అనిత ఆర్. రాధాకృష్ణన్
అనిత ఆర్. రాధాకృష్ణన్ | |||
మత్స్యశాఖ, మత్స్యకారుల సంక్షేమం, పశుసంవర్ధక శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 మే 2021 | |||
ముందు | డి. జయకుమార్ | ||
---|---|---|---|
హౌసింగ్ , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2002 – 12 మే 2006 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 19 మే 2001 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తండుపతు, ఉడంగుడి, తూత్తుకూడి, తమిళనాడు, భారతదేశం | 1951 సెప్టెంబరు 19||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
నివాసం | మధురై, తమిళనాడు, భారతదేశం |
అనిత ఆర్. రాధాకృష్ణన్ (జననం 1951 సెప్టెంబరు 19) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు శాసనసభకు ఎన్నికై, 2002 నుండి 2006 వరకు హౌసింగ్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర మృత్స్యకార, పశుసంవర్ధక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అనిత ఆర్. రాధాకృష్ణన్ అన్నాడీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2001లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరుచెందూర్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జయలలిత మంత్రివర్గంలో 2002 నుండి 2006 వరకు హౌసింగ్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన 2006లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాధాకృష్ణన్ ను 2009 జూలై 30న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నుండి బహిష్కరించింది.[2] ఆయన ఆ తరువాత డీఎంకే పార్టీలో చేరి 2009లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ఆ తరువాత వరుసగా 2011, 2016, 2021 ఎన్నికల్లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర మృత్స్యకార, పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3][4]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం |
---|---|---|---|
2001[5] | తిరుచెందూర్ | అన్నాడీఎంకే | గెలుపు |
2006[6] | తిరుచెందూర్ | అన్నాడీఎంకే | గెలుపు |
2009 | తిరుచెందూర్ | డిఎంకె | గెలుపు |
2011[7] | తిరుచెందూర్ | డిఎంకె | గెలుపు |
2016[8] | తిరుచెందూర్ | డిఎంకె | గెలుపు |
2021[9] | తిరుచెందూర్ | డిఎంకె | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ "AIADMK expels 2 of its MLAs". The Hindu. Chennai, India. 30 July 2009. Archived from the original on 1 August 2009.
- ↑ Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2001 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2006 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2011 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "Tamil Nadu General Legislative Election 2016, Election Commission of India".
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.