Coordinates: 14°29′40″N 78°28′28″E / 14.4944906°N 78.4744153°E / 14.4944906; 78.4744153

అనిమెల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిమెల
—  రెవెన్యూ గ్రామం  —
అనిమెల is located in Andhra Pradesh
అనిమెల
అనిమెల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°29′40″N 78°28′28″E / 14.4944906°N 78.4744153°E / 14.4944906; 78.4744153
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం వీరపునాయునిపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,837
 - పురుషులు 2,964
 - స్త్రీలు 2,873
 - గృహాల సంఖ్య 1,463
పిన్ కోడ్ 516321
ఎస్.టి.డి కోడ్

అనిమెల, వైఎస్‌ఆర్ జిల్లా, వీరపునాయునిపల్లె మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామానికి నాలుగు వైపులా నాలుగు కొండలు ఉన్నాయి. తూర్పున సుడిబొట్టు, పశ్చిమాన ఎర్రమటిగుట్ట, దక్షిణాన పాలకొండ, ఉత్తరాన కోరుకొండ ఉన్నాయి. అనిమెల అన్న పేరు అని, మల రెండు పదాల కలయికతో వచ్చింది. ద్రవిడ భాషలలో అని అనగా ఏనుగు, మల అంటే కొండ. ఈ సమీపాన ఉన్న కొండలు అటవీ మయమై ఏనుగులతో నిండి ఉండేవట. అందుకే ఆ కొండకు అనిమెల కొండ అని, కొండ క్రిందన ఉన్న గ్రామానికి అనిమెల అని పేరువచ్చింది.[1]

ఇది మండల కేంద్రమైన వీరపునాయునిపల్లె నుండి కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ప్రొద్దుటూరు నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1463 ఇళ్లతో, 5837 జనాభాతో 3833 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2964, ఆడవారి సంఖ్య 2873. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 950 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 154. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 593271[2].పిన్ కోడ్: 516321.

చరిత్ర

[మార్చు]

గ్రామంలో 1531 నుండి 1592 వరకు విజయనగర కాలం (ముఖ్యంగా తుళువ వంశపు) నాటి 11 శాసనాలు లభ్యమయ్యాయి. వాటిలో అత్యంత పురాతమైనది 1531లో అచ్యుతరాయల కాలం నాటిది, 1543లో చెక్కించబడిన మరో శిలాశాసనంలో మహామండలేశ్వర గురవయ్య చోడదేవ మహాశివరాత్రి రోజు సంగమేశ్వర ఆలయానికి నాలుగు గ్రామాలు దానమిచ్చిన ప్రస్తావన ఉంది. మిగిలినవన్నీ 1592 వరకు చేసిన చిన్న చిన్న దానాలను ప్రస్తావిస్తున్నాయి.[3] అంతకు ముందు ఉన్న చరిత్రను బట్టి ఈ గ్రామం రాష్ట్రకూటుల సామంతులైన వైదుంబులు|వైదుంబుల పాలనలో ఉండేదని తెలుస్తున్నది. ఆ తరువాత కాలపు శాసనాలలో మట్లి కుమార అనంతరాజు 1644లో చెన్నకేశవస్వామి ఆలయానికి చేసిన దానప్రస్తావన ఉంది. విజయనగర సామ్రాజ్యాన్ని వెంకటపతి రాయలు పాలిస్తున్న కాలంలో, తండ్రి మరణించినగానే కుమార అనంతరాజు పాలనను హస్తగతం చేసుకున్నాడు. అనంతరాజు పాలన చేపట్టిన వెంటనే అనిమెలతో పాటు అనేక గ్రామాలకు చెందిన పాలెగాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ తిరిగుబాట్లలో ఆయన తమ్ముడు ఎల్లమరాజు హస్తం ఉంది. కుమార అనంతరాజు అనిమెల వద్ద జరిగిన యుద్ధంలో పాలెగాళ్లను అణచివేసి, ఎల్లమను బంధించి కారాగారంలో వేశాడు.[4]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం ప్రొద్దటూరు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, కడప లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

అనిమెలలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక కుటుంబ సంక్షేమ కేంద్రంలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

అనిమెలలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

అనిమెలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1198 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 539 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 161 హెక్టార్లు
 • బంజరు భూమి: 933 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1000 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 1981 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 112 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

అనిమెలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 112 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

అనిమెలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వేరుశనగ, పొద్దుతిరుగుడు, శనగ

దేవాలయాలు

[మార్చు]

అనిమెల గ్రామంలో రెండు దేవాలయాలు ఉన్నాయి.

సంగమేశ్వరాలయం

[మార్చు]

పాపాగ్ని, మొగమేరు, ఉద్ధండవాగు అనే మూడు నదుల కలయిక ఇక్కడే జరగటం మూలాన ఈ దేవాలయానికి సంగం అనే పేరు కలిపారు. ఈ దేవాలయంలో ఉన్న ధ్వజారోహణస్తంభంపై ఒక పంచలోహ చిలుక చూడటానికి అందంగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి, గుర్రపుశాలలు ఇక్కడ కనిపిస్తాయి. ఒకప్పుడు ఇక్కడ ఐదు రోజుల పాటు తిరుణాల జరిపేవారు. కార్తీక మాసంలోని నాలుగు సోమవారాలు ఇక్కడ తిరుణాల జరుగును. అలాగే శివరాత్రి పర్వదినాన ఇక్కడ హరికథా కాలక్షేపం జరుగును. ఈ ఆలయానికి నాలుగు ప్రధాన గోపురాలున్నాయి. అన్నీ ఒకే సమయంలో కట్టించినవి కావని నిర్ధారించారు. సంగమ స్థలంలో కొండపై ఉన్న ఈ గుడి యొక్క గోపురాలు అనేక కిలోమీటర్ల వరకు కనిపిస్తాయి.

భోగదెమ్మ తిరుణాల

[మార్చు]

స్థానిక ప్రజలకు భోగదెమ్మ దేవత మీద అపార నమ్మకముంది. గ్రామంలో ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు తిరుణాల జరుపుతారు. ఈ తిరుణాలలో మొదటి రోజు బియ్యం కొలత అనగా వూరిలో అందరి ఇళ్లలో నుంచి బియ్యం సేకరించి అమ్మవారికి ప్రసాదం చేస్తారు. రెండవ రోజు దున్నపోతుల బలి కార్యక్రమం వుంటుంది. వూరిలో కొందరు అమ్మవారికి దున్నపోతులను బలి ఇస్తామని మొక్కు పెట్టుకుంటారు. అలా మొక్కుబడులుగా సేకరించిన దున్నపోతులన్నింటినీ మధ్యాహ్నం 3 గంటల నుంచి బలి ఇస్తారు. మూడవ రోజు గ్రామంలోని ప్రజల యొక్క ఎడ్లతో అమ్మవారి తేరును ఉత్సవంగా వూరేస్తారు. నాలుగవ, ఐదవ రోజులు కూడా తేరు ఉరేగింపు కొనసాగుతుంది కానీ ఈ చివరి రెండు రోజులలో ఉరేగింపు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఎడ్లను ఉపయోగిస్తారు. ఇవేకాక తిరుణాల పొడవునా అనేక వినోద పోటీలను నిర్వహిస్తారు.

చూడదగిన ప్రదేశాలు

[మార్చు]

ఇక్కడ ఉన్న చిన్న చెలిమి, పెద్ద చెలిమి వాగులు చూడదగినవి. చుట్టూ ఉన్న మామిడి చెట్ట్ల వలన ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఈ వాగులు కొండపై ఎక్కడ పుట్టాయో ఇంకా కనుక్కోలేదు. అంతేకాదు ఈ ప్రదేశంలోనే రామకృష్ణాశ్రమం ఉంది.

మూలాలు

[మార్చు]
 1. Temples of Cuddapah District - Aenuganti Gurumurthi
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 3. Encyclopaedia of Indian temple architecture, Volume 1, Part 4
 4. Sanskrit and indological studies: Dr. V. Raghavan felicitation volume
"https://te.wikipedia.org/w/index.php?title=అనిమెల&oldid=4116299" నుండి వెలికితీశారు