అనిల్ బలూని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ బలూని

భారతీయ జనతా పార్టీ జాతీయ మీడియా ఇంచార్జి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 సెప్టెంబర్ 2020

పదవీ కాలం
3 ఏప్రిల్ 2018 – 2 ఏప్రిల్ 2024
ముందు మహేంద్ర సింగ్ మహరా
తరువాత మహేంద్ర భట్
నియోజకవర్గం ఉత్తరాఖండ్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-02) 1970 డిసెంబరు 2 (వయసు 53)
పౌరీ గర్వాల్ , ఉత్తరాఖండ్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి దీప్తి జోషి
సంతానం 2
నివాసం కత్గోడం , ఉత్తరాఖండ్
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

అనిల్ బలూని (జననం 2 డిసెంబర్ 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 3 ఏప్రిల్ 2018 నుండి 2 ఏప్రిల్ 2024 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అనిల్ బలూని 2 డిసెంబర్ 1970న జన్మించాడు. ఆయన జర్నలిజం పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అనిల్ బలూని విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ఆ తరువాత 199 దశకంలో ఢిల్లీలో జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాడు. ఆయన సుందర్ సింగ్ భండారి 1998-1999లో బీహార్ గవర్నర్‌గా నియమితుడవగా ఆయన భండారీకి ఓఎస్డి (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా, ఆ తరువాత 1999 నుండి 2003 వరకు గుజరాత్‌ గవర్నర్‌ భండారీకి ఓఎస్డి (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేశాడు. భండారీ వద్ద గుజరాత్‌లో ఓఎస్డి (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేసిన సమయంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలతో సాన్నిహిత్యం పెరిగి 2010 నుండి 2012 వరకు ఉత్తరాఖండ్ అటవీ & పర్యావరణ సలహా కమిటీ వైస్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.

అనిల్ బలూనీ 2002లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కోట్‌ద్వార్ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేయగా ఆయన నామినేషన్ పత్రం తిరస్కరించబడింది. దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2004లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనను ఆ తరువాత అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడైన తర్వాత 2017లో బీజేపీ జాతీయ మీడియా విభాగం అధ్యక్షుడిగా నియమించాడు.[1] ఆయన 2018లో ఉత్తరాఖండ్ నుండి రాజసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (1 April 2017). "Anil Baluni to head BJP's media cell" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
  2. The Indian Express (15 March 2018). "BJP's Anil Baluni declared elected to Rajya Sabha from Uttarakhand" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.