియోజకవర్గం | అస్కా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 23 సెప్టెంబర్ 1972 భువనేశ్వర్, ఒడిశా | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | ![]() | ||
తల్లిదండ్రులు | రామకృష్ణ పట్నాయక్, కౌముది | ||
జీవిత భాగస్వామి | ప్రభాత్ కుమార్ మొహంతి | ||
నివాసం | దుంకపడ, పొలసర, ఒడిశా | ||
మూలం | [1] |
అనితా శుభదర్శిని (జననం 23 సెప్టెంబర్ 1972) భారతదేశానికి చెందిన న్యాయవాది, రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అస్కా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3][4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]అనితా శుభదర్శిని 1972 సెప్టెంబర్ 23న ఒడిశా రాష్ట్రం, భువనేశ్వర్ లో జన్మించింది. ఆమె న 1994లో ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత 2006లో ఒడిశాలోని ఉత్కల్ విశ్వవిద్యాలయంలోని కళింగ లా కాలేజీ నుండి లా పూర్తి చేసింది.
రాజకీయ జీవితం
[మార్చు]అనితా శుభదర్శిని భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అస్కా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి ప్రమీలా బిసోయి చేతిలో 2,04,707 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి రంజితా సాహుపై 99,974 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[5][6][7] అనితకు 4,94,226 ఓట్లు రాగా, బిజెడి అభ్యర్థి రంజితా సాహు 3,94,252 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది.[8][9]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ "Aska Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Odisha: four women candidates win seats in Lok Sabha elections" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 6 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Women register impressive wins". The Times of India. 5 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Odisha: Victory for four women candidates in Lok Sabha elections". The Economic Times. 6 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Inheritors | Next-gen netas" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "BJP की अस्का सीट से जीतीं अनीता शुभदर्शनी पेशे से हैं वकील, 99, 974 वोटों से मारी बाजी". TV9 Bharatvarsh. 5 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Aska" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Aska election results 2024 live updates: BJP's Anita Subhadarshini triumphs in Aska, defeats BJD's Ranjita Sahu by 99,974 votes". The Times of India. 2024-06-05. ISSN 0971-8257. Retrieved 2024-06-05.